Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయంనల్లధనం నిర్మూలనకు భారత్-సీషెల్స్ ఒప్పందంభారత్ సీషెల్స్ మధ్య ఆగస్టు 26న ఒప్పందం జరిగింది. సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మైఖెల్ భారత్‌ను సందర్శించినప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పన్ను ఎగవేతను అరికట్టేలా సమాచారం మార్పిడికి రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పర్యటనలో అలెక్స్ మైఖెల్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. సముద్ర భద్రతలో సంబంధాలు, మత్స్య రంగంలో సహకారం కోసం భారత్ -సీషెల్స్ కోరుకుంటున్నాయి. ప్రధాని మోదీ సీషెల్స్‌కు రెండో డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బహుమతిగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది. 

గంగానది ప్రక్షాళనకు జర్మనీ సాయంCurrent Affirsగంగానది ప్రక్షాళనకు జర్మనీ ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లో ప్రవహిస్తున్న గంగానదిలో కొంత భాగాన్ని ప్రక్షాళించేందుకు అంగీరించింది. యూరప్‌లోని రైన్ నదిని శుద్ధీకరించేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు ఉపయోగిస్తారు. భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛ విద్యాలయలోనూ సాయం అందించేందుకు జర్మనీ ఒప్పుకుంది.

మౌంట్ మెకిన్లీ పేరు దెనాలిగా మార్పుఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ మెకిన్లీ పేరును ‘దెనాలి’గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చారు. ఈ మేరకు వైట్‌హౌస్ వర్గాలు సెప్టెంబర్ 1న ఒక ప్రకటన విడుదల చేశాయి. 1896లో అప్పటి కాబోయే అమెరికా అధ్యక్షుడు విలియమ్ మెకిన్లీ పేరు ఈ పర్వతానికి పెట్టారు. అయితే ఆ పేరు ఈ ప్రాంత ప్రజలకు నచ్చలేదు. తమ సంస్కృతి సంప్రదాయాలకు తగిన పేరు పెట్టాలని చాలా కాలం నుంచి వారు డిమాండ్ చేస్తున్నారు. 1975 నుంచి అలస్కా ప్రభుత్వం ఈ విషయంపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల కోరిక మేరకు పర్వతం పేరు ‘దెనాలి’గా మారుస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. 

జాతీయం98 స్మార్ట్‌సిటీల ఎంపికCurrent Affirsఆకర్షణీయ నగరాలు (స్మార్ట్)గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన 98 నగరాల జాబితాను కేంద్రం ఆగస్టు 27న ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి.. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయి. మొత్తం జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 13 నగరాలు ఉన్నాయి. తర్వాత తమిళనాడుకు చెందిన 12 నగరాలు ఉన్నాయి. 10 నగరాలు మహారాష్ట్రకు చెందినవి ఉన్నాయి. ఇందులో 24 రాష్ట్ర రాజధానులు ఉన్నాయి. ఈ ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి కేంద్రం రూ.48 వేల కోట్లు సమకూర్చుతుంది. ఇంతే మొత్తాన్ని రాష్ట్రాలు, పురపాలక సంస్థలు సమకూర్చాలి. తొలి సంవత్సరం ఒక్కో నగరానికి రూ.200 కోట్లు, తర్వాత నాలుగు సంవత్సరాలపాటు రూ.100 కోట్లు వ్యయం చేస్తారు. ఈ పథకం కింద నగరాల్లో తగినంత నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, సమర్థమైన రవాణా వ్యవస్థ కల్పిస్తారు. డిజిటలైజేషన్‌ను పెంపొందించి ప్రజలకు రక్షణ, భద్రత కల్పిస్తారు.

దేశ జనాభాలో తగ్గుతున్న హిందువులు2011 జనాభా లెక్కల ఆధారంగా మతాలవారీ జనాభా వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆగస్టు 25న విడుదల చేశారు. 2001లో మొత్తం జనాభా 1,028,610,328గా ఉండగా 2011లో మొత్తం జనాభా 1,210,854,977. 2011 జనాభాలో హిందువులు 96.63 కోట్లు (79.8 శాతం); ముస్లింలు 17.22 కోట్లు (14.2 శాతం); క్రైస్తవులు 2.78 కోట్లు (2.3 శాతం); సిక్కులు 2.08 కోట్లు (1.7 శాతం); బౌద్ధులు 84 లక్షలు (0.7 శాతం); జైనులు 45 లక్షలు (0.4 శాతం); ఇతర మతాల వారు 79 లక్షలు (0.7 శాతం); ఏ మతం తెలపని వారు 29 లక్షలు (0.2 శాతం) ఉన్నారు. 2011లో మొత్తం జనాభాలో హిందువుల జనాభా 0.7 శాతం తగ్గగా ముస్లింల జనాభా 0.8 శాతం పెరిగింది. దేశ జనాభా 2001-11 దశాబ్దకాలంలో 17.7 శాతం పెరిగింది. సమైఖ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2001లో 7.6 కోట్లుగా ఉన్న జనాభా, 2011లో 8.5 కోట్లకు చేరింది. 2011లో హిందువులు 7.48 కోట్లు, ముస్లింలు 80.8 లక్షలు, మతం తెలపని వారి సంఖ్య 4,04,100.

‘పటేల్’ ఆందోళనలో 10 మంది మృతిగుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన సంఘటనల్లో ఆగస్టు 26న 10 మంది మరణించారు. పటేల్ సామాజిక వర్గాన్ని ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో మొదలైన ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ సంఘటనల వల్ల అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, జాంనగర్ సహా అనేక పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ విధించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

మరణశిక్ష రద్దుకు లా కమిషన్ సిఫార్సుమరణశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ ఆగస్టు 31న విడుదల చేసిన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే, ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం వంటి నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని కమిషన్ సమర్థించింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణశిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని కమిషన్ పేర్కొంది. జస్టిస్ ఎ.పి.షా నేతృత్వంలోని 20వ లా కమిషన్‌లోని మొత్తం పది మంది సభ్యులలో మెజారిటీ సభ్యులు ఉరిశిక్ష రద్దుకు అనుకూలంగా ఉండగా, జస్టిస్ ఉషా మెహ్రా, మరో ఇద్దరు సభ్యులు ఉరిశిక్షను కొనసాగించాలని స్పష్టం చేశారు.

‘అందరికీ ఇళ్లు’కు 305 పట్టణాల ఎంపికదేశంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఉద్దేశించిన అందరికీ ఇళ్లు పథకం కింద కేంద్రం తొమ్మిది రాష్ట్రాల్లోని 305 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసిన జాబితాను ఆగస్టు 30న విడుదల చేసింది. ఈ పథకం అమలుకు 15 రాష్ట్రాలతో తప్పనిసరైన ఆరు సంస్కరణల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(34) ఉన్నాయి. అల్పాదాయ వర్గాలకు ఇళ్ల అనుమతుల్లో సడలింపులు, అద్దె నియంత్రణ చట్టాల సవరణ, మురికివాడల అభివృద్ధికి అదనపు సడలింపులు వంటివి ఈ సంస్కరణల్లో ఉన్నాయి. ఒక్కో ఇంటికి రూ.2-2.50 లక్షల ఖర్చు చేస్తుంది. వచ్చే ఆరేళ్లలో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. 

హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్లుమహిళలకు మరింత భద్రత కల్పించే చర్యల్లో భాగంగా హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాల్లో పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే పోలీస్ స్టేషన్లను ఆగస్టు 28న ప్రారంభించింది. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ సమీపంలోని పాంచ్‌కులా పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను స్వయంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మిగిలిన 20 మహిళా పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. ఈ స్టేషన్లలో స్త్రీలకు సంబంధించిన వివిధ నేరాలు, కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వహిస్తారు.

భూసేకరణ ఆర్డినెన్స్ చెల్లుభూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 30న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. ఆగస్టు 31తో ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది. ఇదే ఆఖరి ఆర్డినెన్స్ అని ప్రధాని తెలిపారు. పాత చట్టాలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంలో మోదీ ప్రభుత్వం సవరణలు చేసి కొత్త భూసేకరణ బిల్లును రూపొందించింది.

‘రామచరితమానస్’ను ఆవిష్కరించిన మోదీఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్ రామచరితమానస్ ఆడియో సీడీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 31, 2015వ తేదీన ఢిల్లీలో ఆవిష్కరించారు. రామచరితమానస్ ఆడియో సీడీలను తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషిని మోదీ కొనియాడారు. దీన్ని సంగీత సాధనతో కాకుండా సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా తీసుకొచ్చారన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు.

పశ్చిమ మధ్య రైల్వే ఘనతదేశంలో మానవ రహిత లెవల్ క్రాసింగులు లేని తొలి రైల్వే జోన్ గా పశ్చిమ మధ్య రైల్వే నిలిచింది. 2014 ఏప్రిల్ 1 నాటికి కాపలాదారులు లేని లెవల్ క్రాసింగులు 118 ఉండగా, వాటిలో 2014-15 లో 80, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతావాటి ని తొలగించారు. దేశవ్యాప్తంగా 29,487 లెవల్ క్రాసింగులు ఉండగా, 10,046 క్రాసింగు ల్లో కాపలాదారులు లేరు. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్ ఓవర్‌బ్రిడ్జ్‌లు, రైల్ అండర్‌బ్రిడ్జ్‌లు నిర్మించేందుకు రూ.30వేల కోట్లతో రైల్వే శాఖ ‘స్పెషల్ రైల్వే సేఫ్టీ ఫండ్’ను ఏర్పాటుచేసింది.

రాష్ట్రీయంఆరున్నర కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజాలుఆరున్నర కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజాల జాడలు తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లో వెలుగుచూశాయి. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కొండపల్లి అడవిలో విస్తారంగా ఉన్న వృక్ష శిలాజాల జాడ తెలిసింది. ఇవి దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కంటే పూర్వం నాటివిగా భావిస్తున్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో అన్వేషించి 15 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాలకు చెందిన వృక్ష శిలాజాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు.

గోరటి వెంకన్నకు బోవెరా కవితా పురస్కారంCurrent Affirs ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది బోయినపల్లి వెంకటరామారావు పేరిట ఏర్పాటు చేసిన బోవెరా కవితా పురస్కారం లభించింది. బోవెరా 96వ జయంతి సందర్భంగా బోవెరా కవితా పురస్కార ప్రధాన కార్యక్రమం సెప్టెంబర్ 2న కరీంనగర్‌లోని బోవెరా భవన్‌లో జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా గోరటి వెంకన్నకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఆర్థికంఆంధ్రాబ్యాంక్ ముద్రా కార్డుCurrent Affirsచిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారవేత్తల కోసం ఆంధ్రాబ్యాంకు ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షల లోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి.

పీఎంఎంవై రుణ లక్ష్యం 1.22 లక్షల కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద బ్యాంకులు రూ.1.22 లక్షల కోట్లను చిన్న వ్యాపార యూనిట్లకు రుణాలుగా అందించనున్నాయి. ముద్రా రుణాల కోసం బ్యాంకింగ్ రంగానికి రూ.1.22 లక్షల కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

జన్‌ధన్ యోజన్ ద్వారా రూ.22,000 కోట్లుకేంద్ర ప్రతిష్టాత్మక పథకం జన్‌ధన్ యోజన కింద 17.5 కోట్ల బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.22,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌలభ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా 2014, ఆగస్టు 28న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీజీశాట్-6 ప్రయోగం విజయవంతంCurrent Affirsనెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ఆగస్టు 27న ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన క్రయోజెనిక్ ఇంజన్‌ను ఉపయోగించిన జీఎస్‌ఎల్‌వీ- డి6 రాకెట్ జీశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరవేసింది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్‌ను జీఎస్‌ఎల్‌వీకి ఉపయోగించడం ఇది మూడోసారి. అధిక బరువు గల ఉపగ్రహాలను ప్రయోగించడానికి క్రయోజెనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. ఈ ఇంజన్లు రూపొందించే సామర్థ్యం అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్ దేశాలకే ఉంది. ప్రస్తుతం భారత్ ఈ దేశాల జాబితాలో చేరింది. సమాచార ఉపగ్రహమైన జీశాట్-డి6 2,117 కిలోల బరువు ఉంది. ఈ ఉపగ్రహం ద్వారా అధునాతన డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

నాసా కొత్త టార్గెట్ఫ్లూటోను దాటి రికార్డు సృష్టించిన ‘నాసా’ న్యూహారిజాన్స్ వ్యోమనౌక... సౌరకుటుంబం అవతల ఆవరించి ఉన్న క్యూపర్ బెల్ట్ ప్రాంతంలోని ‘2014 ఎంయూ69 (పీటీ1)’ అనే గ్రహశకలంపై పరిశోధన చేయనుంది. ఫ్లూటోకు అవతల 30 మైళ్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలాన్ని న్యూహారిజాన్స్ తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నట్లు నాసా ప్రకటించింది. క్యూపర్‌బెల్ట్‌పై సూర్యకిరణాల ప్రభావం అతి తక్కువగా ఉంటుందని.. ఈ ‘పీటీ1’పై పరిశోధన చేస్తే సౌరకుటుంబం ఆవిర్భావం నాటి అంశాలు తెలిసే అవకాశముందని తెలిపింది. సౌరకుటుంబంపై పరిశోధన చేయడానికి 2006, జనవరి 19న న్యూహారిజాన్స్‌ను ప్రయోగించారు.

పర్యావరణ సమాచార కేంద్రం ఏర్పాటుచేసిన నాసా, యూఎస్‌ఏఐడీలోయర్ మెకంగ్ రీజియన్‌లోని ఐదు దేశాల్లో(మైన్మార్, కంబోడియా, లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం) పర్యావరణ పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ) సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించాయి. సెర్ విర్-మెకంగ్ (SERVIR Mekong)గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు ప్రధాన భవనం బ్యాంకాక్‌లో ఏర్పాటుచేశారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, విధానకర్తలు ఈ ప్రాజె క్టులో భాగస్వాములవుతారు. విపత్తు నిర్వహణ, ఆహార భద్రత, ప్రజారోగ్యం, నీటి వనరుల నిర్వహణ తదితర అంశాల్లో ఈ ప్రాంతంలోని ప్రభుత్వాలకు భూ పరిశీలనలు, భౌగోళిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సహాయ సహకారాలు అందిస్తుంది. 

భారతీయ భాషలను బ్రె యిలీ లిపిలోకి మార్చే సాఫ్ట్‌వేర్భారతీయ భాషలను బ్రెయిలీ లిపిలోకి మార్చే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. హిందీ, బెంగాళీ, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కన్నడ తదితర భాషలను బ్రెయిలీ లిపిలోకి మార్చే స్పర్శ ట్రాన్స్‌లిటరేషన్ సిస్టమ్‌ను ఐఐటీ-ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ అనుపమ్ బసు నేతృత్వంలోని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ ఏ భారతీయ భాషనైనా యూనీకోడ్‌గా తీసుకొని బ్రెయిలీ లిపిగా మారుస్తుంది.

వార్తల్లో వ్యక్తులుకన్నడ సాహితీవేత్త కల్బుర్గి హత్యప్రముఖ కన్నడ పరిశోధకుడు, సాహితీవేత్త ఆచార్య మల్లేశప్ప మడివాళప్ప కల్బుర్గి (77)ని ధార్వాడలో ఆగస్టు 30న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. మూఢ నమ్మకాలను గట్టిగా విమర్శించేవారు. దేవతా విగ్రహాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు.

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా జొకోవిచ్సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ యునిసెఫ్‌కు గ్లోబల్ గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే తను యునిసెఫ్‌కు సెర్బియా అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా... ఇకపై ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. 28 ఏళ్ల ఈ ప్రపంచ నం.1 ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఫౌండేషన్ తరఫున పిల్లల కోసం ఎన్నో సామాజిక క్యార్యక్రమాలు చేపట్టాడు. యునిసెఫ్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ.

‘మిస్ టీన్ కెనడా’గా భారత సంతతి యువతి‘మిస్ టీన్ కెనడా పెటైట్ గ్లోబ్-2015’గా భారత సంతతికి చెందిన అర్ష్‌ప్రీత్ చహల్ ఎంపికైంది. ఆగస్టు 22న టొరంటోలోని రిచ్‌మండ్ హిల్ సెంటర్ ఆఫ్ పెర్‌ఫామింగ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ అందాల పోటీ ఫైనల్లో చహల్ విజేతగా నిలిచింది. 70 మంది యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు.

హోంశాఖ నూతన కార్యదర్శిగా రాజీవ్ మహర్షిCurrent Affirsకేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మహర్షి బాధ్యతలు చేపట్టారు. ముందస్తు పదవీ విరమణ చేసిన ఎల్‌సీ గోయల్ స్థానంలో రాజీవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. గతంలో ఈయన ఆర్థిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. కాగా, భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి(ఐటీపీవో) కొత్త చైర్మన్, ఎండీగా ఎల్‌సీ గోయల్‌ను నియమిస్తూ కేంద్రం ఆగస్టు 31న ఉత్తర్యులు జారీచేసింది.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రతన్కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా రతన్ పి. వాతాల్ ఆగస్టు 31న నియమితులయ్యారు. 1978 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి రతన్... ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్. ఆర్థిక శాఖలో అత్యంత సీనియర్ కార్యదర్శికే ఫైనాన్స్ సెక్రటరీ హోదా దక్కుతుంది. మరోవైపు, శక్తికాంత దాస్‌ను ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగాను, హస్‌ముఖ్ అధియాను రెవెన్యూ కార్యదర్శిగాను కేంద్రం నియమించింది.

సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్సెయిల్ కొత్త చైర్మన్‌గా పీకే సింగ్ ఎంపికయ్యారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా ఉన్న పీకే సింగ్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈయన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా 2012లో పగ్గాలు చేపట్టారు. గతంలో సెయిల్ చైర్మన్‌గా సీ.ఎస్. వర్మ ఉండేవారు. జూన్ నెలలో ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను కొత్త చైర్మన్ నియామకం జరిగేంత వరకు స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ పర్యవే క్షించారు. 

ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహానిరైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 

అవార్డులుసన్‌హాక్ శాంతి బహుమతిభారత వ్యవసాయ శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్త, కిరిబాటి ద్వీపాల అధ్యక్షుడు అనోట్ టాంగ్‌లకు సంయుక్తంగా సన్‌హాక్ శాంతి బహుమతి లభించింది. వీరిరువురికి ఈ అవార్డును దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఆగస్టు 28న ఆ దేశ మతనాయకుడు హక్ జా హన్‌మూన్ ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతికి ప్రత్యామ్నాయంగా గుర్తిస్తున్న ఈ అవార్డును రెవ్‌సన్ మైయూంగ్ మూన్ స్థాపించారు. ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తులకు, వారి సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన శాస్త్రవేత్త విజయ్ గుప్త (76) మంచినీటి చేపల పెంపకం కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఆయనకు 2005లో ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి కూడా లభించింది. సన్‌హాక్ బహుమతి పొందిన మరో గ్రహీత అనోట్ టాంగ్ పసిఫిక్ సముద్రంలో ఉన్న కిరిబాటి ద్వీపాల అధ్యక్షుడు. చిన్న దీవులకు ప్రమాదకారిగా మారిన కర్బన ఉద్గారాల విడుదల అదుపుచేయడానికి ఆయన పోరాడుతున్నారు.

సానియాకు ‘ఖేల్త్న్ర’ ప్రదానంCurrent Affirsదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ అవార్డును భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అందుకున్నారు. ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. అవార్డు కింద పతకం, సర్టిఫికెట్‌తో పాటు ఏడున్నర లక్షల నగదును బహుకరించారు. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ‘అర్జున’ అవార్డులను ప్రణబ్ చేతుల మీదుగా స్వీకరించారు. అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, 5 లక్షల నగదును ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ మాజీ ప్లేయర్ శివ ప్రకాశ్ మిశ్రాకు ‘ద్రోణచార్య’, సాయిబాబా వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ’ పురస్కారాలను అందజేశారు.

అర్జున గ్రహీతలు: శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), బబిత (రెజ్లింగ్), భజరంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (పారా సెయిలింగ్), మంజీత్ చిల్లర్ (కబడ్డీ), అభిలాష మహత్రే (కబడ్డీ).

ద్రోణాచార్య గ్రహీతలు: నావల్ సింగ్ (అథ్లెటిక్స్-పారా స్పోర్ట్స్), అనూప్ సింగ్ (రెజ్లింగ్), హర్భన్స్ సింగ్ (అథ్లెటిక్స్-లైఫ్‌టైమ్), స్వతంతర్ రాజ్‌సింగ్ (బాక్సింగ్-లైఫ్‌టైమ్), నీహర్ అమీన్ (స్విమ్మింగ్-లైఫ్‌టైమ్).

ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: రోమియో జేమ్స్ (హాకీ), శివ ప్రకాశ్ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్).

ఆర్తీ బారువాకు భారత జ్యోతి అవార్డ్ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దేశ్‌బంధు కాలేజీలో ఫిలాసఫీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్తీ బారువా ప్రతిష్టాత్మక భారత్ జ్యోతి అవార్డును గెలుచుకున్నారు. ఇండియా ఇంటర్‌నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ(ఐఐఎఫ్‌ఎస్) ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. అసోంకు చెందిన ఆర్తీ ప్రస్తుతం ఇండియన్ డివిజన్ ఆఫ్ ది స్కోపెన్హౌర్ సొసైటీ(ఐడీఎస్‌ఎస్)లో డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో ఆగస్టు 29న జరిగిన ‘ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్’ సదస్సులో మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి బారువాకు అవార్డును ప్రదానం చేశారు. విద్య, రాజకీయాలు, సంఘసేవ, వ్యాపారం, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 

ఇండియన్ అమెరికన్‌కు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు‘ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఏఎఫ్‌ఎమ్‌ఐ)’ ప్రదానం చేసే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు ఈ ఏడాది భారత సంతతికి చెందిన అమెరికా పారిశ్రామికవేత్త ఫ్రాంక్ ఇస్లామ్‌ను వరించింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ ధ్యానేశ్వర్ ఎమ్ ములాయ్ చేతుల మీదుగా ఆగస్టు 30న ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గ త మేలో అలీగఢ్ యూనివర్సిటీకి ఇస్లామ్ 2.22 లక్షల డాలర్లు విరాళం అందజేశారు. భారత్‌లోని ముస్లిం మైనారిటీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఏఎఫ్‌ఎమ్‌ఐ కృషి చేస్తోంది.

క్రీడలుప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్బీజింగ్‌లో ఆగస్టు 30న ముగిసిన ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏడు స్వర్ణాలతో కెన్యా తొలిసారి మొదటి స్థానం సాధించింది. మరో ఆఫ్రికా దేశం జమైకా రెండో స్థానంలో నిలిచింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఆఫ్రికా దేశం అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. మొత్తం 206 దేశాలు పాల్గొన్న చాంపియన్‌షిప్‌లో భారత్ 65వ స్థానంలో నిలిచింది. భారత అథ్లెట్ లలితా శివాజీ బాబర్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక పాయింట్ భారత్‌కు లభించింది. మొత్తం 18 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

పతకాల పట్టిక:మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు
దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
కెన్యా76316
జమైకా72312
అమెరికా66618
బ్రిటన్4127
ఇథియోపియా3328


ఈ చాంపియన్‌షిప్‌లో జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మూడు బంగారు పతకాలు సాధించాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు నాలుగొందల మీటర్ల రిలేలో తన సహచరులతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ మొత్తం 11 స్వర్ణ పతకాలు సాధించాడు.

12 ఏళ్ల తర్వాత యూరోప్ అథ్లెట్‌కు స్వర్ణంమహిళల 200 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్ అమ్మాయి డాఫ్నె ష్కిపెర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 28న జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో ష్కిపెర్స్ 21.63 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో యూరోప్ అథ్లెట్‌కు పసిడి పతకం లభించింది. చివరిసారి 2003లో అనస్తాసియా కాపాచిన్స్‌కాయా (రష్యా) ఈ ఘనత సాధించింది.

రియో ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టుభారత మహిళల హాకీ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆగస్టు 28న ప్రకటించింది. జూలైలో బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్ 5వ స్థానాన్ని సాధించడంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. 36 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు ఈ అర్హత సాధించింది. చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగో స్థానంలో మహిళల జట్టు నిలిచింది. 

అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజుCurrent Affirs భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన ఎస్. వెంకటపతిరాజుకు అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పర్యవేక్షణలోని అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌లలో ఒకడిగా అతను వ్యవహరిస్తాడు. ‘ఐసీసీ అమెరికాస్ క్రికెట్ కంబైన్’ అనే పేరుతో వ్యవహరిస్తున్న ఈ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఐసీసీ కోచ్‌ల బృందాన్ని ఎంపిక చేసింది. రాజుతో పాటు బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్ కూడా ఇందులో ఉన్నారు. క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత రాజు... భారత జట్టు సెలక్టర్‌గా, హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా పని చేయడంతో పాటు హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇటీవలి వరకు ఐసీసీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆసియా రీజియన్ అభివృద్ధి అధికారిగా కూడా పని చేశాడు.

గాంధీ-మండేలా సిరీస్ఇక నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లను ‘ద మహత్మ గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్’గా వ్యవహరించాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి. అలాగే ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘ఫ్రీడం ట్రోఫీ (స్వతంత్ర ట్రోఫీ)’గా నామకరణం చేశాయి. ఈ విషయాన్ని ఆగస్టు 31న ఇరు బోర్డులు తెలియజేశాయి.

శ్రీలంకపై భారత్ చరిత్రాత్మక విజయంభారత క్రికెట్ జట్టు చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 22 ఏళ్ల తర్వా త లంక గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. 2011 తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 1993 తర్వాత శ్రీలంకలో సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని టీమ్ 1-0తో సిరీస్‌ను గెలిచింది. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన కోహ్లికి ఇదే తొలి సిరీస్ విజయం. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 

2022 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య నగరం డర్బన్
2022లో కామన్వెల్త్ గేమ్స్‌ను దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 2న ఆక్లాండ్‌లో సమావేశమైన గేమ్స్ సమాఖ్య ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఈ గేమ్స్‌కు ఓ ఆఫ్రికా దేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. అధిక ఖర్చు కారణంగా కెనడా, ఎడ్మాంటన్ ఫిబ్రవరిలోనే రేసు నుంచి వైదొలగడంతో డర్బన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అలాగే గేమ్స్‌లో నిర్వహించే క్రీడాంశాల సంఖ్యను కూడా 10 నుంచి 16కు పెంచారు. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ప్రెసిడెంట్‌గా స్కాట్లాండ్‌కు చెందిన లూయిస్ మార్టిన్‌ను ఎన్నుకున్నారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates