అంతర్జాతీయంఒకే బిడ్డ విధానం రద్దుచేసిన చైనా
చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికార కమ్యూనిస్టు పార్టీ అక్టోబరు 29న ప్రకటించింది. ఇకపై ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది. దేశంలో వృద్దుల సంఖ్య పెరగడం, కార్మిక శక్తి తగ్గడంతో రెండింటి మధ్య సమతుల్యం పాటించేందుకు ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం 1970 చివర్లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పట్టణప్రాంతాల్లోని జంటలు ఒకే బిడ్డను కనాలి. గ్రామీణ ప్రాంతాల్లో తొలికాన్పు ఆడపిల్ల పుడితేనే రెండో కాన్పునకు అనుమతి ఉంటుంది. 2013 లెక్కల ప్రకారం చైనా జనాభా 135 కోట్లకు పైగా ఉంది.
టాంజానియా అధ్యక్షుడిగా పాంబే మగుఫులిటాంజానియా అధ్యక్ష ఎన్నికల్లో అధికార చమా చమ పిండుజి(సీసీఎం) పార్టీకి చెందిన జాన్ పాంబే మగుఫులి విజయం సాధించారు. అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ముగుఫులికి 58.46 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ లొవస్సాకు 39.97 శాతం ఓట్లు వచ్చాయి. టాంజానియాలో 1977 నుంచి సీసీఎం పార్టీ అధికారంలో కొనసాగుతోంది.
రష్యా విమానం కూలిన దుర్ఘటనలో 224 మంది మృతిరష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలో అక్టోబరు 31న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ విమానం ఎర్రసముద్రంలోని పర్యాటక ప్రాంతం షర్‌మఎల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుంది. ప్రయాణికుల్లో రష్యాకు చెందిన 214 మంది, ఉక్రెయిన్‌కు చెందిన ముగ్గురితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ విమానాన్ని తామే కూల్చినట్లు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. రష్యాలో తమసంస్థపై దాడులకు ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల కూలిపోయి ఉంటుందని రష్యా వెల్లడించింది.
2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబరు 29న తన నివేదికలో ప్రకటించింది. 2014లో ప్రపంచవ్యాప్తంగా 96 లక్షల మందికి కొత్తగా క్షయ వ్యాధి సోకింది. భారత్‌లో అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, చైనాలో 10 శాతం చొప్పున నమోదయ్యాయి. 2014లో మరణించిన 15 లక్షల మందిలో మూడింట రెండొంతుల మంది భారత్, నైజీరియాలోనే ఉన్నారు. క్షయవ్యాప్తి 1990లో కన్నా 2015లో 42 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
‘గే’ల పెళ్లికి ఐర్లాండ్ అనుమతిస్వలింగ సంపర్కుల వివాహానికి ఐర్లాండ్ అనుమతినిచ్చింది. ఈ మేరకు ‘వివాహ బిల్లు 2015’లో మార్పులు చేస్తూ అక్టోబర్ 30న అధ్యక్ష కమిషన్ చట్టం తీసుకొచ్చింది. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 62.1 శాతం ప్రజలు గేలకు మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గేలకు మద్దతుగా చట్టం తీసుకొచ్చిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది.
మాల్దీవుల్లో ఎమర్జెన్సీమాల్దీవుల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున నవంబర్ 4 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ వెల్లడించారు. అక్టోబర్ 31న అధ్యక్ష భవనం దగ్గర్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరకడం, అధ్యక్షుడిపై హత్యాయత్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) తలపెట్టిన నిరసనకు రెండురోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మహమద్ నషీద్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద దోషిగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఎండీపీ ఆందోళన కార్యక్రమం తలపెట్టింది.
రోమానియా ప్రధాని రాజీనామారోమానియా దేశ చరిత్రలో ఎన్నడూలేనంతటి ఘోర అగ్ని ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి విక్టర్ పొంటా నవంబర్ 4న తన పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 6వ తేదీన బుకారెస్ట్‌లోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మంది క్షతగాత్రుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. దాంతో ఆగ్రహించిన 20,000 మంది స్థానికులు నవంబర్ 2న సిటీలోని ప్రఖ్యాత విక్టరీ స్క్వేర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రధాని గద్దెదిగాలని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పొంటా ప్రకటించారు. రోమానియాకు పోంటా 2012 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.
జాతీయం
వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 130వ స్థానం
ప్రపంచబ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట రూపొందించిన జాబితాలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల జాబితాను ప్రపంచబ్యాంకు అక్టోబరు 28న విడుదల చేసింది. కొత్త కంపెనీల చట్టం, మెరుగైన విద్యుత్ సరఫరా వంటి అంశాలు భారత్‌ను 130వ స్థానంలో నిలిపాయి. మొత్తం జాబితాలో సింగపూర్‌కు మొదటి ర్యాంక్ వచ్చింది. న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 7వస్థానం ప్రపంచంలో అత్యంత విలువైన జాతీయబ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఈ ఏడాది 7వ స్థానం దక్కింది. భారత బ్రాండ్ ఫైనాన్స్ నవంబరు 1న విడుదల చేసిన 100 దేశాల జాబితాలో భారత్ ఒకస్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకుంది. భారత్ బ్రాండ్ విలువ 210 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్‌లు వరసగా టాప్ స్థానాల్లో ఉన్నాయి. అమెరికా బ్రాండ్ విలువ 1970 కోట్ల డాలర్లుగా ఉంది. ఒకదేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల విక్రయాల ఆధారంగా జాతీయ బ్రాండు విలువను లెక్కిస్తారు.
పసిడి వినియోగం భారత్‌లో అధికంప్రపంచంలో అత్యధికంగా పసిడి వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత్ తొమ్మిది నెలల్లో 642 టన్నుల బంగారాన్ని వినియోగించిందని జీఎఫ్‌ఎంఎస్ గోల్డ్ సర్వే 2015 మూడో త్రైమాసిక రిపోర్టులో థామ్సన్ రాయిటర్స్ పేర్కొంది. రెండో స్థానంలో చైనా నిలిచింది.
రాష్ట్రీయందేశంలో అత్యంత పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి
దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న గట్టయ్య(40) హైదరాబాద్‌లో అక్టోబరు 31న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయన ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. కాగా గట్టయ్య ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు. నిరక్షరాస్యుడైన గట్టయ్య హైదరాబాద్‌లోని శిల్పారామంలో సందర్శకులను అలరించే ఉద్యోగం చేస్తున్నారు. 2005 మే 1న గట్టయ్య శిల్పారామంలో చేరారు. ఆయనకు నెలకు రూ.9,500 వేతనం చెల్లిస్తున్నారు.
హైదరాబాద్‌లో జాతీయ విత్తన సదస్సు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్టోబరు 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో 8వ జాతీయ విత్తన సదస్సును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ‘దేశానికే విత్తన భాండాగారంగా తెలంగాణ’ పేరిట ఓ దర్శన పత్రాన్ని విడుదల చేశారు. విత్తన పంటలకు ప్రత్యేక బీమా, కనీసమద్దతు ధర, 15 నెలల పాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీ వంటి అంశాలను ఈ సదస్సులో తీర్మానించారు.
‘సాగరమాల’ పర్యవేక్షణకు కమిటీఓడరేవుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సాగరమాల’ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ విభాగాలకు చెందిన 33 మందిని ఇందులో సభ్యులుగా చేర్చింది. ఈ మేరకు ఇంధన, పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యదర్శి అజయ్ జైన్ అక్టోబర్ 29న జీఓ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులకు అవసరమైన రవాణా మార్గాలను, అభివృద్ధి ప్రణాళికలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
అనూహ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్షముంబైతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్ సానప్ అలియాస్ లౌక్యాకు ఉరి శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 30న న్యాయమూర్తి వృశాలి జోషి శిక్షను ఖరారు చేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్‌మార్గ్-భాండూప్ మధ్యలో శవమై తేలింది. ఈ కేసులో నిందితుడైన చంద్రభాన్‌ను అక్టోబర్ 27న కోర్టు దోషిగా నిర్ధారించిన కోర్టు 30న శిక్ష ఖరారు చేసింది.
‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకావిష్కరణసీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య రచించిన ‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ నవంబర్ 1న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. 150 పేజీల పుస్తకంలో జోగయ్య తన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో విశేషాలను, వివాదాలను, విషాదాలను, మలుపులను ప్రస్తావించారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై ఈ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు.
ఏపీలో భూముల లీజుపై గరిష్ట కాలపరిమితి ఎత్తివేతఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల లీజు విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల లీజుకు సంబంధించి 33 సంవత్సరాల గరిష్ట కాల పరిమితిని ఎత్తివేయనుంది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంతకాలమైనా భూములను లీజుకు తీసుకునేందుకు (ఫ్రీ హోల్డింగ్) వీలుగా విధానాన్ని సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. నవంబర్ 2న విజయవాడలోని సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకావిష్కరణతెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ రాసిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకావిష్కరణ నవంబర్ 4న హైదరాబాద్‌లో జరిగింది. కోదండరాం గురువు ప్రొఫెసర్ రమా మేల్కొటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకంలో వచ్చిన మొదటి వ్యాసం 1998 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యల గూర్చి రాసినట్లు కోదండరామ్ వెల్లడించారు.
ఆర్థికంఆఫ్రికాకు భారత్ రూ. 65.33 వేల కోట్ల రుణంభారత్ తరఫున ఆఫ్రికా దేశాలకు రానున్న ఐదేళ్లలో రూ. 65.33 వేల కోట్ల మేరకు రాయితీతో కూడిన రుణాన్ని అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29న ప్రకటించారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన మూడో ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికాకు రూ. 3.9 వేల కోట్ల సహాయక నిధిని కూడా ప్రకటించారు. ఇవి భారత్ ఇప్పటికే అందిస్తున్న రుణ సదుపాయాలకు అదనమని పేర్కొన్నారు. ఈ సదస్సు గత మూడు దశాబ్దాల్లో భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద కార్యక్రమం. ఇందులో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 41 ఆఫ్రికా దేశాల అధినేతలు ప్రతినిధులుగా హాజరయ్యారు.
భారత జీడీపీలో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లుఈ ఏడాది భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లు అని ఓ సర్వేలో తేలింది. భారత్‌లో 2015 సీజన్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి అంశం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 2650 కోట్లు అని కేపీఎంజీ అనే ప్రఖ్యాత ఆర్థిక గణాంక సంస్థ చేపట్టిన సర్వేలో తేలినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. ఆతిథ్య నగరాలు కాకుండా ఇతర నగరాల నుంచి వచ్చిన 20 శాతం మంది అధికంగా ఈ పోటీలను తిలకించారు. ఇందులో యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీజలాంతర్గామి కల్వరి జల ప్రవేశం జలాంతర్గామి కల్వరిని ముంబైలో అక్టోబరు 29న విజయవంతంగా నీటిలో ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఆరు జలాంతర్గాములు తయారుచేయనున్నారు. 2020 నాటికి మొత్తం తయారుకానున్నాయి. ఈ జలాంతర్గామిని త్వరలో సముద్రంలో పరీక్షించనున్నారు. ఇందులో నౌకా విధ్వంసక క్షిపణులు, టార్పెడోలను మోహరిస్తారు.
యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోచి నుంచి జరిపిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమయింది. నవంబరు 1న దేశ పశ్చిమ తీరం నుంచి 290 కి.మీ.ల దూరంలో అరేబియా సముద్రంలో గల లక్ష్యనౌక అలెప్పిని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. బ్రహ్మోస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది 49వ సారి.
తొలి మేడ్ ఇన్ చైనా విమానంవిమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని నవంబర్ 2న ఆవిష్కరించింది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఇది సుమారు 5,555 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమానయాన మార్కెట్ చైనాలో భారీ ఎయిర్‌పోర్టులు 21 ఉన్నాయి.
ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలుభారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు నవంబర్ 4న వెల్లడించారు. ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు.
వార్తల్లో వ్యక్తులుహీరో సంస్థ వ్యవస్థాపకుడు ముంజాల్ మృతిద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు మోహన్‌లాల్ ముంజాల్(92) ఢిల్లీలో నవంబరు 1న మృతి చెందారు. లూథియానాలో సైకిల్ విడిభాగాల తయారీని ఆయన తొలుత ప్రారంభించారు. 1956లో హీరో సంస్థను ఏర్పాటు చేశారు.
టాంజానియా అధ్యక్షుడిగా పాంబే మగుఫులిటాంజానియా అధ్యక్ష ఎన్నికల్లో అధికార చమా చమ పిండుజి(సీసీఎం) పార్టీకి చెందిన జాన్ పాంబే మగుఫులి విజయం సాధించారు. అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ముగుఫులికి 58.46 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ లొవస్సాకు 39.97 శాతం ఓట్లు వచ్చాయి. టాంజానియాలో 1977 నుంచి సీసీఎం పార్టీ అధికారంలో కొనసాగుతోంది.
రష్యా విమానం కూలిన దుర్ఘటనలో 224 మంది మృతిరష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలో అక్టోబరు 31న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ విమానం ఎర్రసముద్రంలోని పర్యాటక ప్రాంతం షర్‌మఎల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుంది. ప్రయాణికుల్లో రష్యాకు చెందిన 214 మంది, ఉక్రెయిన్‌కు చెందిన ముగ్గురితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ విమానాన్ని తామే కూల్చినట్లు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. రష్యాలో తమసంస్థపై దాడులకు ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల కూలిపోయి ఉంటుందని రష్యా వెల్లడించింది.
2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబరు 29న తన నివేదికలో ప్రకటించింది. 2014లో ప్రపంచవ్యాప్తంగా 96 లక్షల మందికి కొత్తగా క్షయ వ్యాధి సోకింది. భారత్‌లో అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, చైనాలో 10 శాతం చొప్పున నమోదయ్యాయి. 2014లో మరణించిన 15 లక్షల మందిలో మూడింట రెండొంతుల మంది భారత్, నైజీరియాలోనే ఉన్నారు. క్షయవ్యాప్తి 1990లో కన్నా 2015లో 42 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
‘గే’ల పెళ్లికి ఐర్లాండ్ అనుమతిస్వలింగ సంపర్కుల వివాహానికి ఐర్లాండ్ అనుమతినిచ్చింది. ఈ మేరకు ‘వివాహ బిల్లు 2015’లో మార్పులు చేస్తూ అక్టోబర్ 30న అధ్యక్ష కమిషన్ చట్టం తీసుకొచ్చింది. సంప్రదాయ క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్‌లో ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా 62.1 శాతం ప్రజలు గేలకు మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గేలకు మద్దతుగా చట్టం తీసుకొచ్చిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది.
మాల్దీవుల్లో ఎమర్జెన్సీమాల్దీవుల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున నవంబర్ 4 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ వెల్లడించారు. అక్టోబర్ 31న అధ్యక్ష భవనం దగ్గర్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరకడం, అధ్యక్షుడిపై హత్యాయత్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) తలపెట్టిన నిరసనకు రెండురోజుల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మహమద్ నషీద్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద దోషిగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఎండీపీ ఆందోళన కార్యక్రమం తలపెట్టింది.
రోమానియా ప్రధాని రాజీనామారోమానియా దేశ చరిత్రలో ఎన్నడూలేనంతటి ఘోర అగ్ని ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి విక్టర్ పొంటా నవంబర్ 4న తన పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 6వ తేదీన బుకారెస్ట్‌లోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు వంద మంది క్షతగాత్రుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. దాంతో ఆగ్రహించిన 20,000 మంది స్థానికులు నవంబర్ 2న సిటీలోని ప్రఖ్యాత విక్టరీ స్క్వేర్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రధాని గద్దెదిగాలని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పొంటా ప్రకటించారు. రోమానియాకు పోంటా 2012 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.
జాతీయం
వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 130వ స్థానం
అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 7వస్థానం ప్రపంచంలో అత్యంత విలువైన జాతీయబ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఈ ఏడాది 7వ స్థానం దక్కింది. భారత బ్రాండ్ ఫైనాన్స్ నవంబరు 1న విడుదల చేసిన 100 దేశాల జాబితాలో భారత్ ఒకస్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకుంది. భారత్ బ్రాండ్ విలువ 210 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్‌లు వరసగా టాప్ స్థానాల్లో ఉన్నాయి. అమెరికా బ్రాండ్ విలువ 1970 కోట్ల డాలర్లుగా ఉంది. ఒకదేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల విక్రయాల ఆధారంగా జాతీయ బ్రాండు విలువను లెక్కిస్తారు.
పసిడి వినియోగం భారత్‌లో అధికంప్రపంచంలో అత్యధికంగా పసిడి వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత్ తొమ్మిది నెలల్లో 642 టన్నుల బంగారాన్ని వినియోగించిందని జీఎఫ్‌ఎంఎస్ గోల్డ్ సర్వే 2015 మూడో త్రైమాసిక రిపోర్టులో థామ్సన్ రాయిటర్స్ పేర్కొంది. రెండో స్థానంలో చైనా నిలిచింది.
రాష్ట్రీయందేశంలో అత్యంత పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి
హైదరాబాద్‌లో జాతీయ విత్తన సదస్సు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్టోబరు 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో 8వ జాతీయ విత్తన సదస్సును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ‘దేశానికే విత్తన భాండాగారంగా తెలంగాణ’ పేరిట ఓ దర్శన పత్రాన్ని విడుదల చేశారు. విత్తన పంటలకు ప్రత్యేక బీమా, కనీసమద్దతు ధర, 15 నెలల పాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీ వంటి అంశాలను ఈ సదస్సులో తీర్మానించారు.
‘సాగరమాల’ పర్యవేక్షణకు కమిటీఓడరేవుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సాగరమాల’ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ విభాగాలకు చెందిన 33 మందిని ఇందులో సభ్యులుగా చేర్చింది. ఈ మేరకు ఇంధన, పెట్టుబడులు, మౌలిక వసతుల కార్యదర్శి అజయ్ జైన్ అక్టోబర్ 29న జీఓ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులకు అవసరమైన రవాణా మార్గాలను, అభివృద్ధి ప్రణాళికలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
అనూహ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్షముంబైతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్ సానప్ అలియాస్ లౌక్యాకు ఉరి శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 30న న్యాయమూర్తి వృశాలి జోషి శిక్షను ఖరారు చేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్‌మార్గ్-భాండూప్ మధ్యలో శవమై తేలింది. ఈ కేసులో నిందితుడైన చంద్రభాన్‌ను అక్టోబర్ 27న కోర్టు దోషిగా నిర్ధారించిన కోర్టు 30న శిక్ష ఖరారు చేసింది.
‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకావిష్కరణసీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య రచించిన ‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ నవంబర్ 1న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. 150 పేజీల పుస్తకంలో జోగయ్య తన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో విశేషాలను, వివాదాలను, విషాదాలను, మలుపులను ప్రస్తావించారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యోదంతంపై ఈ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తకాన్ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు.
ఏపీలో భూముల లీజుపై గరిష్ట కాలపరిమితి ఎత్తివేతఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల లీజు విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల లీజుకు సంబంధించి 33 సంవత్సరాల గరిష్ట కాల పరిమితిని ఎత్తివేయనుంది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంతకాలమైనా భూములను లీజుకు తీసుకునేందుకు (ఫ్రీ హోల్డింగ్) వీలుగా విధానాన్ని సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. నవంబర్ 2న విజయవాడలోని సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకావిష్కరణతెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ రాసిన ‘తెలంగాణ రాష్ట్రోదయం’ పుస్తకావిష్కరణ నవంబర్ 4న హైదరాబాద్‌లో జరిగింది. కోదండరాం గురువు ప్రొఫెసర్ రమా మేల్కొటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకంలో వచ్చిన మొదటి వ్యాసం 1998 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యల గూర్చి రాసినట్లు కోదండరామ్ వెల్లడించారు.
ఆర్థికంఆఫ్రికాకు భారత్ రూ. 65.33 వేల కోట్ల రుణంభారత్ తరఫున ఆఫ్రికా దేశాలకు రానున్న ఐదేళ్లలో రూ. 65.33 వేల కోట్ల మేరకు రాయితీతో కూడిన రుణాన్ని అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29న ప్రకటించారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన మూడో ఇండియా-ఆఫ్రికా ఫోరం సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రికాకు రూ. 3.9 వేల కోట్ల సహాయక నిధిని కూడా ప్రకటించారు. ఇవి భారత్ ఇప్పటికే అందిస్తున్న రుణ సదుపాయాలకు అదనమని పేర్కొన్నారు. ఈ సదస్సు గత మూడు దశాబ్దాల్లో భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద కార్యక్రమం. ఇందులో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో 41 ఆఫ్రికా దేశాల అధినేతలు ప్రతినిధులుగా హాజరయ్యారు.
భారత జీడీపీలో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లుఈ ఏడాది భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఐపీఎల్ వాటా రూ. 1150 కోట్లు అని ఓ సర్వేలో తేలింది. భారత్‌లో 2015 సీజన్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి అంశం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 2650 కోట్లు అని కేపీఎంజీ అనే ప్రఖ్యాత ఆర్థిక గణాంక సంస్థ చేపట్టిన సర్వేలో తేలినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. ఆతిథ్య నగరాలు కాకుండా ఇతర నగరాల నుంచి వచ్చిన 20 శాతం మంది అధికంగా ఈ పోటీలను తిలకించారు. ఇందులో యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీజలాంతర్గామి కల్వరి జల ప్రవేశం జలాంతర్గామి కల్వరిని ముంబైలో అక్టోబరు 29న విజయవంతంగా నీటిలో ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఆరు జలాంతర్గాములు తయారుచేయనున్నారు. 2020 నాటికి మొత్తం తయారుకానున్నాయి. ఈ జలాంతర్గామిని త్వరలో సముద్రంలో పరీక్షించనున్నారు. ఇందులో నౌకా విధ్వంసక క్షిపణులు, టార్పెడోలను మోహరిస్తారు.
యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష
తొలి మేడ్ ఇన్ చైనా విమానంవిమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని నవంబర్ 2న ఆవిష్కరించింది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఇది సుమారు 5,555 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమానయాన మార్కెట్ చైనాలో భారీ ఎయిర్‌పోర్టులు 21 ఉన్నాయి.
ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలుభారతీయ వైద్యవిధానం ఆయుర్వేదానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని సంస్థ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు నవంబర్ 4న వెల్లడించారు. ఆయుర్వేద విధానంలో పేర్కొనే మూడు ప్రాథమికమైన దోషాలు (వాతం, పిత్తం, కఫం) మన జన్యువుల్లోని తేడాల వల్ల కలుగుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. సుశిక్షితులైన ఆయుర్వేద వైద్యులు, అత్యాధునిక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జన్యుక్రమం విశ్లేషణల ఆధారంగా జరిగిన ఈ పరిశోధనలో... మొత్తం 3,400 మందిని పరిశీలించి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం ఎక్కువగా ఉన్న 262 మందిని గుర్తించామని తెలిపారు.
వార్తల్లో వ్యక్తులుహీరో సంస్థ వ్యవస్థాపకుడు ముంజాల్ మృతిద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు మోహన్‌లాల్ ముంజాల్(92) ఢిల్లీలో నవంబరు 1న మృతి చెందారు. లూథియానాలో సైకిల్ విడిభాగాల తయారీని ఆయన తొలుత ప్రారంభించారు. 1956లో హీరో సంస్థను ఏర్పాటు చేశారు.
‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’గా హెచ్‌పీసీఎల్ సీఎండీ వాసుదేవ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవకు ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన ‘ప్లాట్స్’ అనే వ్యాపారసంస్థ ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డు ఏషియా పసిఫిక్ రీజియన్‌లో భారతీయ మహిళకు దక్కడం ఇదే మొదటిసారి. నిషి వాసుదేవ 1974 నుంచి హెచ్‌పీసీఎల్‌లో పనిచేస్తున్నారు. 2014 నుంచి సీఎండీగా విధులు నిర్వహిస్తున్నారు.
బ్రిటన్‌లో హైకమిషనర్‌గా నవతేజ్‌సింగ్ బ్రిటన్‌లో భారత కొత్త హైకమిషనర్‌గా దౌత్యవేత్త నవతేజ్ సింగ్ సర్న అక్టోబరు 31న నియమితులయ్యారు. ఆయన 1980వ బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో మండేలాకు మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన అత్యంత గౌరవనీయ వ్యక్తుల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఈ జాబితాను అక్టోబరు 28న విడుదల చేసింది. 2015 సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో పోప్ ఫ్రాన్సిన్ రెండో స్థానంలో, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ ముస్క్ మూడోస్థానంలో ఉన్నారు. మహాత్మాగాంధీకి నాలుగోస్థానం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ పదోస్థానంలో నిలిచారు.
హాస్య నటుడు కొండవలస మృతిప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నవంబర్ 2న తుది శ్వాస విడిచారు. 1946, ఆగస్టు 10న శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో జన్మించిన ఆయన.. విశాఖపోర్టు ట్రస్ట్‌లో పని చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 250కు పైగా సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు రెండువేల నాటకాల్లో కొండవలస నటించారు. నాటక రంగంలో 378 అవార్డులు పొందారు. రెండు నంది అవార్డులను గెలుచుకున్నారు.
ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ పటేల్ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. నవంబర్ 2న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో చేరకముందు పటేల్ ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ)లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. దేనా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన సురేష్ పటేల్‌కు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా కూడా ఈయన వ్యవహరించారు.
‘టాటా’ అంబాసిడర్‌గా మెస్సీ
భారత్‌కు చెందిన ప్రముఖ సంస్థ టాటా మోటార్స్‌కు ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ ఓ భారత కంపెనీతో కలిసి పని చేయడం ఇదే తొలిసారి.
నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మృతిరాజస్థాన్‌లో మద్యనిషేధం విధించడంతోపాటు లోకాయుక్తను బలోపేతం చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 2 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ ఛాబ్రా నవంబర్ 3న మరణించారు. కొన్ని రోజులుగా క్రితం కోమాలోకి వెళ్లిపోయిన ఛాబ్రా చికిత్స పొందుతూ మృతిచెందారు.
సుప్రీంకోర్టు సీజేఐగా టీఎస్ ఠాకూర్సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
టాప్-10 ప్రపంచ శక్తిమంతుల్లో మోదీప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో నిలిచారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో మోదీకి తొమ్మిదో స్థానం దక్కింది. గతేడాది ఇదే జాబితాలో ఆయన 14వ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తొలిస్థానంలో ఉన్న 2015 జాబితాలో జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు వరుసగా తరవాత స్థానాల్లో నిలిచారు.
అవార్డులు రైఫ్ బదావీకి ఐరోపా మానవహక్కుల అవార్డు
సౌదీ బ్లాగర్ రైఫ్ బదావీకి ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవహక్కుల పురస్కారం లభించింది. అక్టోబరు 29న ఐరోపా పార్లమెంట్ బదావీకి ఈ అవార్డును ప్రకటించింది. వాక్ స్వాతంత్య్రం కోసం బదావీ పోరాడారు. సౌదీ లిబరల్ నెట్‌వర్క్ అనే చర్చావేదికను ఏర్పాటు చేసి ప్రజా జీవితంపై మత ప్రభావాన్ని అరికట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. 2012లో ఆయనను అరెస్ట్ చేసి వెబ్‌సైట్‌ను మూసివేశారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారాలుగ్రామీణ జర్నలిజంలో అసాధారణ ప్రతిభ చాటుకున్న ఐఏఎన్‌ఎస్ త్రిపుర బ్యూరో చీఫ్ సుజిత్ చక్రవర్తి.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళకు చెందిన మాతృభూమి పత్రిక వినయ్‌మాథ్యూతో కలసి ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో మిడ్ డే పత్రిక రిపోర్టర్ శరద్‌వ్యాస్, సింగిల్ న్యూస్ పిక్చర్ కేటగిరీలో పీటీఐ ఫొటోగ్రాఫర్ షబాజ్ ఖాన్‌లకు అవార్డులు దక్కనున్నాయి. ఫొటో ఫీచర్ కేటగిరీ అవార్డు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తషికి ద క్కింది. కార్టూన్లు, కేరికేచర్ విభాగంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్టూనిస్టు సీఆర్ శశికుమార్... బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. నేషనల్ ప్రెస్‌డేని పురస్కరించుకుని నవంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వీరికి అవార్డులను అందజేస్తారు.
క్రీడలుడబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సానియా మీర్జా (భారత్)- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చాంపియన్‌షిప్‌ను రెండోసారి నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా సానియా కొత్త చరిత్ర సృష్టించింది. నవంబర్ 1న సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా-హింగిస్ ఎనిమిదో సీడ్ గార్బిన్ ముగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) జోడీని ఓడించింది.
బ్రిటన్‌లో హైకమిషనర్‌గా నవతేజ్‌సింగ్ బ్రిటన్‌లో భారత కొత్త హైకమిషనర్‌గా దౌత్యవేత్త నవతేజ్ సింగ్ సర్న అక్టోబరు 31న నియమితులయ్యారు. ఆయన 1980వ బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో మండేలాకు మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన అత్యంత గౌరవనీయ వ్యక్తుల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఈ జాబితాను అక్టోబరు 28న విడుదల చేసింది. 2015 సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో పోప్ ఫ్రాన్సిన్ రెండో స్థానంలో, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ ముస్క్ మూడోస్థానంలో ఉన్నారు. మహాత్మాగాంధీకి నాలుగోస్థానం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ పదోస్థానంలో నిలిచారు.
హాస్య నటుడు కొండవలస మృతిప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నవంబర్ 2న తుది శ్వాస విడిచారు. 1946, ఆగస్టు 10న శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో జన్మించిన ఆయన.. విశాఖపోర్టు ట్రస్ట్‌లో పని చేశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. 250కు పైగా సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు రెండువేల నాటకాల్లో కొండవలస నటించారు. నాటక రంగంలో 378 అవార్డులు పొందారు. రెండు నంది అవార్డులను గెలుచుకున్నారు.
ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ పటేల్ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. నవంబర్ 2న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో చేరకముందు పటేల్ ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ)లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. దేనా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన సురేష్ పటేల్‌కు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా కూడా ఈయన వ్యవహరించారు.
‘టాటా’ అంబాసిడర్‌గా మెస్సీ
నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మృతిరాజస్థాన్‌లో మద్యనిషేధం విధించడంతోపాటు లోకాయుక్తను బలోపేతం చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 2 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ ఛాబ్రా నవంబర్ 3న మరణించారు. కొన్ని రోజులుగా క్రితం కోమాలోకి వెళ్లిపోయిన ఛాబ్రా చికిత్స పొందుతూ మృతిచెందారు.
సుప్రీంకోర్టు సీజేఐగా టీఎస్ ఠాకూర్సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
టాప్-10 ప్రపంచ శక్తిమంతుల్లో మోదీప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో నిలిచారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో మోదీకి తొమ్మిదో స్థానం దక్కింది. గతేడాది ఇదే జాబితాలో ఆయన 14వ స్థానంలో నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తొలిస్థానంలో ఉన్న 2015 జాబితాలో జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు వరుసగా తరవాత స్థానాల్లో నిలిచారు.
అవార్డులు రైఫ్ బదావీకి ఐరోపా మానవహక్కుల అవార్డు
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారాలుగ్రామీణ జర్నలిజంలో అసాధారణ ప్రతిభ చాటుకున్న ఐఏఎన్‌ఎస్ త్రిపుర బ్యూరో చీఫ్ సుజిత్ చక్రవర్తి.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళకు చెందిన మాతృభూమి పత్రిక వినయ్‌మాథ్యూతో కలసి ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో మిడ్ డే పత్రిక రిపోర్టర్ శరద్‌వ్యాస్, సింగిల్ న్యూస్ పిక్చర్ కేటగిరీలో పీటీఐ ఫొటోగ్రాఫర్ షబాజ్ ఖాన్‌లకు అవార్డులు దక్కనున్నాయి. ఫొటో ఫీచర్ కేటగిరీ అవార్డు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తషికి ద క్కింది. కార్టూన్లు, కేరికేచర్ విభాగంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్టూనిస్టు సీఆర్ శశికుమార్... బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. నేషనల్ ప్రెస్‌డేని పురస్కరించుకుని నవంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వీరికి అవార్డులను అందజేస్తారు.
క్రీడలుడబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సానియా మీర్జా (భారత్)- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చాంపియన్‌షిప్‌ను రెండోసారి నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా సానియా కొత్త చరిత్ర సృష్టించింది. నవంబర్ 1న సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా-హింగిస్ ఎనిమిదో సీడ్ గార్బిన్ ముగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) జోడీని ఓడించింది.
- గ్రాండ్ స్లామ్‌ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గడం సానియాకిది రెండోసారి. గతేడాది కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా ఈ టైటిల్‌ను సాధించగా... ఈసారి హింగిస్‌తో టైటిల్‌ను నిలబెట్టుకుంది.
- ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా.. ఈ ఏడాది 10వ టైటిల్. హింగిస్‌తో కలిసి తొమ్మిదోది. సానియా-హింగిస్ జంట ఈ ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్, చార్ల్స్‌టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ ఓపెన్, వుహాన్ ఓపెన్, బీజింగ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీల్లో టైటిల్స్ సాధించింది. సిడ్నీ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది.
- మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్‌లో ఇది 50వ డబుల్స్ టైటిల్. తద్వారా మహిళల టెన్నిస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 16వ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది.
సింగిల్స్ చాంప్ రద్వాన్‌స్కా డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ చాంపియన్‌గా అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) నిలిచింది. ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ రద్వాన్‌స్కా ఐదో ర్యాంకర్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 26 ఏళ్ల రద్వాన్‌స్కా కెరీర్‌లో ఇది 17వ సింగిల్స్ టైటిల్.
బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ టి20టి20 ఫార్మాట్‌లో తొలిసారిగా ఆసియా కప్ జరుగబోతోంది. 2016 ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. సింగపూర్‌లో ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అర్హత పోటీలో నెగ్గిన యూఏఈ ఐదో జట్టుగా బరిలోకి దిగనుంది. మరోవైపు 2018లో జరిగే ఆసియా వన్డే కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
బాసెల్ ఓపెన్ విజేత ఫెడరర్బాసెల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్ విజేతగా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై మూడున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. నవంబర్ 1న జరిగిన ఫైనల్లో నాదల్‌ను ఓడించిన ఫెడరర్.. తన కెరీర్‌లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 2012లో ఏప్రిల్‌లో ఇండియన్ వెల్స్ ఓపెన్ సెమీఫైనల్లో చివరిసారి నాదల్‌పై ఫెడరర్ గెలిచాడు. ఆ తర్వాత నాదల్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఫెడరర్‌కు ఓటమి ఎదురైంది. తాజా విజయంతో ఫెడరర్ ఐదోసారి ఒకే టోర్నీని ఏడు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఫెడరర్ తన కెరీర్‌లో హాలె ఓపెన్ టోర్నీ టైటిల్‌ను 8 సార్లు నెగ్గగా... వింబుల్డన్, సిన్సినాటి ఓపెన్, బాసెల్, దుబాయ్ ఓపెన్‌లను ఏడుసార్లు చొప్పున సాధించాడు.
జాతీయ సీనియర్ బాక్సింగ్‌లో నిఖత్‌కు స్వర్ణం
మెక్సికో గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్ఫార్ములా వన్ రేస్ ‘మెక్సికో గ్రాండ్ ప్రి’లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఇప్పటికే ‘ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను ఖాయం చేసుకున్న లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. 23 ఏళ్ల తర్వాత నవంబర్ 2న మళ్లీ మెక్సికోలో ఫార్ములావన్ రేసు జరిగింది. ఈ రేసును లక్షా 40 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించారు. 2015 సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది నాలుగో టైటిల్ కాగా... కెరీర్‌లో 12వది.
ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ రాజీనామాఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి దాని ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)గా పని చేసిన సుందర్ రామన్ తన పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2న తన రాజీనామా పత్రాన్ని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు అందించారు. దీనిని వెంటనే ఆమోదిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రామన్ హస్తం ఉందని గతంలో ముద్గల్ కమిటీ తేల్చింది.
టెస్టులకు షోయబ్ మాలిక్ వీడ్కోలుపాకిస్తాన్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్... టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టే తనకు చివరిదని ప్రకటించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 13 నుంచి 17 వరకు అబుదాబీలో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ (245)తో కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఓవరాల్‌గా 35 టెస్టులాడిన మాలిక్ 1,898 పరుగులు చేశాడు. మూడు సెంచరీలతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు.
సంక్షిప్తంగా
- దేశంలో 93 శాతం పెద్దలు ఆధార్ కార్డును పొందారని ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్ నమోదులో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 190 దేశాలు ఖండించాయి. ఈ మేరకు ఐరాసలో క్యూబాకు మద్దతుగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయెల్ మినహా అన్ని సభ్యదేశాలు సమర్థించాయి.
- అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతిని పురస్కరించుకుని ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

0 Comments