Ticker posts

9/recent/ticker-posts

Weekly current affairs

అంతర్జాతీయంసింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ విజయంసింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) 
విజయం సాధించింది. సెప్టెంబరు 11న జరిగిన ఎన్నికల్లో పీఏపీ 
89 స్థానాలకు 83 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష 
వర్కర్స్ పార్టీ ఆరు స్థానాలకు పరిమితమైంది. 1965లో 
స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి పీఏపీ అధికారంలో కొనసాగుతోంది.

ఈజిప్టు కొత్త ప్రధానిగా షరీఫ్ ఇస్మాయిల్అవినీతి ఆరోపణలు రావటంతో ఈజిప్టు ప్రధానమంత్రి ఇబ్రహీం మహ్లాబ్, 
కేబినెట్ మంత్రులు సెప్టెంబరు 12న రాజీనామా చేశారు. దీంతో 
చమురు శాఖ మంత్రిగా ఉన్న షరీఫ్ ఇస్మాయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు 
చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీ కోరారు.

లౌకికవాదం తిరస్కరణకొత్త రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని తొలగించి, హిందూ దేశంగా 
తిరిగి చేర్చాలనే ప్రతిపాదనను నేపాల్ రాజ్యాంగ సభ తిరస్కరించింది. 
దీనికి సంబంధించిన ఓటింగ్ సెప్టెంబరు 14న జరిగింది.

మక్కా మసీదులో ఘోర ప్రమాదంముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కా మసీదులో సెప్టెంబర్ 11న 
జరిగిన ఘోర ప్రమాదంలో 107 మంది ప్రాణాలు కోల్పోయారు. 
మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం 
కుప్పకూలి మసీదు ప్రాంగణంలో పడటంతో ప్రమాదం సంభవించింది. 
కాబా మసీదు ప్రాంగణాన్ని విస్తరించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం 
పనులు చేపట్టింది. ఒక క్రేన్ పైభాగం ఆకస్మాత్తుగా కూలిపోయి మసీదు 
ప్రాంగణంపై పడటంతో ప్రమాదం జరిగింది.

రోజూ 16 వేల శిశు మరణాలుప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు నేటికీ ఆందోళనకర స్థాయిలో 
ఉన్నట్లు యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్
(యూనిసెఫ్) తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాల్లో రోజూ 16 వేల 
మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వెల్లడించింది. 
పౌష్టికాహార లోపం, నివారించదగ్గ రోగాలతో ఈ ఏడాది 59 లక్షల మంది చిన్నారులు 
ఐదో పుట్టినరోజు జరుపుకునేలోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 
1990లో ఏటా 1.27 కోట్లుగా నమోదైన శిశు మరణాల రేటు 2015 నాటికి 
50 శాతానికిపైగా తగ్గి 60 లక్షలలోపు తగ్గినప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో 
ఈ మరణాల రేటూ ఎక్కువేనని నివేదిక తెలిపింది. సహారా ఎడారికి దక్షిణాన 
ఉన్న ఆఫ్రికా దేశాల్లో (సబ్ సహారన్ ఆఫ్రికా) ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 
అత్యధికంగా సంభవిస్తున్నట్లు వివరించింది.

అఫ్గాన్ జైలుపై తాలిబన్ల దాడి: 355 మంది ఖైదీల పరారీఅఫ్గానిస్తాన్‌లో ఘజ్ని నగరంలోని జైలుపై తాలిబన్ మిలిటెంట్లు భీకరదాడికి 
పాల్పడ్డారు. సెప్టెంబర్ 14న జైలు గేటు వద్ద కారు బాంబును పేల్చి జైలులోకి 
చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జైలులో మొత్తం 436 మంది
 ఖైదీలుండగా, వీరిలో 355 మంది తప్పించుకుని పారిపోయారు. 2011లో
 కాందహార్ జైలును బద్దలుకొట్టి 500 మంది తాలిబన్లు తప్పించుకుపోయిన 
తర్వాత అంత భారీ స్థాయిలో జైలుపై దాడి జరగడం ఇదే ప్రథమం.

ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్‌బుల్Current Affirs మల్టీ మిలియనీర్, మాజీ బ్యాంకర్ 
మాల్కమ్ టర్న్‌బుల్ ఆస్ట్రేలియా 29వ ప్రధానమంత్రిగా సెప్టెంబర్ 15న 
ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జనరల్ పీటర్ కోస్‌గ్రోవ్ నేతృత్వంలో 
టర్న్‌బుల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 14న జరిగిన 
పార్టీ అంతర్గత ఓటింగ్‌లో ప్రస్తుత ప్రధాని టోనీ అబాట్‌ను తొలగించారు. 
లిబరల్ పార్టీ నిర్వహించిన ఓటింగ్‌లో అబాట్‌కు 44 ఓట్లే దక్కాయి. 
అబాట్ వ్యతిరేక వర్గం నేత మాల్కం టర్న్‌బుల్‌కు 54 ఓట్లు దక్కాయి. 
దీంతో అబాట్ ప్రధాని పదవి కోల్పోయారు. 2010లో కెవిన్ రడ్‌ను
 పదవీచ్యుతుడిని చేసి గిలార్డ్ ప్రధాని అయిన ఉదంతం మాదిరిగానే 
తాజా ఘటన జరిగింది.

శ్రీలంక యుద్ధ నేరాలపై అంతర్జాతీయ కోర్టుశ్రీలంకలో ఎల్టీటీఈతో దశాబ్దాల పోరులో, 2009 నాటి ముగింపు యుద్ధంలో
 సైనికుల నేరాలపై అంతర్జాతీయ జడ్జీలతో కూడిన ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు 
ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల సంఘం మొగ్గు చూపింది. 
ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ జీద్ హుసేన్ తయారు చేసిన 
నివేదికలో ఈమేరకు పేర్కొన్నారు. యుద్ధకాలంలో సైన్యం వైపు నుంచి హత్యలు, 
అత్యాచారాలు వంటి ఘోరాలు జరిగాయన్నారు.
 నివేదికను సెప్టెంబర్ 16న విడుదల చేశారు.

జాతీయంసరిహద్దుల్లో కాల్పుల నిషేధానికి అంగీకారంCurrent Affirsసరిహద్దుల్లో కాల్పులు, 
మోర్టార్ షెల్స్ ప్రయోగంపై పూర్తి నిషేధాన్ని పాటించేందుకు భారత్, పాక్ 
అంగీకరించాయి. ఈ మేరకు సెప్టెంబరు 12న ఢిల్లీలో జరిగిన సరిహద్దు దళాల 
డెరైక్టర్ జనరల్స్ స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది.

10వ విశ్వ హిందీ సమ్మేళన్10వ విశ్వ హిందీ సమ్మేళన్‌ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 
సెప్టెంబర్ 10న నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమ్మేళన్‌ను 
ప్రారంభించి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఇంగ్లిష్, చైనీస్‌తోపాటు హిందీ 
డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతాయని మోదీ అన్నారు. హిందీని నిర్లక్ష్యం చేస్తే
 పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హిందీ మార్కెట్
 చాలా పెద్దది కాబట్టి దీనిని సొమ్ము చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు 
హిందీలో ఆప్స్ రూపొందించాలని సూచించారు. ఈ సదస్సుకు గుర్తుగా 
రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌స్టాంపును ప్రధాని మోదీ సమక్షంలో
కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీశాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆవిష్కరించారు.

ముంబై పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారణముంబైలోని రైళ్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 188 మందిని బలితీసుకున్న
 కేసులో 12 మందిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ (మోకా) 
కోర్టు సెప్టెంబర్ 11న దోషులుగా నిర్ధారించింది. 2006 జూలై 11న సిమీ, 
లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాదులు ముంబైలోని సబర్బన్ రైళ్లలో 
వరుసగా ఏడు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 188 మరణించగా... 
829 మంది గాయపడ్డారు. ఈ కేసులో తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగగా 
సెప్టెంబర్ 11న మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డి షిండే 12 మందిని
 దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు: 89 మంది మృతిబావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు 
పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో
 89 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో 100 మందికి పైగా
 గాయపడ్డారు. ఓ భవనంలో భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు, 
జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో భవనం కుప్పకూలిపోయింది.

ఇందిర, రాజీవ్ స్టాంపులు ముద్రణ నిలిపివేతమాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల ముఖచిత్రాలతో 
కూడిన స్టాంపుల ముద్రణను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం 
నిర్ణయించింది. ‘ఆధునిక భారత నిర్మాతలు’ పేరుతో ఇప్పటివరకు 
వీరిద్దరి స్టాంపులు రోజువారీ వినియోగానికి అందుబాటులో ఉండేవి. 
అయితే విధానపరమైన మార్పును తెస్తూ... ‘భారత నిర్మాతలు’
 థీమ్‌తో పలువురు ప్రముఖుల పేరిట నిత్యవినియోగానికి స్టాంపులను 
ముద్రించనున్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, 
నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ, 
మౌలానా ఆజాద్, భగత్‌సింగ్, జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ 
లోహియా, వివేకానంద, మహరాణా ప్రతాప్... తదితరుల ముఖచిత్రాలతో 
స్టాంపులు అందుబాటులోకి రానున్నాయి. ఇందిర, రాజీవ్‌లతో పాటు
హోమీ జే భాభా, జేఆర్‌డీ టాటా, సీవీ రామన్, సత్యజిత్ రేల స్టాంపుల 
ముద్రణను కూడా నిలిపివేశారు. అయితే మహాత్మాగాంధీ, జవహర్ లాల్‌నెహ్రూ, 
బి.ఆర్.అంబేడ్కర్, మదర్ థెరిసాల ముఖచిత్రాలతో కూడిన స్టాంపులను 
ఇదివరకటిలాగే కొనసాగిస్తారు.

రాష్ట్రీయంతెలంగాణ సీఎం కేసీఆర్ చైనా పర్యటనవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడంతోపాటు పెట్టుబడుల 
సమీకరణ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 
10 రోజుల పాటు చైనాలో పర్యటించారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్ 
నుంచి బయలుదేరిన సీఎం చైనాలోని డేలియన్ నగరం చేరుకున్నారు. 
సెప్టెంబర్ 9న డేలియన్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం 
సదస్సులో కేసీఆర్ పాల్గొన్నారు. 10న డేలియన్ నుంచి షాంఘై 
చేరుకుని సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పారిశ్రామికవేత్తలతో 
సమావేశమయ్యారు.

చైనాలో భూలోక స్వర్గంగా ఖ్యాతి గాంచిన సుజు నగరంలోని ప్రఖ్యాత 
సుజు పారిశ్రామికవాడను కేసీఆర్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా 
‘చైనా-సింగపూర్ సుజు పారిశ్రామికవాడ’ పాలకవర్గ కమిటీ సభ్యుడు 
యుకెజైన్‌తో సీఎం బృందం సమావేశమైంది.

బీజింగ్ నగరంలోని పురాతన రాచరిక నగరం ‘ఫర్‌బిడెన్ సిటీ’ని 
సెప్టెంబర్ 12న కేసీఆర్ సందర్శించారు.

తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబుఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి 
చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 10న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 
జిల్లాలోని గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టారు. 
ఈ ప్రాజెక్టుకు 2003లో చంద్రబాబే శంకుస్థాపన చేశారు.
 ప్రాజెక్టు నుంచి 50 వేల ఎకరాలకు నీరు విడుదల చేశారు.
 మొత్తం 1.32లక్షల ఎకరాలకు నీరందించే ఉద్దేశంతో తోటపల్లిని నిర్మించారు.

రూ.150 కోట్లతో ఇస్కాన్ స్వర్ణ దేవాలయంCurrent Affirsప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ 
ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ దేవాలయాన్ని నిర్మించనుంది. గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో
 దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. అక్టోబర్ 22న (దసరా రోజు) 
ఆలయ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 150 ఎకరాల్లో
 నిర్మించనున్న ఈ ఆలయానికి ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేశారు.
 చారిత్రక వెన్నముద్దల వేణుగోపాల

మార్కెట్‌కు చాకలి ఐలమ్మ పేరువరంగల్ జిల్లాలోని పాలకుర్తి మార్కెట్‌కు 
తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టారు

ద్వైపాక్షికంశ్రీలంకతో భారత్ నాలుగు ఒప్పందాలుCurrent Affirs రణిల్ విక్రమసింఘే
 శ్రీలంకలో వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన 
తరువాత తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చారు. సెప్టెంబర్ 15న 
విక్రమసింఘే, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 
భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా 
ఇరుదేశాల ప్రధానుల మధ్య విస్తృత ప్రాతిపదికన చర్చలు జరిగాయి. 
శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని,
 వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని 
మోదీ శ్రీలంక ప్రధానిని కోరారు. తమిళులకు న్యాయం చేయటం పైనే 
ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ, రెండు దేశాల నడుమ సుదీర్ఘంగా
 నలుగుతున్న జాలర్ల సమస్య, వ్యాపార, రక్షణ వ్యవస్థల బలోపేతం, 
ఉగ్రవాదం, సముద్రజలాల సరిహద్దుల భద్రత వంటి అంశాలను కూడా 
వారు చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు
 ఒప్పందాలు కుదిరాయి. వైద్య-ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష విజ్ఞానంలో
 పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

కంబోడియాతో భారత్ ఒప్పందాలుఆసియాన్ కూటమి దేశమైన కంబోడియాతో భారత్ పలు ఒప్పందాలు 
కుదుర్చుకుంది. మూడు రోజుల కంబోడియా పర్యటనలో ఉన్న 
భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సమక్షంలో ఈ ఒప్పందాలు 
కుదిరాయి. అన్సారీ సెప్టెంబర్ 16న కంబోడియా ప్రధాని హున్ సెన్‌తో 
ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధి స్థాయి 
చర్చల్లో టూరిజం, త్వరిత ప్రభావిత ప్రాజెక్టుల(క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులు
(క్యూఐపీ))పై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ క్యూఐపీలో 
మెకాంగ్-గంగా సహకారం, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం 
ద్వారా మహిళా సాధికారత, వ్యవసాయ సహకారంతో పాటు పారిశ్రామిక 
అభివృద్ధి కేంద్రానికి రూ.33లక్షల గ్రాంటు ఉన్నాయి. కంబోడియా 
మంత్రిమండలి కార్యాలయంలో మంత్రులను ఉద్దేశించి అన్సారీ ప్రసంగించారు. 
ఉపరాష్ట్రపతి వెంట తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉన్నారు.

ఆర్థికంగోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేబినెట్ ఆమోదంగోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 9న 
ఆమోదం తెలిపింది. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గించేందుకు 
ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభిస్తోంది. అదే విధంగా ఇళ్లకు 
పరిమితమవుతున్న బంగారాన్ని మార్కెట్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు 
కూడా ఈ పథకాలు ఉపయోగపడతాయి. వీటివల్ల బంగారం దిగుమతులు 
తగ్గుముఖం పడతాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తులను 
అభివృద్ధి చేసేందుకు బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని ప్రారంభించాలని 
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా కేబినెట్ తాజాగా 
నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు 
ఈ బాండ్లను జారీచేస్తుంది.

వ్యాపారానికి అనువైన రాష్ట్రాల్లో గుజరాత్‌కు మొదటి స్థానంCurrent Affirsవ్యాపారానికి అనువైన
 రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో 
గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక విధానం, 
ప్రోత్సాహక విభాగం (డీఐఐపీ), సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ
 కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక సెప్టెంబరు 14న 
విడుదలైంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం, జార్ఖండ్‌కు 
మూడో స్థానం లభించింది. తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. 
అరుణాచల్‌ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. స్థల కేటాయింపులు, 
కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల
 ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు వంటి 
8 ప్రాతిపదికల ఆధారంగా నివేదికను రూపొందించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీఐఎన్‌ఎస్ వజ్రకోష్ ప్రారంభంనౌకా స్థావరం ఐఎన్‌ఎస్ వజ్రకోష్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ 
సెప్టెంబరు 9న కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరంలో ప్రారంభించారు. 
పశ్చిమ తీరం నుంచి యుద్ధ నౌకల నిర్వహణకు ఈ స్థావరం 
ఉపయోగపడుతుంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 
(డీఆర్‌డీవో) నిర్మించింది. దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ క్షిపణులతో పాటు 
ఇతర ఆయుధాలను స్థావరంలో నిల్వ చేస్తారు. ఇది కార్వార్‌లో 
ఏర్పాటైన మూడో నౌకా స్థావరం.

దక్షిణాఫ్రికా గుహల్లో కొత్త ‘మానవ జాతి’Current Affirs మానవ కుటుంబ
 వృక్షానికి చెందిన కొత్త జాతి ఆనవాళ్లను దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ 
సమీపంలో రైజింగ్ స్టార్ గుహల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
 ఈ విషయాన్ని సెప్టెంబరు 10న మగలీస్‌బర్గ్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు.
 శిలాజాలు వెలుగుచూసిన నలెడి గుహ పేరిట ఈ కొత్త జాతికి హోమో 
నలెడిగా పేరుపెట్టారు. నలెడి గుహలో 15 జీవులకు సంబంధించిన 
1500కు పైగా ఎముకలు లభించాయి. ఈ శిలాజాల వయసు 
25 లక్షల ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.

వార్తల్లో వ్యక్తులుశక్తిమంతమైన వ్యాపార మహిళల్లో ఇంద్రానూయిఫార్చ్యూన్ ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో
భారత్ నుంచి పెప్సికో సీఈవో ఇంద్రానూయి ఒక్కరికే చోటు లభించింది.
 50 మందితో సెప్టెంబరు 10న విడుదల చేసిన జాబితాలో 
జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బారా మొదటి స్థానంలో నిలవగా, 
ఇంద్రా నూయి రెండో స్థానంలో నిలిచారు. 66.6 బిలియన్ డాలర్ల
 విలువైన వ్యాపారాన్ని ఇంద్రానూయి నిర్వహిస్తున్నారు.

కె.జయరామన్‌కు డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదారక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన రక్షణ పరిశోధన, 
అభివృద్ధి లేబొరేటరీ (డీఆర్‌డీఎల్) డెరైక్టర్ కె.జయరామన్‌కు 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా లభించింది. 
శాస్త్రవేత్తలకు కల్పించే ఈ అత్యున్నత గౌరవాన్ని కేంద్రం
 సెప్టెంబర్ 11న ప్రకటించింది. 

శక్తివంతమైన మహిళలుగా చందా, అరుంధతీCurrent Affirs ఆసియా, పసిఫిక్ దేశాల 
శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, 
మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచ్చర్‌కు అగ్రస్థానం లభించింది. 
ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు.
 అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ 25 మందితో జాబితా రూపొందించింది.

నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడుగా రమేశ్ చంద్నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా వ్యవసాయ రంగ నిపుణులు
 ప్రొఫెసర్ రమేశ్‌చంద్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ 
సెప్టెంబరు 9న ఆమోదం తెలిపారు.

కాలిఫోర్నియాలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతి మహిళఅమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో పోస్ట్‌మాస్టర్‌గా 
భారత సంతతికి చెందిన జగ్‌దీప్ గ్రేవాల్ నియమితులయ్యారు. 
గత 166 ఏళ్లలో ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా నియమితులైన
 తొలి మహిళగా జగ్‌దీప్ గ్రేవాల్ నిలిచారు. భారత్‌లోని
 పంజాబ్ యూనివర్సిటీలో గ్రేవాల్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 
1988లో విండో క్లర్క్‌గా తపాలా శాఖలో కెరీర్ ప్రారంభించారు.

సెప్టెంబర్ 10 అనుపమ్ ఖేర్ డే బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్‌కు అరుదైన గౌరవం లభించింది.
 సినిమా, నాటక రంగంలో ప్రపంచవ్యాప్త కృషికి గాను సెప్టెంబర్ 10ని
 అనుపమ్ ఖేర్ డేగా అమెరికాలోని లాస్‌వెగాస్ నగరం ప్రకటించింది. 
నాణ్యమైన వినోదం అందించిన అనుపమ్‌కు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 
అవార్డును అందజేశారు.

జర్మనీలో మేయర్‌గా భారత సంతతి వ్యక్తిజర్మనీలోని బాన్ నగర మేయర్‌గా అశోక్ శ్రీధరన్ (49) ఎన్నికయ్యారు.
 తద్వారా ఈ పదవిని అలంకరించనున్న తొలి భారత సంతతి 
వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్
 సారథ్యంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయూ) 
పార్టీ అభ్యర్థిగా ఈయన పోటీచేశారు.

అవార్డులునాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డునవరత్న ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ
 (నాల్కో) ఐఐఐఈ ప్రతిష్టాత్మక ‘పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2014’కు 
ఎంపికయ్యింది. చక్కటి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు గుర్తింపుగా 
ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ అవార్డును
 నెలకొల్పింది. దుబాయ్‌లో అక్టోబర్ 8, 2015వ తేదీన జరిగే 19వ 
సీఈఓల సదస్సులో ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది.

రోశయ్యకు ఎన్జీరంగా అవార్డు ప్రదానంఆచార్య ఎన్జీ రంగా స్మారక అవార్డును తమిళనాడు గవర్నర్ 
కొణిజేటి రోశయ్య అందుకున్నారు. సెప్టెంబర్ 13న గుంటూరు జిల్లా
 తెనాలిలో రోశయ్యకు అవార్డును ప్రదానం చేశారు. 
నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకసభలో 
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చక్రపాణి చేతులమీదుగా 
ఈ అవార్డును రోశయ్య స్వీకరించారు.

సతీశ్ రెడ్డికి మోక్షగుండం స్మారక అవార్డుCurrent Affirsరక్షణ మంత్రి 
శాస్త్రీయ సలహాదారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీశ్ రెడ్డిని
 మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డుతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్
 సత్కరించింది. ఈసీఐఎల్ చైర్మన్, ఎండీ పి.సుధాకర్ చేతుల మీదుగా
 ఈ అవార్డు అందజేశారు. సతీశ్‌రెడ్డితో పాటు ఎస్వీ యూనివర్శిటీ ప్రొఫెసర్
 ఎస్.నారాయణరెడ్డి, ట్రాన్స్‌కో హెచ్‌ఆర్‌డీ కన్సల్టెంట్ ఎం.సాంబయ్య, 
డీఎంఆర్‌ఎల్ శాస్త్రవేత్త అమిత్ భట్టాచారి.. ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్
 అవార్డులు అందుకున్నారు. 

‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’గా బంగ్లా ప్రధానిఐక్యరాజ్యసమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్
(యుఎన్‌ఈపీ) అందించే అత్యున్నత పర్యావరణ అవార్డు 
‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’కు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 
ఎంపికయ్యారు. 2015 సంవత్సరానికి గాను పాలసీ లీడర్‌షిప్
 విభాగంలో ఆమెకు ఈ అవార్డు లభించింది.

అఖీల అసిఫికి నాన్‌సేన్ రెఫ్యూజీ అవార్డుపాకిస్తాన్‌లోని అప్గానిస్తాన్ శరణార్థి బాలికల విద్యాభివృద్ధికి
 తన జీవితాన్ని అంకితం చేసిన అఖీల అసిఫి అనే ఉపాధ్యాయురాలికి 
ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ అందించే నాన్‌సేన్ రెఫ్యూజీ అవార్డు 
వరించింది. అఫ్గాన్ నుంచి 1992లో కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు 
వలస వచ్చిన అసిఫి, అఫ్గాన్ శరణార్థి బాలికల విద్యకు నిర్విరామ 
కృషి చేశారని యునెటైడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
(యుఎన్‌హెచ్‌సీఆర్) ప్రశంసించింది.

క్రీడలుయూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వ స్థానంఅపియా (సమోవా)లో సెప్టెంబరు 11న ముగిసిన 
యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 
24 స్వర్ణాలు, 19 రజతాలు, 19 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా 
మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(13 స్వర్ణ పతకాలు), 
ఇంగ్లండ్(12), మలేసియా(11)తో వరుసగా రెండు, మూడు, 
నాలుగు స్థానాల్లో నిలిచాయి. 9 స్వర్ణాలు, 4 రజతాలు,
 6 కాంస్య పతకాలతో భారత్ 5వ స్థానంలో నిలిచింది.

జకోవిచ్, పెనెట్టాలకు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్Current Affirs 
పురుషుల సింగిల్స్:నొవాక్ జకోవిచ్ (సెర్బియా) యూఎస్ 
ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 14న 
జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు.

మహిళల సింగిల్స్: ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా మహిళల సింగిల్స్
 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాబెర్టా విన్సీ (ఇటలీ)ని ఓడించింది. 
అత్యంత పెద్ద వయసులో (33) తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న 
మహిళగా పెనెట్టా గుర్తింపు సాధించింది.

పురుషుల డబుల్స్: హెర్బెర్ట్-నికోలస్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది. 
వీరు ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్)- జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై 
విజయం సాధించారు.

మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), 
మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. 
వీరు ఫైనల్లో కేసే డెలాక్వా (ఆస్ట్రేలియా), 
యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్) జంటను ఓడించారు.

మిక్స్‌డ్ డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్..
 స్విస్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ సాధించాడు. 
వీరు ఫైనల్లో అమెరికాకు చెందిన బెథానీ మాటెక్, సామ్ క్వెరీ
 జోడీని ఓడించారు. ఈ విజయంతో పేస్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేరాయి.

రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్‌కు కాంస్యంరెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్
 యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కిలోల విభాగంలో కాంస్య పతకం
 సాధించాడు. లాస్‌వెగాస్‌లో సెప్టెంబరు 13న కాంస్యం కోసం జరిగిన
 పోటీలో జెలిమ్‌ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై యాదవ్ విజయం సాధించాడు. 
ఈ గెలుపుతో నర్సింగ్ యాదవ్ 2016-రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

యూకీ బాంబ్రీకి షాంఘై చాలెంజర్ టైటిల్భారత్ టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ షాంఘై చాలెంజర్ టైటిల్ 
గెలుచుకున్నాడు. టోక్యోలో సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సెల్సన్ 
(డెన్మార్క్)ను లిన్ డాన్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను 
నొజోమి గె ఒకుహారా (జపాన్) గెలుచుకుంది. 
ఆమె ఫైనల్లో అకానె యమగుచి (జపాన్)ను ఓడించింది.

విజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికిన మేవెదర్Current Affirs 
స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ విజయంతో రింగ్‌కు వీడ్కోలు పలికాడు. 
కెరీర్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఈ 38 ఏళ్ల బాక్సర్ చివరిదైన 
49వ మ్యాచ్‌లో అండ్రీ బెర్టోపై నెగ్గి తన రికార్డును 49-0కు 
మెరుగుపర్చుకున్నాడు. దాంతో దిగ్గజ ఆటగాడు 
రాకీ మార్సియానో రికార్డును (49-0) సమం చేశాడు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates