అంతర్జాతీయంనల్లధనం నిర్మూలనకు భారత్-సీషెల్స్ ఒప్పందం
భారత్ సీషెల్స్ మధ్య ఆగస్టు 26న ఒప్పందం జరిగింది.
సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మైఖెల్ భారత్‌ను సందర్శించినప్పుడు
ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పన్ను ఎగవేతను అరికట్టేలా
సమాచారం మార్పిడికి రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఈ పర్యటనలో అలెక్స్ మైఖెల్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో
చర్చలు జరిపారు. సముద్ర భద్రతలో సంబంధాలు, మత్స్య రంగంలో
సహకారం కోసం భారత్ -సీషెల్స్ కోరుకుంటున్నాయి.
ప్రధాని మోదీ సీషెల్స్‌కు రెండో డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను
బహుమతిగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం
కూడా కుదిరింది.
గంగానది ప్రక్షాళనకు జర్మనీ సాయం
గంగానది ప్రక్షాళనకు
జర్మనీ ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లో ప్రవహిస్తున్న గంగానదిలో
కొంత భాగాన్ని ప్రక్షాళించేందుకు అంగీరించింది. యూరప్‌లోని రైన్ నదిని
శుద్ధీకరించేందుకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు
ఉపయోగిస్తారు. భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు
నిర్మించాలన్న లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛ విద్యాలయలోనూ సాయం
అందించేందుకు జర్మనీ ఒప్పుకుంది.
మౌంట్ మెకిన్లీ పేరు దెనాలిగా మార్పు
ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ మెకిన్లీ పేరును
‘దెనాలి’గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చారు.
ఈ మేరకు వైట్‌హౌస్ వర్గాలు సెప్టెంబర్ 1న ఒక ప్రకటన విడుదల చేశాయి.
1896లో అప్పటి కాబోయే అమెరికా అధ్యక్షుడు విలియమ్
మెకిన్లీ పేరు ఈ పర్వతానికి పెట్టారు. అయితే ఆ పేరు
ఈ ప్రాంత ప్రజలకు నచ్చలేదు. తమ సంస్కృతి సంప్రదాయాలకు
తగిన పేరు పెట్టాలని చాలా కాలం నుంచి వారు డిమాండ్ చేస్తున్నారు.
1975 నుంచి అలస్కా ప్రభుత్వం ఈ విషయంపై కసరత్తు
మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల కోరిక మేరకు
పర్వతం పేరు ‘దెనాలి’గా మారుస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు.
జాతీయం98 స్మార్ట్‌సిటీల ఎంపిక
ఆకర్షణీయ నగరాలు (స్మార్ట్)గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన
98 నగరాల జాబితాను కేంద్రం ఆగస్టు 27న ప్రకటించింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి..
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయి.
మొత్తం జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన
13 నగరాలు ఉన్నాయి. తర్వాత తమిళనాడుకు చెందిన
12 నగరాలు ఉన్నాయి. 10 నగరాలు మహారాష్ట్రకు
చెందినవి ఉన్నాయి. ఇందులో 24 రాష్ట్ర రాజధానులు ఉన్నాయి.
ఈ ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి కేంద్రం రూ.48 వేల కోట్లు
సమకూర్చుతుంది. ఇంతే మొత్తాన్ని రాష్ట్రాలు, పురపాలక సంస్థలు
సమకూర్చాలి. తొలి సంవత్సరం ఒక్కో నగరానికి రూ.200 కోట్లు,
తర్వాత నాలుగు సంవత్సరాలపాటు రూ.100 కోట్లు వ్యయం చేస్తారు.
ఈ పథకం కింద నగరాల్లో తగినంత నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా,
సమర్థమైన రవాణా వ్యవస్థ కల్పిస్తారు. డిజిటలైజేషన్‌ను పెంపొందించి
ప్రజలకు రక్షణ, భద్రత కల్పిస్తారు.
దేశ జనాభాలో తగ్గుతున్న హిందువులు
2011 జనాభా లెక్కల ఆధారంగా మతాలవారీ జనాభా
వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆగస్టు 25న విడుదల చేశారు.
2001లో మొత్తం జనాభా 1,028,610,328గా ఉండగా
2011లో మొత్తం జనాభా 1,210,854,977.
2011 జనాభాలో హిందువులు 96.63 కోట్లు (79.8 శాతం);
ముస్లింలు 17.22 కోట్లు (14.2 శాతం);
క్రైస్తవులు 2.78 కోట్లు (2.3 శాతం);
సిక్కులు 2.08 కోట్లు (1.7 శాతం);
బౌద్ధులు 84 లక్షలు (0.7 శాతం);
జైనులు 45 లక్షలు (0.4 శాతం);
ఇతర మతాల వారు 79 లక్షలు (0.7 శాతం);
ఏ మతం తెలపని వారు 29 లక్షలు (0.2 శాతం) ఉన్నారు.
2011లో మొత్తం జనాభాలో హిందువుల జనాభా 0.7 శాతం
తగ్గగా ముస్లింల జనాభా 0.8 శాతం పెరిగింది.
దేశ జనాభా 2001-11 దశాబ్దకాలంలో 17.7 శాతం పెరిగింది.
సమైఖ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2001లో 7.6 కోట్లుగా ఉన్న జనాభా,
2011లో 8.5 కోట్లకు చేరింది.
2011లో హిందువులు 7.48 కోట్లు,
ముస్లింలు 80.8 లక్షలు,
మతం తెలపని వారి సంఖ్య 4,04,100.
‘పటేల్’ ఆందోళనలో 10 మంది మృతి
గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన సంఘటనల్లో
ఆగస్టు 26న 10 మంది మరణించారు. పటేల్ సామాజిక వర్గాన్ని
ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలో చేర్చాలన్న
డిమాండ్‌తో మొదలైన ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీసింది.
ఈ సంఘటనల వల్ల అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్,
జాంనగర్ సహా అనేక పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ విధించారు.
భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
మరణశిక్ష రద్దుకు లా కమిషన్ సిఫార్సు
మరణశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ ఆగస్టు 31న విడుదల
చేసిన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే, ఉగ్రవాదం, దేశంపై
యుద్ధం ప్రకటించడం వంటి నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని
కమిషన్ సమర్థించింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణశిక్ష
విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని కమిషన్ పేర్కొంది.
జస్టిస్ ఎ.పి.షా నేతృత్వంలోని 20వ లా కమిషన్‌లోని మొత్తం
పది మంది సభ్యులలో మెజారిటీ సభ్యులు ఉరిశిక్ష రద్దుకు
అనుకూలంగా ఉండగా, జస్టిస్ ఉషా మెహ్రా, మరో ఇద్దరు సభ్యులు
ఉరిశిక్షను కొనసాగించాలని స్పష్టం చేశారు.
‘అందరికీ ఇళ్లు’కు 305 పట్టణాల ఎంపిక
దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఉద్దేశించిన అందరికీ
ఇళ్లు పథకం కింద కేంద్రం తొమ్మిది రాష్ట్రాల్లోని 305 నగరాలు,
పట్టణాలను ఎంపిక చేసిన జాబితాను ఆగస్టు 30న విడుదల చేసింది.
ఈ పథకం అమలుకు 15 రాష్ట్రాలతో తప్పనిసరైన ఆరు సంస్కరణల
అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ(34) ఉన్నాయి. అల్పాదాయ వర్గాలకు ఇళ్ల అనుమతుల్లో
సడలింపులు, అద్దె నియంత్రణ చట్టాల సవరణ, మురికివాడల
అభివృద్ధికి అదనపు సడలింపులు వంటివి ఈ సంస్కరణల్లో ఉన్నాయి.
ఒక్కో ఇంటికి రూ.2-2.50 లక్షల ఖర్చు చేస్తుంది. వచ్చే ఆరేళ్లలో
ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.
హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్లు
మహిళలకు మరింత భద్రత కల్పించే చర్యల్లో భాగంగా హర్యానా
ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాల్లో పూర్తిగా మహిళా
సిబ్బందితో పనిచేసే పోలీస్ స్టేషన్లను ఆగస్టు 28న ప్రారంభించింది.
ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ సమీపంలోని
పాంచ్‌కులా పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను స్వయంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని మిగిలిన 20 మహిళా పోలీస్ స్టేషన్లను మంత్రులు
ప్రారంభించారు. ఈ స్టేషన్లలో స్త్రీలకు సంబంధించిన వివిధ నేరాలు,
కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వహిస్తారు.
భూసేకరణ ఆర్డినెన్స్ చెల్లు
భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయబోమని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 30న ‘
మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు.
ఆగస్టు 31తో ఆర్డినెన్స్ గడువు ముగుస్తుంది.
ఇదే ఆఖరి ఆర్డినెన్స్ అని ప్రధాని తెలిపారు.
పాత చట్టాలు యథావిధిగా కొనసాగుతాయని
కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 2013లో
యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంలో
మోదీ ప్రభుత్వం సవరణలు చేసి కొత్త భూసేకరణ
బిల్లును రూపొందించింది.
‘రామచరితమానస్’ను ఆవిష్కరించిన మోదీ
ఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్
రామచరితమానస్ ఆడియో సీడీలను ప్రధాన మంత్రి
నరేంద్ర మోదీ ఆగస్టు 31, 2015వ తేదీన ఢిల్లీలో
ఆవిష్కరించారు. రామచరితమానస్ ఆడియో సీడీలను
తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషిని మోదీ
కొనియాడారు. దీన్ని సంగీత సాధనతో కాకుండా
సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా
తీసుకొచ్చారన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన
రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు
భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు.
పశ్చిమ మధ్య రైల్వే ఘనత
దేశంలో మానవ రహిత లెవల్ క్రాసింగులు లేని తొలి
రైల్వే జోన్ గా పశ్చిమ మధ్య రైల్వే నిలిచింది.
2014 ఏప్రిల్ 1 నాటికి కాపలాదారులు లేని
లెవల్ క్రాసింగులు 118 ఉండగా, వాటిలో 2014-15 లో 80,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతావాటి ని తొలగించారు.
దేశవ్యాప్తంగా 29,487 లెవల్ క్రాసింగులు ఉండగా,
10,046 క్రాసింగు ల్లో కాపలాదారులు లేరు. దీంతో
తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో
రైల్ ఓవర్‌బ్రిడ్జ్‌లు, రైల్ అండర్‌బ్రిడ్జ్‌లు నిర్మించేందుకు
రూ.30వేల కోట్లతో రైల్వే శాఖ ‘స్పెషల్ రైల్వే సేఫ్టీ ఫండ్’ను
ఏర్పాటుచేసింది.

0 Comments