Ticker posts

9/recent/ticker-posts

Netaji jayanthi

సుభాష్ చంద్రబోస్:
జననం జనవరి 23,1897
కటక్, ఒరిస్సా
మరణం ఆగస్టు 18,1945 (48 సంవత్సరాల వయసులో)
తైవాన్(అని భావిస్తున్నారు)
మరణ కారణము విమాన ప్రమాదం(అని భావిస్తున్నారు)
జాతీయత భారతీయుడు
ప్రసిద్ధి భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు . భారత జాతీయ సైన్యాధినేత
సాధించిన విజయాలు నేతాజీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఫార్వర్డ్ బ్లాక్
భార్య / భర్త ఎమిలీ షెంకెల్
పిల్లలు అనిత
తల్లిదండ్రులు జానకీనాథ బోస్
సుభాష్ చంద్రబోస్  (జననం: జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీ తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.



బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

బాల్యం, విద్య:

సుభాష్ చంద్రబోస్ 1897 లో, భారత దేశంలోని ఒరిస్సా లోని కటక్ పట్టణం లో ఒక ధనిక కుటుంబం లో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయరు. తీవ్రమైన జాతీయవాది. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పెరు ప్రభవతి దెవి. బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం (Cambridge University)లోను సాగింది.


1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించ సాగాడు.

1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్ధి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్‌నుండి వైదొలగాడు. వేరు మార్గం లేని బోస్ "అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్" (All India Forward Bloc) పార్టీని స్థాపించాడు. 1938లో "జాతీయ ప్రణాళికా కమిటీ" (National Planning Committee) అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు

స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక:

బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డీ (Giuseppe Garibaldi) మరియు మాజినీ (Giuseppe Mazzini)ల ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ (Kemal Atatürk) నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్‌తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.

దేశం వీడి అజ్ఞాతం లోకి...

బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్‌ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్‌రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఈ నిర్ణయం పట్ల బోసు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రాంభించాడు. వెంటనే బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు. ముందుగా పెషావర్ చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్‌లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గెడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా , అగాఖాన్‌ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్‌తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్‌కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVDఅతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్ కి అప్పగించారు. అతను బోస్‌ను బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్‌కు రిబ్బెన్‌ట్రాప్ నుండి, మరియు విల్‌హెల్మ్‌స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారులనుండి కొంత సఖ్యత లభించింది.




తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన Special Operations Executive (SOE) ఈ పనిని చేపట్టింది.[

జర్మనీలో:

ఇలా భారత దేశంనుండి ఆఫ్ఘనిస్తాన్,అక్కడినుండి రష్యా, అక్కడినుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొన్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్‌లో "స్వతంత్ర భారత కేంద్రం" (Free India Centre) స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇది మొదట Wehrmacht, తరువాత Waffen SS అనే సైన్య విభాగాలకు అనుబంధంగా ఉండేది. అందులోని సైన్యం హిట్లర్‌కు, బో‍స్‌కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు - "భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్ కు, భారత దేశపు స్వాతంత్ర్యానికోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్‌కు విధేయుడనై ఉంటాను:("I swear by God this holy oath that I will obey the leader of the German race and state, Adolf Hitler, as the commander of the German armed forces in the fight for India, whose leader is Subhas Chandra Bose"). ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్‌కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి.
అదృశ్యం మరియు అనుమానాస్పద మరణం:
అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీ గా ఉండగా సైబీరియా లో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.

1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్ కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబందాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమీషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.

 అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమీషన్ కు లేఖను పంపడం జరిగింది. .

ఈ కమీషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006 లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమీషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమీషన్ నివేదికను తిరస్కరించింది.

అపరిచిత సన్యాసి:

1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివశించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్న బోసని చాలా మంది నమ్మకం. కనీసం నాలుగు సార్లు తనని తాను బోసుగా భగవాన్ జీ చెప్పుకున్నాడు.

భగవాన్ జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమీషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకనందున భగవాన్ జీ, బోసు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది.ఏదైనప్పటికి భగవాన్ జీ జీవితం, రచనలు నేటికీ అంతుపట్టకుండా ఉన్నాయి.
💐💐💐Wish you happy desh Prem divas..💐💐

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates