హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ నుంచి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్‌ని కూడా మిగలనివ్వను అని శపథం చేసింది ఎవరు?
- సర్దార్ పటేల్
నిజాం రాజ్యంలో నిర్మించిన తొలి ప్రాజెక్ట్?
- నిజాం సాగర్ ప్రాజెక్ట్ (మంజీరా నదిపై)
తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ ఎవరు?
- చిన్నారెడ్డి
తెలంగాణ కోసం కేశవరావ్ జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పాటయ్యింది?
- 1997, అక్టోబర్ 28న
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎప్పుడు నిర్మించారు? ఫలక్‌నుమా అంటే అర్థం?
- 1884, మార్చి 3న నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం
నిజాం రాజు అధికార నివాసం?
- చౌమొహల్లా ప్యాలెస్
మా హైదరాబాద్ గ్రంథ రచయిత?
- శ్రీధర్ ధర్మాసనం
కులం అణచివేత మీద కంచె ఐలయ్య రాసిన పుస్తకం?
- STATE AND REPRESSIVE CULTURE
నక్సలైట్లు దేశభక్తులు అని అన్నదెవరు?
- మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు
తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించిన తెలంగాణ కవి?
- దాశరథి రంగాచార్య
దగాపడ్డ తెలంగాణ రాసిందెవరు?
- గాదె ఇన్నయ్య
గద్దర్ అసలు పేరు? ఆయన ఎక్కడ జన్మించారు?
- విఠల్‌రావు, 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు?
- అల్లం నారాయణ
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్?
- కట్టా శేఖర్‌రెడ్డి (నల్లగొండ జిల్లా)
తెలంగాణ డిమాండ్ డే ఎప్పుడు?
-1969, మే 1 (తెలంగాణ ప్రజాసమితి ప్రకటించింది)
తెలంగాణ సిద్ధాంత కర్త?
- ప్రొ. జయశంకర్
సీఎం కేసీఆర్ జాతీయ జండాను తొలిసారిగా ఎక్కడ ఎగురవేశారు?
- గోలకొండ కోటపై, ఆగస్టు 15న
తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎన్ని కి.మీ.లు?
- 1586.09 కి.మీ. (6 జాతీయ రహదారులు)
తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరికి పేరు?
- సంగెం లక్ష్మీబాయి
హైదరాబాద్ ప్రకాశం అంటే ఎవరు?
- స్వామి రామానంద తీర్థ
1952-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్?
- కాశీనాథరావ్ వైద్య
ఇండియన్ తోరోదత్ అని ఎవరిని అంటారు?
- సరోజినీ నాయుడు
తెలంగాణ పటేల్ అంటే ఎవరు?
- బొమ్మకంటి సత్యనారాయణ రావు
హైదరాబాద్ సింహం?
- పండిత నరేంద్రజీ
ఇండియన్ మార్టిన్ లూథర్, ఇడియన్ ఐన్‌స్టీన్ ఎవరు?
- ఆచార్య నాగార్జునుడు
దాశరథి కృష్ణమాచార్యుని రచనలు?
- అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, కవితా పుష్పకం, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం
ఉమర్ ఖయ్యూం రచించిన తెలంగాణ కవి?
- బూర్గుల రామకృష్ణారావు
1921లో జరిగిన ఆంధ్రజనసంఘం సమావేశంలో తొలిసారిగా తెలుగులో మాట్లాడిన వ్యక్తి?
- అల్లంపల్లి వెంకట రామారావు
హైదరాబాద్ భారతదేశం అనే గుండెపై పుట్టిన రాచపుండు అన్నదెవరు?
- సర్దార్ పటేల్
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు సభ్యులు ఎవరు?
- కేవీ రంగారెడ్డి, జేవీ రంగారావు, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి
తెలంగాణలో ఒగ్గు కథా చక్రవర్తి అని ఎవరిని అంటారు?
- మిద్దె రాములు

0 Comments