Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయంశ్రీలంక ప్రతిపక్ష నేతగా సంపంతన్Current Affirs మూడు
 దశాబ్దాల తర్వాత శ్రీలంక 
పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా తమిళ నేత ఆర్.సంపంతన్ నియమితులయ్యారు. 
తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) నేత ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైనట్లు
 స్పీకర్ కరు జయసూరియా సెప్టెంబరు 3న ప్రకటించారు. సంపంతన్ 22 సంవత్సరాలకు
 పైగా ఎంపీగా పనిచేశారు. తొలి తమిళ ప్రతిపక్ష నాయకుడిగా 1977 నుంచి 
1983 వరకు తమిళ్ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ (టీయూఎల్‌ఎఫ్)కు చెందిన
 ఎ.అమృతలింగమ్ పనిచేశారు. 

చైనా సైనిక పాటవ ప్రదర్శనరెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు 
పూర్తయిన 
సందర్భంగా చైనా తన సైనిక పాటవాన్ని సెప్టెంబరు 2న బీజింగ్‌లోని తియన్మెన్ 
స్క్వేర్ వద్ద ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఖండాంతర బాలిస్టిక్
 క్షిపణులు వంటి ఆయుధాలను చైనా ప్రదర్శించింది. రష్యా, పాకిస్తాన్ సహా 
17 దేశాల నుంచి వచ్చిన వెయ్యి మంది సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు.
 చైనా పౌరులు, విదేశీ అతిథులు ఈ ప్రదర్శనను వీక్షించారు. చైనా అధ్యక్షుడు 
జీ జిన్‌పింగ్‌తోపాటు వేదికపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్,
 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ 
వి.కె.సింగ్ సహా 30 దేశాల నేతలు ఈ ప్రదర్శనను తిలకించారు.

బహదుర్ డాంగీ మృతిప్రపంచంలో అతి పొట్టి మనిషిగా గిన్నిస్ రికార్డుల్లో ఉన్న నేపాల్‌కు 
చెందిన చంద్ర 
బహదూర్ డాంగీ (75) అమెరికాలో సెప్టెంబరు 4న అనారోగ్యంతో మరణించారు. 
2012 గిన్నిస్ రికార్డు ప్రకారం డాంగీ ఎత్తు 54.6 సెంటీమీటర్లు. 

క్వీన్ ఎలిజబెత్-2 సరికొత్త రికార్డుబ్రిటన్‌ను సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న రాజ్యాధినేతగా
 89 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 
సెప్టెంబర్ 9, 2015వ తేదీన రికార్డు సృష్టించారు. ఇంతకుముందు బ్రిటన్‌కు అత్యధిక 
కాలం రాణిగా కొనసాగిన క్వీన్ విక్టోరియా (క్వీన్ ఎలిజబెత్-2 నానమ్మకు నానమ్మ) 
63 ఏళ్ల పరిపాలన రికార్డును క్వీన్ ఎలిజబెత్ - 2 అధిగమించారు. స్థానిక కాలమానం 
ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ఆమె పాలనకు 63 ఏళ్ల 7 
నెలల కాలం పూర్తయింది. ఈ సందర్భంగా లండన్‌లోని రాజసౌధంలో వేడుకలు జరిపి, 
ఆమెకు తుపాకి వందనం సమర్పించారు.

జాతీయంవన్ పెన్షన్ అమలుకు కేంద్రం నిర్ణయంమాజీ సైనికులకు ఒక ర్యాంకు-ఒక 
పెన్షన్ విధానాన్ని త్వరలో అమలుచేస్తామని 
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 5న ప్రకటించారు. 
దీన్ని 2014 జూలై నుంచి వర్తింపచేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల 
ప్రభుత్వంపై రూ.8000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల మేర భారం పడనుంది. 
దాదాపు 24 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. గతంలో ఉన్న 
ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని మూడో పే కమిషన్ నివేదికల ఆధారంగా 
1973లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.

డెహ్రాడూన్‌లో ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రంసహజ వారసత్వ ప్రాంతాల రక్షణలో
 భాగంగా తొలి ప్రపంచ సహజ పరిరక్షణ 
కేంద్రం డెహ్రాడూన్‌లో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఒప్పంద
 పత్రాలపై సెప్టెంబరు 2న భారత్, యునెస్కోలు సంతకాలు చేశాయి. 
ఈ కేంద్రాన్ని డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
 (డబ్ల్యూఐఐ)లో ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రపంచ స్థాయి సహజ వారసత్వ 
సంపద, నిర్వహణ, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం 
ఎనిమిది దేశాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలు సాంస్కృతిక 
వారసత్వ పరిరక్షణకు పనిచేస్తున్నాయి. కాగా సహజ వారసత్వ పరిరక్షణ 
కోసం యునెస్కో ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదే. డెహ్రాడూన్‌లోని కేంద్రం 
ఆసియా, పసిఫిక్ ప్రాంతాలతో పాటు 50 దేశాల్లోని పరిరక్షించదగ్గ సహజ 
వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 227 
వారసత్వ ప్రాంతాలు ఉండగా అందులో 59 సహజ వారసత్వ ప్రాంతాలు. 
ఇండియాలో 32 వారసత్వ ప్రదేశాలు ఉండగా అందులో తొమ్మిది 
సహజ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.

మణిపూర్ హింసలో 8 మంది మృతిమణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘాలు 
సెప్టెంబరు 1న నిర్వహించిన
 బంద్ హింసాత్మకంగా మారి 8 మంది మృతికి దారితీసింది. 
చురచాంద్‌పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనలో నలుగురు పోలీసుల 
కాల్పుల్లో మరణించారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.
 ఆగస్టు 31న శాసనసభ ఆమోదించిన మణిపూర్ భూ రెవెన్యూ, 
సంస్కరణల(సవరణ) బిల్లు-2015కు వ్యతిరేకంగా గిరిజన విద్యార్థి 
సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు 
భూమి కొనుగోలు హక్కు కల్పిస్తుంది. స్థానిక గిరిజన తెగలు ఇన్నర్‌లైన్ పర్మిట్ 
(ఐఎల్‌పీ) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

జనతా పరివార్ నుంచి వైదొలిగిన సమాజ్‌వాదీ పార్టీబిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 
కలసి పోటీచేసేందుకు కూటమిగా ఏర్పడిన
జనతా పరివార్ నుంచి ములాయం సింగ్ సార్థ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ
 (ఎస్పీ) వైదొలిగింది. ఈ మేరకు సెప్టెంబర్ 2, 2015వ తేదీన జరిగిన 
పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి 
సంప్రదింపులు లేకుండా ఎస్పీకి కేవలం ఐదు సీట్లు కేటాయించడం వల్లే
 కూటమి నుంచి వైదొలిగినట్లు ములాయం వెల్లడించారు. ఎన్నికల్లో సొంతంగా
 పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

విద్యార్థులకు పాఠాలు చెప్పిన రాష్ట్రపతిఉపాధ్యాయ దినోత్సవాన్ని 
పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 
విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2015వ తేదీన 
నిర్వహించిన ‘బి ఎ టీచర్’ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లో
 ఉన్న ‘డా.రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ’ పాఠశాలలో ప్రణబ్ టీచర్
 అవతారం ఎత్తారు. 11వ, 12వ తరగతి పిల్లలకు ‘భారతదేశ రాజకీయ 
చరిత్ర’పై గంటపాటు పాఠాలు చెప్పారు. దేశ చరిత్రలో రాష్ట్రపతి పదవిలో 
ఉండగా విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇదే తొలిసారి.

అమ్మ బేబీకేర్ కిట్‌ను ప్రారంభించిన జయలలిత
Current Affirsతమిళనాడు ముఖ్యమంత్రి
 జయలలిత ‘అమ్మ బేబీ కేర్ కిట్’ అనే సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. 
ఈ పథకం కింద నవజాత శిశువుకు అవసరమైన సామగ్రిని ప్రభుత్వం అందజేస్తుంది. 
ఈ కిట్‌లో రూ.1000 విలువ చేసే సామాగ్రి ఉంటుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం 
ఈ ఏడాది రూ. 67 కోట్లను కేటాయించింది.

అక్టోబర్ 12 నుంచి బిహార్ ఎన్నికలుబిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల 
సంఘం ప్రకటించింది. 2015, 
అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో ఈ ఎన్నికలను 
నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ వెల్లడించారు.
 నవంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బిహార్ ప్రస్తుత శాసనసభ కాలపరిమితి 
నవంబర్ 29తో ముగియనుంది. 2010లో జరిగిన గత ఎన్నికల్లో 6 విడతల్లో 
ఎన్నికలు నిర్వహించారు. బిహార్‌లో 6.68 కోట్లమంది ఓటర్లున్నారు. తొలి విడత 
ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 16న వెలువడనుంది.

రాష్ట్రీయంఈ-ప్రగతి ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదంప్రభుత్వ యంత్రాంగం 
కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ఈ-ప్రగతి ప్రాజెక్టుకు 
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సెప్టెంబరు 5న ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 డిపార్ట్‌మెంట్లు, 745 ఈ-సేవలను 
ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తారు. సింగపూర్ కంపెనీ, విప్రోల సంయుక్త 
భాగస్వామ్యంతో మూడు దశల్లో ప్రాజెక్టును పూర్తిచేస్తారు. ఇందుకు మొత్తం రూ.2,358
 కోట్లు ఖర్చుచేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,528 కోట్లు సమకూర్చుతుంది.

ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ 
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని 
పెంచుతూ సెప్టెంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వల్ల 
జడ్పీ చైర్మన్ వేతనం రూ.7,500 నుంచి రూ.40 వేలకు పెరిగింది.
 అలాగే జడ్పీటీసీ సభ్యుల వేతనం రూ.2,250 నుంచి ఆరువేలకు, 
ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.6,000కు, ఎంపీటీసీ సభ్యుల వేతనం 
రూ. 750 నుంచి రూ.3,000కు, సర్పంచ్‌ల వేతనం రూ.వెయ్యి నుంచి 
రూ.3 వేలకు పెరిగింది.

తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిప్రజా కవి
 కాళోజీ నారాయణరావు జన్మదినమైన సెప్టెంబరు 9న తెలంగాణ 
భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 
సెప్టెంబరు 6న ప్రకటించారు. ఆ రోజున రాష్ట్రమంతటా తెలంగాణా భాషా 
చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
తెలంగాణా భాషపై చర్చాగోష్టులు, రచనలు, ఉపన్యాసాలు, కవితల్లో పోటీలు 
నిర్వహిస్తారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి సేవ చేసిన వారికి కాళోజీ 
పేరున స్మారక పురస్కారం అందజేస్తారు.

స్వచ్ఛ భారత్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా లక్ష్మికేంద్రం చేపట్టిన స్వచ్ఛ 
భారత్ కార్యక్రమానికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా 
సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. సెప్టెంబర్ 10, 2015వ 
తేదీన రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించారు. 

సాక్షరభారత్ అవార్డుకు అంకిరెడ్డిగూడెంతెలంగాణలోని చౌటుప్పల్
 మండలం అంకిరెడ్డిగూడెం గ్రామం సాక్షరభారత్ 
జాతీయ అవార్డుకు ఎంపికైంది. సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన కోసం కృషి 
చేస్తున్నందుకు గానూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో
 ఈ గ్రామాన్ని అవార్డుకు ఎంపిక చేసింది. అంకిరెడ్డిగూడెం గ్రామంలో
 సాక్షరభారత్ పథకం కింద వయోజన విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేసి, 
నిత్యం విద్యను అందిస్తున్నారు.

పూసర్లపాడుకు సాక్షర భారత్ అవార్డుజాతీయస్థాయిలో ఉత్తమ 
సాక్షర భారత్ కేంద్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌లోని 
శ్రీకాకుళం జిల్లా గార మండలం పూసర్లపాడు తరఫున జిల్లా కలెక్టర్ 
పి.లక్ష్మీనరసింహం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డును 
అందుకున్నారు. సెప్టెంబర్ 8, 2015వ తేదీన ‘అంతర్జాతీయ అక్షరాస్యత 
దినోత్సవం’ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో
 ఈ అవార్డును అందజేశారు.

హైదరాబాద్‌లో షీ క్యాబ్స్ ప్రారంభం
మహిళల భద్రత దృష్ట్యా
 తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షీ క్యాబ్స్ సేవలు
 హైదరాబాద్‌లో 
ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా కమిషనర్ 
కార్యాలయంలో సెప్టెంబర్ 8, 2015వ తేదీన మంత్రి మహేందర్‌రెడ్డి షీ 
క్యాబ్స్‌ను ప్రారంభించారు. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్‌ను 
పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేస్తారు. క్యాబ్‌ల కదలికలు 
ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదవుతాయి.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న కేసీఆర్చైనాలోని డేలియన్
 నగరంలో సెప్టెంబర్ 9, 2015వ తేదీన వరల్డ్ ఎకనమిక్ 
ఫోరం నిర్వహించిన న్యూ చాంపియన్స్-2015 సదస్సులో తెలంగాణ 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ‘ఎమర్జింగ్ మార్కెట్స్ 
ఎట్ క్రాస్‌రోడ్స్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో కేసీఆర్ ప్రసంగించారు. 
తెలంగాణలో.. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని 
పారిశ్రామికవేత్తలను కోరారు.

ఆర్థికంకరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం!నకిలీ కరెన్సీ నోట్ల 
నియంత్రణ దిశగా రూ.1000, రూ.500 నోట్లలో కొత్త 
నంబరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
(ఆర్‌బీఐ) భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ముద్రా ప్రైవేట్ లిమిటెడ్, 
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు 
సూచించింది. ఈ కొత్త నోట్లు వచ్చే ఏడాది మే నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో ఐఓసీఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్‌కు
 చెందిన అతిపెద్ద చమురు 
రిటైల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి 119వ స్థానం 
దక్కింది. ఇది 2015 సంవత్సరానికి గ్లోబల్ 500 రెవెన్యూలో అతిపెద్ద 
భారతీయ సంస్థగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచింది. గత 20 ఏళ్లుగా 
ఐఓసీ ఈ జాబితాలో చోటుదక్కించుకుంటోంది. ఇంతవరకు ఏ భారతీయ
 కంపెనీ కూడా ఫార్చ్యూన్ జాబితాలో ఐఓసీని అధిగమించలేదు.

జతియా హౌస్‌ను రూ.425 కోట్లకు కొన్న బిర్లా
పారిశ్రామిక దిగ్గజం 
కుమార మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్‌లో ఉన్న జతియా 
హౌస్‌ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు 
కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది భారీ మొత్తం. 
సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ రెండతస్తుల బంగళా.. బిల్టప్ ఏరియా 
సుమారు 25వేల చ.అ. ఉంటుంది. 1970లలో వై జతియా దీన్ని ఎంసీ 
వకీల్ నుంచి కొనుగోలు చేశారు.

గోల్డ్ బాండ్, డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదంగోల్డ్ బాండ్, పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ 
సెప్టెంబర్ 9, 2015వ తేదీన ఆమోద ముద్ర వేసింది. మెటల్‌గా 
(ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో
 బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి,
 ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత 
ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు.

డిపాజిట్ స్కీమ్:డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని 
బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), 
దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు) డిపాజిట్ చేసుకోవచ్చు.
 బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు 
రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు.

గోల్డ్ బాండ్:గోల్డ్ బాండ్ పథకం వార్షిక గరిష్ట పరిమితి వ్యక్తికి 500 గ్రాములు. 
5 నుంచి 7 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్ల జారీ జరుగుతుంది. 
ఈ స్కీమ్ ప్రకారం, పసిడిని ఫిజికల్‌గా కాకుండా, భారత పౌరులు గోల్డ్ 
బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. 5, 10.50, 100 గ్రాముల 
చొప్పున ఈ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. వాటి కాలవ్యవధి 5 నుంచి 7 
ఏళ్లు వుంటుంది. భారత పౌరులు, సంస్థలకు మాత్రమే ఈ బాండ్లను 
ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ కంటే ముందస్తుగా వీటిని అమ్మేందుకు 
వీలుగా ఎక్స్ఛేంజీలపై ఈ బాండ్లు ట్రేడవుతాయి.

అవార్డులుభారత్‌కు యునెస్కో అవార్డుకేరళలోని త్రిసూర్‌లో గల వడక్కునాథన్ ఆలయ పరిరక్షణకు తీసుకున్న 
చర్యలకు గానూ భారత్‌కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ 
(యునెస్కో) మొత్తం 5 దేశాలలోని(భారత్, చైనా, లావోడిపిఆర్, ఆస్ట్రేలియా,
 థాయిలాండ్) 12 ప్రాజెక్టులకు వివిధ కేటగిరీల్లో 2015 సంవత్సరానికి
 అవార్డులను ప్రకటించింది. 

ఝంపా లాహిరికి నేషనల్ హ్యుమానిటీస్ మెడల్భారతీయ అమెరికన్, పులిట్జర్ బహుమతి గ్రహీత ఝంపా లాహిరికి 2014 
సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ లభించింది.
 మానవ సంబంధాలను అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు ఈ అవార్డుకు 
ఆమెను ఎంపికచేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. ఆమె తన 
రచనల ద్వారా భారతీయ అమెరికన్ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించినట్లు
 తెలిపింది. ఈ అవార్డును ఆమెకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా
 సెప్టెంబరు 10న బహూకరిస్తారు.

ఇండియన్ అమెరికన్‌కు విశిష్ట ఉపాధ్యాయ అవార్డుభారత సంతతికి చెందిన అమెరికన్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రీతికా కుమార్ 
2015 సంవత్సరానికి గాను ‘సి.హోమ్స్ మెక్‌డొనాల్డ్ విశిష్ట ఉపాధ్యాయ’
 పురస్కారానికి ఎంపికయ్యారు. విచితా స్టేట్ యూనివర్సిటీలో ఆమె 
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బోధిస్తున్నారు.

హరిప్రసాద్ చౌరాసియాకు కొప్పరపు కవుల పురస్కారంప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్ 
చౌరాసియాకు కొప్పరపు కవుల ప్రతిభా జాతీయ పురస్కారాన్ని 
అందజేయనున్నారు. సెప్టెంబర్ 9, 2015వ తేదీన విశాఖపట్నంలోని 
కళాభారతి ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. కొప్పరపు 
కవుల కళాపీఠం ఈ పురస్కారాన్ని నెలకొల్పింది.

అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారంCurrent Affirsతెలంగాణ భాషా సాంస్కృతిక 
శాఖ ఏర్పాటు చేసిన కాళోజీ పురస్కారాన్ని తొలిసారిగా డాక్టర్ అమ్మంగి 
వేణుగోపాల్‌కు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సెప్టెంబర్ 9, 
2015వ తేదీన ప్రజా కవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి 
ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారంతో 
సత్కరించారు. పురస్కారం కింద జ్ఞాపికతోపాటు రూ.లక్షా వేయి నూటపదహార్ల 
నగదు బహుమతి లభించింది.

ఇస్రోకు గాంధీ శాంతి బహుమతి ప్రదానంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు 2014 ఏడాదికి గాను ప్రకటించిన 
గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. సెప్టెంబర్ 9, 2015వ తేదీన 
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఏఎస్
 కిరణ్ కుమార్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డును బహూకరించారు. 
ఈ అవార్డు కింద రూ.కోటి నగదు, జ్ఞాపిక, ప్రశంసా ప్రతాన్ని అందజేశారు. 

వార్తల్లో వ్యక్తులుసియాం కొత్త ప్రెసిడెంట్ వినోద్ దాసరిసొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియాం)
 కొత్త ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి ఎన్నికయ్యారు. 
కొత్త వైస్-ప్రెసిడెంట్‌గా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, 
ఎండీ అర్వింద్ సక్సేనా, కొత్త కోశాధికారిగా మారుతీ సుజుకీ ఇండియా 
ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ ఎన్నికయ్యారు. వాహన కంపెనీలకు 
ప్రాతినిధ్యం వహించే దేశంలోనే అతిపెద్ద సంస్థ సియాం, పరిశ్రమకు, 
ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. వాహన 
పరిశ్రమకు సంబంధించి నియమ, నిబంధనలను, విధానాల
 రూపకల్పనలో సంబంధిత వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తుంది. 

సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి అత్యున్నత పదవిభారతీయ సంతతికి చెందిన వ్యక్తికి పొరుగుదేశం సింగపూర్‌లో గొప్ప
 గౌరవం దక్కింది. జేవై పిళ్లై (81) అనే భారత సంతతికి చెందిన వ్యక్తి 
సింగపూర్‌లోని ఓరని సింగపూర్ మేనేజమెంట్ యూనివర్సిటీ
 (ఎస్‌ఎంయూ)కి చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో 
ఆయన ఐదేళ్లపాటు కొనసాగుతారు. అంతకుముందు చాన్స్‌లర్‌గా 
పనిచేసిన యాంగ్‌పంగ్‌హో నుంచి పిళ్లై బాధ్యతలు స్వీకరించినట్లు
 వర్సిటీ యాజ మాన్యం తెలిపింది. మలేసియా నుంచి సింగపూర్
 విడిపోయిన తర్వాత ఆదేశం సాధించిన ఆర్థిక పురోభివృద్ధికి బాటలు
 వేసిన వ్యక్తుల్లో పిళ్లై కూడా ఒకరు. సింగపూర్ ఎక్సేంగ్‌కు ఏడాదిపాటు
 చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

గోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్ కన్నుమూతగోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్ డిసౌజా(88) గుండెపోటుతో సెప్టెంబర్ 4,
 2015వ తేదీన కన్నుమూశారు. స్వతహాగా వైద్యుడైన డిసౌజా
 కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఈ పార్టీ నుంచే మూడు సార్లు
 (1993-1994, 1994-1998, 1998-1999) గోవా సీఎం
 పీఠాన్ని అధిష్టించారు. గతంలో గోవా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా
 సేవలందించారు. 

‘నమామి గంగే’కు అమృతానందమయి రూ.100 కోట్ల విరాళంCurrent Affirsకేంద్ర ప్రభుత్వం
 ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు ప్రముఖ 
ఆద్యాత్మికవేత్త మాతా అమృతానందమయి రూ.100 కోట్ల 
విరాళం ప్రకటించారు. గంగా నదీ పరివాహక గ్రామాల్లో మరుగుదొడ్ల 
నిర్మాణానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. ప్రజారోగ్యం కోసం మాతా అమృతానందమయి మఠం 2010లో అమల భారతం క్యాంపెయిన్(ఏబీసీ)ని ప్రారంభించింది.

ఏబీసీ చైర్మన్‌గా శశిధర్ సిన్హాఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ఐపీజీ మీడియా బ్రాండ్స్ సీఈఓ శశిధర్ సిన్హా ఎన్నికయ్యారు. ఏఎస్‌సీఐ, ఎంఆర్‌యూసీ, ఆర్‌ఎస్‌సీఐ, యాడ్ క్లబ్ సంస్థల్లో కీలక పాత్ర పోషించే సిన్హా.. బార్క్ టెక్నికల్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఏబీసీ 67వ వార్షిక సమావేశంలో 2015-16 సంవత్సరానికి ఆయన్ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏబీసీ సెక్రటరీ జనరల్ హెచ్‌బీ మసానీ సెప్టెంబర్ 9న ప్రకటించారు. ‘ఈనాడు’కు చెందిన ఐ.వెంకట్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. 

గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సీఈవోగా భారత సంతతి వ్యక్తిప్రతిష్టాత్మక అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సీఈవోగా భారత సంతతికి చెందిన మహేశ్ రామానుజం ఎంపికయ్యారు. చెన్నైకి చెందిన రామానుజం యూఎస్‌జీబీసీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా, గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం యూఎస్‌జీబీసీ సీఈవోగా ఉన్న రిక్ ఫెడ్రిజ్జ్ స్థానాన్ని 2016 చివరలో రామానుజంతో భర్తీ చేస్తారు.

డీఆర్‌డీవోలో తొలి మహిళా డెరైక్టర్‌గా మంజులడిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి తొలి మహిళా డెరైక్టర్ జనరల్‌గా జె.మంజుల నియమితులయ్యారు. ప్రస్తుత డెరైక్టర్ జనరల్, ప్రముఖ శాస్త్రవేత్త కేడీ నాయక్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఆమె పట్టా పొందారు. అలాగే హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబొరేటరీలో 26 ఏళ్లకు పైగా సేవలందించారు. ప్రస్తుతం ఆమె డిఫెన్స్ ఏవియానిక్స్ రీసెర్చ్ స్టాబ్లిష్‌మెంట్(డీఏఆర్‌ఈ) విభాగానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. 

సైన్స్ అండ్ టెక్నాలజీఐఎస్‌ఎస్‌కు చేరిన రష్యా వ్యోమనౌకముగ్గురు వ్యోమగాములతో కూడిన రష్యా వ్యోమనౌక సెప్టెంబర్ 4, 2015వ తేదీన విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) చేరింది. కజక్‌స్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సూయజ్-ఎఫ్‌జీ రాకెట్ ద్వారా ప్రయోగించిన సూయజ్ టీఎమ్‌ఏ-18ఎమ్ ఐఎస్‌ఎస్‌కు చేరింది. ప్రయోగించిన ఆరుగంటల్లోపే ఐఎస్‌ఎస్‌కు చేరే లా మొదట ప్రణాళిక రూపొందించినా భద్రతా సమస్యల కారణంగా యాభై గంటలకు చేరేలా తరువాత షెడ్యూల్‌ను మార్పు చేశారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో వ్యోమగాములు సెర్జీ వోల్‌కోవ్, ఆండ్రియాస్ మొగెసెన్, ఎమ్‌బెతోవ్ ఉన్నారు. 

పాకిస్తాన్ తొలి స్వదేశీ ద్రోన్ తొలిసారి దేశీయంగా తయారు చేసిన, సాయుధ ద్రోన్ బురాఖ్‌ను సెప్టెంబర్ 7, 2015వ తేదీన పాకిస్తాన్ రంగంలోకి దింపింది. తొలి దాడిలోనే ఆ ద్రోన్ అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని షావల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరంలో దాక్కుని ఉన్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. పైలట్ రహిత చిన్న విమానం ఆ స్థావరంపై బుర్ఖ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. బురాఖ్ రూపకల్పనతో క్షిపణులను ప్రయోగించగల ద్రోన్‌లను కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనాల సరసన పాకిస్తాన్ కూడా చేరింది. 

క్రీడలుఅపూర్వికి షూటింగ్‌లో రజతంCurrent Affirsఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ అపూర్వి చండేలా రజత పతకం సాధించింది. సెప్టెంబరు 5న మునిచ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అపూర్వి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. అహ్మది ఎల్హాన్ (ఇరాన్) స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాకు చెందిన ఆండ్రియాకు కాంస్య పతకం దక్కింది.

జోష్న చిన్నప్పకు ఇండియన్ స్క్వాష్ టైటిల్ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్‌లో జోష్న చిన్నప్ప (భారత్) మహిళల టైటిల్ గెలుచుకుంది. ముంబైలో సెప్టెంబరు 6న జరిగిన పోటీలో హబీబా మహ్మద్ (ఈజిప్టు)ను జోష్న ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఆడ్రియన్ వాలెర్(ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. మహేశ్ మంగోంకర్ (భారత్)ను వాలెర్ ఓడించారు.

హామిల్టన్‌కు ఇటాలియన్ గ్రాండ్ ప్రిఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మొంజా (ఇటలీ) లో సెప్టెంబరు 6న జరిగిన రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలువగా, ఫెరారీ డ్రైవర్ వెటల్ రెండో స్థానం సాధించాడు.

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. బ్యాంకాక్‌లో సెప్టెంబరు 6న ముగిసిన పోటీల్లో కజకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ రెండో స్థానంలో, థాయిలాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఈవెంట్ ద్వారా అక్టోబరులో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు.

కోచ్ పదవికి అటపట్టు రాజీనామాభారత్‌తో టెస్టు సిరీస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక చీఫ్ కోచ్ మర్వన్ అటపట్టు తన పదవి నుంచి వైదొలిగారు. శ్రీలంక జట్టు వరుసగా పాకిస్తాన్, భారత్ చేతిలో టెస్టు పరాజయాలను చవిచూసింది. 2014 సెప్టెంబర్ నుంచి ఆటపట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాను శ్రీలంక క్రికెట్ తాత్కాలిక చీఫ్ సిదాత్ వెట్టిముని ఆమోదించారు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates