అంతర్జాతీయం3,890కి చేరిన పులుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా తొలిసారి పులుల సంఖ్య పెరిగిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్).. గ్లోబల్ టైగర్ ఫోరమ్ (జీటీఎఫ్) ఏప్రిల్ 11న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య ఈ ఏడాదికి 3,890కి చేరుకున్నట్లు తెలిపింది. భారత్, రష్యా, నేపాల్, భూటాన్ దేశాల్లో పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల ఫలితంగానే వాటి సంఖ్య పెరిగినట్లు నివేదిక అభిప్రాయపడింది. మొత్తం పులుల్లో భారత్‌లో 2,226, రష్యాలో 433, ఇండోనేషియాలో 371 పులులున్నాయి.
వాతావరణ ఒప్పందంపై 120 దేశాల సంతకాలుభూతాపాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన కార్యచరణను అమలు చేసేందుకు 120 దేశాలు అంగీకరించాయి. ఈ దేశాలన్నీ త్వరలో వాతావరణ ఒప్పందంపై సంతకాలు కూడా చేయనున్నాయి. డిసెంబర్ నాటికి ఈ దేశాల సంఖ్య 200కు చేరొచ్చని అంచనా. ఏప్రిల్ 22న న్యూయార్క్‌లో ఈ మేరకు సమావేశం జరిగే అవకాశముంది. భూతాపాన్ని 2.0 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ప్రస్తుతానికి స్థాయికి మించిన కర్బన ఉద్ఘారాలను వాతావరణంలోకి వదులుతున్న దేశాలు 55 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయి.
ఐరాసలో తొలిసారి అంబేడ్కర్ జయంతి వేడుకలుభారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో నిర్వహించనున్నారు. కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ హారిజాన్‌ల సహకారంతో భారత శాశ్వత ప్రతినిధుల బృందం అంబేద్కర్ 125వ జయంతిని నిర్వహిస్తోంది. అంబేడ్కర్ జయంతికి ఒకరోజు ముందు ఏప్రిల్ 13న ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలు జరుపుతారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీలు) సాధన కోసం అసమానతలపై పోరాటానికి గుర్తుగా అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నామని భారత్ బృందం తెలిపింది. ‘సుస్థిర అభివృద్ధి సాధనకు అసమానతలపై పోరాటం’పై సదస్సు కూడా నిర్వహించనున్నారు.
జాతీయంబ్రిటన్ ప్రిన్స్ జంట భారత పర్యటనబ్రిటన్ రాకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్‌లు వారం రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్ 10న భారత్ చేరుకున్నారు. వీరు ముంబైలో దిగిన అనంతరం నేరుగా తాజ్ ప్యాలెస్ హోటల్‌కు వెళ్లి 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. తాజ్ హోటల్ నుంచి ఓవల్ మైదానానికి చేరుకున్న ఈ జంట పలు స్వచ్ఛంద సంస్థల చిన్నారులు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలసి క్రికెట్ ఆడారు. విలియమ్ జంట భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
శని శింగ్నాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం
వివాదాస్పద శని శింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేశారు. మహారాష్ట్రీయుల కొత్త సంవ త్సరం ‘గుడి పడ్వా’ కానుకగా ఆలయ ట్రస్టు ఏప్రిల్ 8న ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై హైకోర్టు ఆదేశాల్ని అనుసరిస్తూ అందరికి శనిదేవుడ్ని కొలిచేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శని శింగ్నాపూర్‌లోకి మహిళల్ని అనుమతించాలంటూ గత కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దశాబ్దాల కట్టుబాట్లను బద్దలుకొడుతూ 2015 నవంబరులో శనిదేవునికి ఓ మహిళ తైలాభిషేకం చేసింది. ఈ సంఘటన అనంతరం అనేక సంఘాలు ముందుకొచ్చి మహిళలకు ప్రవేశంపై పోరాటం చేశాయి. ‘భూమాతా రణరాగిని బ్రిగేడ్’ ఆధ్వర్యంలో తృప్తి దేశాయి(32) మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఆలయంలోకి వెళ్లేందుకు అనేకసార్లు ప్రయత్నించారు. దేవుడ్ని పూజించేందుకు మహిళల్ని అనుమతించాలని, శని శింగ్నాపూర్ ఆలయ ప్రవేశం కల్పించాలంటూ బాంబే హైకోర్టు ఏప్రిల్ 1న ఆదేశించింది.
కేరళ పుట్టింగల్ ఆలయంలో పెను విషాదంకేరళలోని కొల్లాం జిల్లా పరువూర్‌లో ఉన్న పుట్టింగల్ ఆలయంలో ఏప్రిల్ 10న జరిగిన అగ్నిప్రమాదంలో 106 మంది మృతిచెందారు. ఇక్కడ ఏటా 7 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు పెద్దఎత్తున బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ బాణసంచా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రాకెట్ మాదిరి నింగిలోకి దూసుకెళ్లి పెద్దశబ్దంతో పేలిపోయే ‘అమిట్టు’ అనే టపాసును వెలిగించారు. ఈ టపాసే పెను విధ్వంసానికి కారణమైంది. నిప్పంటించగానే ఆకాశంలోకి వెళ్లాల్సిన అమిట్టు నేలపైనే పేలిపోయింది. నిప్పు రవ్వలు మరిన్ని అమిట్టులపై పడడంతో అవన్నీ పేలాయి. ఇదే సమయంలో పక్కనే బాణసంచాను నిల్వ చేసిన రెండంతస్తుల భవనంలోని టపాసులు పేలడం మొదలైంది. ఈ మంటలకు 106 మంది ఆహుతవగా 383 మంది తీవ్రగాయాల పాలయ్యారు.
పులుల సంరక్షణ కోసం ఆసియా మంత్రుల సమావేశంఅంతరించిపోతున్న జీవుల జాబితాలో ముందువరుసలో ఉన్న పులుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆసియా దేశాల మంత్రులు సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12న నిర్వహించిన ఈ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సమావేశంలో ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, చైనా, ఇండోనేషియా, మలేసియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయ్‌లాండ్, వియెత్నాం, కిర్గిజ్, కజకిస్తాన్ దేశాల పర్యావరణ మంత్రులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
లాతుర్‌కు చేరిన వాటర్ ట్రైన్తీవ్ర నీటి ఎద్దడి, కరువుతో తల్లడిల్లుతున్న మహారాష్ట్రలోని లాతుర్‌కు నీరు సరఫరా చేసేందుకు ఏప్రిల్ 11న మిరాజ్ నుంచి పది వ్యాగన్‌లతో బయలుదేరిన వాటర్ ట్రైన్ ఏప్రిల్ 12న లాతుర్ చేరుకుంది. ప్రతి వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. సాంగ్లిలోని మిరాజ్ రైల్వే స్టేషన్‌లో నీటిని నింపి లాతుర్‌కు తీసుకువచ్చారు. రైల్వే స్టేషన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌ముఖ్ బావిలో నీటిని నిల్వ చేయనున్నారు. ఇక్కడ నీటిని శుద్ధిచేసి 70 ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు సరఫరా చేయనున్నారు.
‘మహారాజా ఎక్స్‌ప్రెస్’కు ప్రపంచ గుర్తింపుభారతదేశంలోని ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైళ్లల్లో ఒకటిగా గుర్తించారు. న్యూ వరల్డ్ వెల్త్ కంపెనీ చేపట్టిన సర్వేలో మహారాజా ఎక్స్‌ప్రెస్ నాల్గో స్థానంలో నిలిచింది. ఈస్ట్రన్ అండ్ ఓరియంటల్ ఎక్స్‌ప్రెస్ (సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లో ప్రయాణిస్తుంది) ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిచింది. భారతీయ సంప్రదాయాలతో, ఆధునిక పోకడలతో ఎంతో విలాసవంతమైన ప్రయాణంగా మహారాజా ఎక్స్‌ప్రెస్ సాగుతుంది. మహారాజా రైలులో పర్యటనలకు రూ. రెండు లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు వివిధ రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. బ్లూ ట్రైన్, రోవోస్ రైలు (సౌత్ ఆఫ్రికా), ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ (యూరప్, టర్కీ) లగ్జరీ రైళ్లలో ప్రసిద్ధి చెందినవి. ఈ సర్వేలో ప్రపంచంలోని ధనవంతుల ఓటింగ్ ఆధారంగా లగ్జరీ రైళ్లను, లగ్జరీ హోటళ్లను ప్రకటించారు. లాస్‌వేగాస్‌లోని బెల్లాజియోను అత్యంత విలాసవంతమైన హోటల్‌గా గుర్తించారు. సహారా గ్రూప్‌నకు చెందిన ప్లాజా హోటల్ (న్యూయార్క్) రెండో స్థానంలో నిలిచింది.
‘సావెన్’లో చేరనున్న భారత్దక్షిణాసియా దేశాల సరిహద్దుల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం రూపొందించిన సౌత్ ఆసియా వైల్డ్‌లైఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ (సావెన్)లో భారత్ సభ్యత్వానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సభ్యదేశాల మధ్య వన్యప్రాణుల విషయంలో జరుగుతున్న నేరాలు, వీటిని ఆపేందుకు పరస్పర సహకారం, సమన్వయం కోసం సావెన్‌ను రూపొందించారు. కాగా, మత్స్య పరిశ్రమలో పరస్పర సహకారానికి భారత్, బంగ్లా మధ్య ఏప్రిల్ 13న ఒప్పందం కుదిరింది. పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి మనుషుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్-యూఏఈ ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. వీటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రీయంహైదరాబాద్‌లో న్యాయసేవా సాధికార సంస్థల సదస్సు
హైదరాబాద్‌లో ఏప్రిల్ 9న జరిగిన న్యాయసేవా సాధికార సంస్థల 14వ జాతీయ సదస్సుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు వివాదంతో న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఇది కచ్చితంగా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
సిచువాన్‌తో ఏపీ ప్రభుత్వ ఒప్పందంమౌలిక వసతుల కల్పనలో పరస్పరం సహకరించుకునేందుకు చైనాలోని సిచువాన్ ప్రొవెన్షియల్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సిచువాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ గవర్నర్ వాంగ్ నింగ్ ఒప్పంద పత్రాలపై ఏప్రిల్ 8న సంతకాలు చేశారు. అనంతరం రెండు ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు.
ఏపీ పర్యాటకం ప్రచారకర్తలుగా అజయ్ దేవగణ్, కాజోల్బాలీవుడ్ నటులు, దంపతులైన అజయ్ దేవగణ్, కాజోల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. అజయ్ దేవగణ్ ఏప్రిల్ 12న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అమరావతి, ఏపీ పర్యాటక రంగానికి తన భార్య కాజోల్‌తో కలిసి ప్రచారకర్తలుగా పని చేస్తామని అజయ్ దేవగణ్ ప్రతిపాదించగా చంద్రబాబు సమ్మతించారు. రాజధానిలో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు అజయ్ ఈ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేశారు. దుబాయ్ తరహాలో వర్చువల్ టెక్నాలజీతో కూడిన స్టూడియో అజయ్ దేవగణ్ నిర్మించనున్నారు.
ద్వైపాక్షికంమాల్దీవులతో భారత్ ఆరు ఒప్పందాలు
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఏప్రిల్ 11న ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందం కుదిరిన అంశాల్లో రక్షణ సహకారం, పన్నులు, పర్యాటకం, అంతరిక్ష పరిశోధన తదితరాలున్నాయి. వీటితో పాటు మాల్దీవుల్లో చారిత్రక కట్టడాలను పరిరక్షించడం, పునరుద్ధరించడంపై ఇరుదేశాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ కొంత కాలం నుంచి మాల్దీవుల్లో ఓడరేవులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేస్తోంది.
ఆర్థికంపవర్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా నీతా అంబానీ
2016గానూ ఫోర్బ్స్ ప్రకటించిన ఆసియాలోని 50 మంది పవర్‌ఫుల్ మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నీతా అంబానీ తొలిస్థానంలో నిలిచారు. భారత్ నుంచి ఈ జాబితాలో మొత్తం 8 మంది మహిళలకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఎస్‌బీఐ సీఎండీ అరుంధతీ భట్టాచార్య రెండోస్థానంలో నిలిచారు. వీరితో పాటు ఈ జాబితాలో సిగ్మా సీఈవో అంబికా దీరజ్ (14), వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలీ గోయెంకా (16), ఐసీఐసీఐ ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చార్ (22), విఎల్‌సీసీ హెల్త్‌కేర్ ఫౌండర్ వందనా లుత్రా (26), బయోకాన్ సీఎండీ కిరణ్ ముజుందార్ షా (28)లు ఉన్నారు.
రెపో రేటు 0.25 తగ్గించిన రిజర్వు బ్యాంకురిజర్వు బ్యాంకు ఏప్రిల్ 5న నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. దీంతోపాటు రిజర్వు బ్యాంకు రివర్స్ రెపో రేటును 0.25 శాతం పెంచడంతో అది 6 శాతానికి చేరింది. నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను మాత్రం ఆర్బీఐ (4 శాతం)యథాస్థితిలో కొనసాగించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీషార్‌ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చీఫ్ చార్లెస్ బోల్డెన్‌తో పాటు ఆరుగురు సీనియర్ శాస్త్రవేత్తల బృందం ఏప్రిల్ 6న శ్రీహరికోటలోని షార్‌ను సందర్శించింది. నాసా బృందానికి షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ షార్‌లో చేపట్టిన, చేపట్టబోతున్న ప్రయోగాలు, రాకెట్ లాంచ్ ఫెసిలిటీస్ గురించి వివరించారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలతో జరిగిన అవగాహన సదస్సులో నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్ ప్రసంగించారు.
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియాఅణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజన్సీ ఏప్రిల్ 9న ప్రకటించింది. ఈ రాకెట్ ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడిచేయగల సామర్థ్యం ఉత్తరకొరియాకి లభించినట్లు తెలిపింది. అయితే అమెరికా, దక్షిణ కొరియాలు ఈ వార్తలను కొట్టిపారేశాయి.
అణుసామర్థ్య క్షిపణి కే-4ను పరీక్షించిన భారత్
అణు జలాంతర్గామి అరిహంత్ నుంచి అణుసామర్థ్య క్షిపణి కే-4ను భారత్ విజయవంతంగా (రహస్యంగా) ప్రయోగించింది. బంగాళాఖాతంలోని గుర్తుతెలియని ప్రదేశం నుంచి భారత నావికాదళం దీన్ని పరీక్షించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన కే-4 క్షిపణి 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 12 మీటర్ల పొడవు, 1.3 మీటర్ల మందం ఉన్న ఈ క్షిపణిని సముద్రంలో 20 మీటర్ల లోతు నుంచి ప్రయోగించారు. 17 టన్నుల బరువున్న కే-4 క్షిపణి రెండువేల కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. కే-4తోపాటు అరిహంత్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దేశీయంగానే రూపొందించింది. ఉపరితల క్షిపణి జలాంతర్గాముల్లో అరిహంత్ కీలకమైనది. రష్యాకు చెందిన అకూలా-1 ఆధారంగా దీనిని తయారు చేశారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం స్మారకార్థం క్షిపణికి కె-4గా నామకరణం చేశారు.
వార్తల్లో వ్యక్తులుమిస్ ఇండియాగా ప్రియదర్శిని ఛటర్జీ
ఢిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ ఎఫ్‌బీబీ ఫెమినా ‘మిస్ ఇండియా వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకుంది. ఏప్రిల్ 9న ఢిల్లీలో జరిగిన వేడుకల్లో సినీ, ప్యాషన్ రంగ ప్రముఖుల మధ్య షారుఖ్ ఖాన్ అవార్డులను ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సుశ్రుతీ కృష్ణా ఫస్ట్ రన్నరప్‌గా, లక్నోకి చెందిన పంఖురి గిద్వానీ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. మిస్ ఇండియాగా ఎంపికైన ప్రియదర్శిని ‘మిస్ వరల్డ్ 2016’ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించనుంది.
జేడీయూ చీఫ్‌గా నితీశ్బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏప్రిల్ 10న జనతాదళ్ (యునెటైడ్) పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ పదవీకాలం ముగియడంతో నూతన అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్‌ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శరద్ యాదవ్ 2006 నుంచి మూడుసార్లు జేడీ (యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. నాలుగోసారి ఆ పదవిలో కొనసాగేందుకు ఆయన విముఖత చూపారు.
అవార్డులుజంగిల్ బుక్ దర్శకుడికి పెటా అవార్డు
జంగిల్ బుక్ సినిమా దర్శకుడు జాన్ ఫావ్‌రీయ్ ‘పెటా యూఎస్’ అవార్డుకు ఎంపికయ్యారు. జంగిల్ బుక్ సినిమాలో నిజమైన జంతువులకు బదులు కంప్యూటర్‌లో సృష్టించిన జంతు బొమ్మలను వినియోగించినందుకు ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
మదర్ థెరిసాకు ఫౌండర్స్ అవార్డుసేవాశీలి మదర్ థెరిసాకు ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డు లభించింది. అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచే విజయాలను సాధించిన ఆసియా వారికి ఈ అవార్డులను ఏటా అందజేస్తారు. మొత్తం 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చే స్తారు. మదర్ థెరిసా భారత్‌లో చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేద ప్రజలకు, రోగులకు, అనాథలకు సేవ చేశారు. 1997లో కలకత్తాలో మరణించారు. థెరిసాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకున్నారు. 2010 నుంచి పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ అవార్డులను అందజేస్తున్నారు.
క్రీడలునేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్స్నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సమీర్ వర్మ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 10న చంఢీగఢ్‌లో జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మను ఓడించి సమీర్ వర్మ టైటిల్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ప్రకాశ్ చోప్రా, అక్షయ్ దివాల్కర్‌ల జోడీ గెలుచుకుంది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను పి.సి తులసి, మహిళల డబుల్స్ టైటిల్‌ను సిక్కి రెడ్డి, ప్రద్న్య గాద్రెలు గెలుచుకున్నారు.
క్రికెట్ నుంచి జేమ్స్ టేలర్ రిటైర్మెంట్
ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ 26 ఏళ్ల చిన్న వయస్సులోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు. తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టేలర్ తెలిపాడు. అనారోగ్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఏప్రిల్ 12న నిర్వహించిన స్కానింగ్‌లో అతడి గుండె చాలా తీవ్ర పరి స్థితిలో ఉన్నట్టు తేలింది. ఇంగ్లండ్ తరఫున ఏడు టెస్టులు ఆడిన టేలర్ 312 పరుగులు చేయగా, 27 వన్డేల్లో 887 పరుగులు సాధిం చాడు. ఇందులో ఓ శతకం ఉంది.
ఐపీఎల్ మ్యాచ్‌లను మహారాష్ట్ర నుంచి తరలించాలని హైకోర్టు ఆదేశంఐపీఎల్-9 షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ర్టలో జరిగే అన్ని మ్యాచ్‌లను తరలించాలని బాంబే హైకోర్టు ఏప్రిల్ 13న బీసీసీఐని ఆదేశించింది. మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి ఎద్దడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు తరలించాలని సూచించింది. దీంతో మే 29న జరగాల్సిన ఫైనల్‌తో సహా 13 మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడింది. తరలింపునకు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్ని హామీలు ఇచ్చినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మ్యాచ్‌ల సందర్భంగా పిచ్‌ల నిర్వహణ కోసం 60 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని లోక్‌సత్తా ఎన్‌జీఓ మూవ్‌మెంట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కనడే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ రెండుసార్లు వాయిదా వేసింది. ఈలోగా ముంబైలో తొలి మ్యాచ్ కూడా జరిగిపోయింది. కానీ ఏప్రిల్ 13న జరిగిన సుదీర్ఘ విచారణలో కోర్టు మ్యాచ్‌లను తరలించడానికే మొగ్గు చూపింది. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

0 Comments