Ticker posts

9/recent/ticker-posts

Weakly current affairs ( 27th October )

అంతర్జాతీయంపేదరికంపై ఎఫ్‌ఏవో నివేదిక Current Affairsప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని పారదోలేందుకు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, వెనుకబడిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) తన నివేదికలో పేర్కొంది. ఐరాస నిర్ణయించిన జీవన ప్రమాణాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.97 ఖర్చు చేయలేని పరిస్థితిలో జీవిస్తున్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని రూపుమాపడానికి అమలు చేస్తున్న పలు పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆ నివేదికలో ఎఫ్‌ఏవో కితాబిచ్చింది.

ఉద్యోగులు అమితంగా ఇష్టపడే ‘గూగుల్’ ఉద్యోగులు పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ ప్రథమస్థానంలో ఉందని ప్రముఖ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్’ పేర్కొంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ బెస్ట్ మల్టీనేషనల్ వర్క్ ప్లేసెస్’ పేరిట నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎస్‌ఏఎస్ ఇన్‌స్టిట్యూట్, వీఎల్‌గోరే వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్‌వో 
ప్రపంచవ్యాప్తంగా ఏటా పన్నెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 19న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ-2015’ పేరుతో విడుదలచేసిన నివేదికలో పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ద్విచక్రవాహన ప్రమాదాల్లో పశ్చిమ పసిఫిక్, ఆగ్నేసియా దేశాల్లోనే మూడొంతుల మంది చనిపోతున్నారని, రోడ్డు భద్రత కార్యక్రమాలపై సమీక్ష జరిపి మరింత పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తామని డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు.

నాలుగు నెలలు నిలిచిపోనున్న ‘బిగ్‌బెన్’ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్లాక్ టవర్స్‌లో ఒకటైన బిగ్ బెన్‌కు తక్షణం మరమ్మతులు నిర్వహించాల్సి రావడంతో సుమారు నాలుగు నెలల పాటు దీనిని నిలిపి వేయనున్నారు. లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్ భవనం వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విశిష్ట నిర్మాణం 1859లో పూర్తయింది. 156 ఏళ్ల చరిత్రలో ఈ గడియారం ఇంతకాలం పాటు నిలిచిపోనునుండడం ఇదే తొలిసారి. 1976లో మరమ్మతుల కారణంగా 26 రోజుల పాటు ఈ గడియారాన్ని నిలిపివేశారు.

ప్రపంచ పింఛన్ సూచీలో చివరన భారత్
ప్రపంచ పింఛన్ సూచీ పరంగా ‘భారత పదవీ విరమణ వ్యవస్థ’ చివరి స్థానంలో నిలిచిందని ప్రముఖ అధ్యయన సంస్థ మెర్సెర్ పేర్కొంది. భారత్ సూచీ విలువ(స్కోర్) 2014లో 43.5 ఉండగా, 2015లో అది 40.3కి పడిపోయింది. ప్రధానంగా సేవింగ్స్ రేటు తగ్గడమే దీనికి కారణమని మెల్‌బోర్న్ మెర్సెర్ గ్లోబల్ పింఛన్ ఇండెక్స్(ఎంఎంజీపీఐ) తెలియజేసింది. ఈ సూచీలో డెన్మార్క్(స్కోర్ 81.7) అత్యుత్తమ పదవీ విరమణ వ్యవస్థతో మొదటి స్థానంలో నిలిచింది.

రోడ్డు ప్రమాదాల్లో ఏటా 12 లక్షల మంది మృతిప్రపంచవ్యాప్తంగా ఏటా పన్నెండున్నర లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 19న వెల్లడించింది. ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ-2015’ (Global status report on road safety 2015) పేరుతో విడుదల చేసిన నివేదికలో.. పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపింది. అయితే యూరోపియన్ దేశాలతోపాటు 79 వివిధ దేశాల్లో ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గగా.. 68 పేద దేశాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 80 శాతం దేశాల్లో అమ్ముడవుతున్న వాహనాల్లో.. కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలిపింది.

కెనడా నూతన ప్రధానిగా ట్రూడోకెనడా పార్లమెంటుకు అక్టోబర్ 18న జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో లిబరల్ పార్టీ నేత, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తం 338 సీట్లకు జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ 184 సీట్లు దక్కించుకుంది. దేశాన్ని పదేళ్లపాటు పరిపాలించిన ప్రస్తుత ప్రధాని స్టీఫెన్ హార్పర్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది.ఇదే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 19 మంది కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 8 మంది కెనడా భారతీయులు గెలుపొందగా ఈసారి వారి సంఖ్య రెట్టింపైంది.

శ్రీలంక ఆర్మీది యుద్ధనేరమే: విచారణ కమిటీఎల్టీటీఈతో యుద్ధం జరిగిన సమయంలో శ్రీలంక సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కమిటీ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం చెప్పినట్లు ఈ నేరాలపై విదేశీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం చరమాంకంలో కొందరు సైనికులు దారుణంగా వ్యవహరించారని.. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స ఏర్పాటుచేసిన ఈ కమిటీ తన 178 పేజీల నివేదికలో పేర్కొంది. ఈ కేసుల విచారణకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

జాతీయంఎన్‌జేఏసీపై సుప్రీంకోర్టు తీర్పు ఎన్‌జేఏసీ ఏర్పాటు, కొలీజియం వ్యవస్థను రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అక్టోబరు 16న తీర్పు వెలువరించింది. ఎన్‌జేఏసీ, 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే కొలీజియం వ్యవస్థలోనూ లోపాలున్నాయని తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ పారదర్శకమేనని, దాన్ని ఇంకా సమర్థంగా అమలు చేసేందుకు సూచనలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

రామేశ్వరంలో కలాం స్మారకం
Current Affirs భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం ఆయన జన్మించిన రామేశ్వరంలో స్మారకం నిర్మిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కలాం 84వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15న ఢిల్లీలో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యిందని, దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు ఒక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ‘ఏ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ కలాం లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, కలాం స్మారకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

కలాం పేరిట పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌లుమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్(డాక్టరేట్ చేసిన తర్వాత ఇచ్చే అవార్డు)లు అందజేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పర్యావరణం, జీవావరణ రంగాల్లో యువ శాస్త్రవేత్తలను పరిశోధనల దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఫెలోషిప్‌లు అందజేయనున్నారు. కలాం 85వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్విరాన్‌మెంట్, ఎకాలజీ రంగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 35 ఏళ్ల లోపున్న యువ శాస్త్రవేత్తలకు ఈ ఫెలోషిప్‌లు అందజేస్తారు. ఫెలోషిప్ కాలపరిమితి మూడేళ్లు. రీసెర్చ్ అసోసియేట్‌కు సమానంగా మంత్లీ ఫెలోషిప్‌తో పాటు కంటింజెన్సీ గ్రాంటుగా రూ.1.5 లక్షలు అందిస్తారు.

ఇజ్రాయెల్ వర్సిటీలతో ఐఐటీ ఖరగ్‌పూర్ ఒప్పందం గగనతలంపై పరిశోధన, సహకారం, అధ్యాపకుల సందర్శన పర్యటనలు, వ్యవసాయం, కంప్యూటర్ సైన్స్, విద్యార్థుల మార్పిళ్లకు సంబంధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ అక్టోబర్ 16న ఇజ్రాయెల్‌కు చెందిన మూడు విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుంది. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వెంట ఇజ్రాయెల్‌కు వెళ్లిన విద్యాబృందం సభ్యుడైన ఐఐటీ ఖరగ్‌పూర్ డెరైక్టర్ పీపీ చక్రవర్తి ఈ మేరకు బెన్ గురియన్ విశ్వవిద్యాలయం (బీజీయూ), హిబ్రూ, హయిఫా విశ్వవిద్యాలయాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.

‘బలిదాన్ దివస్’గా గాడ్సేను ఉరితీసిన రోజుమహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను ఉరితీసిన నవంబర్ 15వ తేదీని ‘బలిదాన్ దివస్’గా నిర్వహించాలని అతివాద హిందూ సంస్థ ‘హిందూ మహాసభ’ నిర్ణయించింది. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లో జిల్లాస్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకూ హిందూ మహాసభ సన్నాహాలు చేస్తోంది. గాంధీ హత్యకేసులో మరో నిందితుడైన నాథూరాం సోదరుడు గోపాల్ రచనలను ప్రజలకు పంచిపెట్టాలని యోచిస్తోంది.

మూకీ చిత్రంగా బజరంగీ భాయ్‌జాన్బాలీవుడ్‌లో విజయం సాధించిన సల్మాన్ ఖాన్ చిత్రం బజరంగీ భాయ్‌జాన్‌ను మూకీ చిత్రంగా డబ్బింగ్ చేయనున్నారు. పాకిస్తాన్‌లో తప్పిపోయిన భారత్‌కు చెందిన మూగ-చెవిటి యువతి గీత కోరిక మేరకు ఈ చిత్రాన్ని సైగలతో రూపొందిచనున్నారు. భారత్‌లో తప్పిపోయిన ఓ పాకిస్తానీ చిన్నారిని ఆమె తల్లి దగ్గరకు చేర్చే వృత్తాంతంతో తీసిన బజరంగీ భాయ్‌జాన్ తన జీవితానికి దగ్గరగా ఉందని.. ఈ చిత్రాన్ని మూగ భాషలో డబ్బింగ్ చేస్తే.. తనలాంటి చాలా మంది చూసి ఆనందిస్తారని గీత కోరినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రీయం
తెలుగు రాష్ట్రాల్లో ‘స్యానీ’ పెట్టుబడులు 
చైనాకు చెందిన అగ్రశ్రేణి నిర్మాణరంగ సంస్థ స్యానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ రెండు పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అక్టోబరు 16న ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటుకు, ఫ్రీక్యాబ్ కాంక్రీట్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఈ ఒప్పందాలు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు స్యానీ గ్రూపు ముందుకొచ్చింది. ఈ మేరకు గ్రూపు చైర్మన్ లియాంగ్ వెంగెన్ తమ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు.

పీఏసీ చైర్మన్‌గా రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ శాసనసభ పీఏసీ చైర్మన్‌గా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిని నియమిస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదరాం అక్టోబర్ 16న తెలిపారు. కాంగ్రెస్ సిఫార్సు మేరకు పీఏసీ సభ్యుడైన వెంకటరెడ్డిని ఈ పదవిలో స్పీకర్ మధుసూదనాచారి నియమించారు.

హైదరాబాద్‌లోని ఆర్‌సీఐకి కలాం పేరు
Current Affirs 
హైదరాబాద్‌లో రక్షణ రంగానికి చెందిన మిస్సైల్ కాంప్లెక్స్ ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ (ఆర్‌సీఐ) పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌గా మార్చారు. అక్టోబర్ 15న కలాం 84వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆర్‌సీఐని సందర్శించి అధికారికంగా ప్రకటించారు.

ఉగాది పురస్కారాన్ని వెనక్కిచ్చిన భూపాల్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఉగాది పురస్కారాన్ని రచయిత, నటుడు ఎం. భూపాల్ రెడ్డి వెనక్కిచ్చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయి.. అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నవంబర్ 21న వరంగల్ ఉప ఎన్నికతెలంగాణలోని వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 21న షెడ్యూలు జారీచేసింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి 2015 జనవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి జూన్‌లో రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 28న ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయనుంది. నవంబర్ 21న పోలింగ్ నిర్వహిస్తారు. వరంగల్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని రట్లాం లోక్‌సభకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూలు జారీచేసింది. అలాగే వీటితోపాటు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఆరు శాసనసభ స్థానాలకు కూడా షెడ్యూలు విడుదల చేసింది. తెలంగాణలోని నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని ఈ షెడ్యూలులో చేర్చలేదు. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పి.కిష్టారెడ్డి ఆగస్టు 25న మరణించడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది.

సైన్స్ అండ్ టెక్నాలజీగురుగ్రహంపై తగ్గుతున్న ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ గురుగ్రహం పైనున్న అతిపెద్ద ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ క్రమక్రమంగా కుంచించుకుపోతోందని నాసా పేర్కొంది. రెడ్‌స్పాట్ క్రమంగా వృత్తాకారంగా మారుతోందని, గ్రహం కేంద్రం స్థానంలో అసాధారణమైన ఫిలమెంటరీ లక్షణం కనిపించిందని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త ఆమీ సైమన్ తెలిపారు.

వృక్ష, డైనోసార్ శిలాజాలు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీప్రాంతంలో లక్షల ఏళ్లనాటి వృక్ష, డైనోసార్ శిలాజాలు లభించాయి. రెండు మీటర్ల పొడవైన వృక్ష శిలాజాలతోపాటు, అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపించాయని మూడేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తున్న చరిత్ర అధ్యాపకుడు రెడ్డి రత్నాకరరెడ్డి వెల్లడించారు. ఓ సూక్ష్మరాతి పనిముట్టు, మూడు అంగుళాల జంతు శిలాజపు పనిముట్టు దొరికాయని తెలిపారు.

కాకతీయుల నాటి గణేశ్వరాలయంకాకతీయ రాజు గణపతిదేవుడి కాలం నాటి గణేశ్వరాలయాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగం మాటు వద్ద కనుగొన్నారు. ఆలయానికి సంబంధించిన మూల స్తంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలాశాసనాలపై చెక్కే సూర్య చంద్రుల గుర్తులు బయటపడ్డాయి. ఈ ఆలయం క్రీ.శ. 12, 13వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ తెలిపారు.

చంద్రునిపై భారీ మట్టి దిబ్బను గుర్తించిన శాస్త్రవేత్తలు
Current Affirs 
చంద్రుడి ఉపరితలంపై అగ్నిపర్వతాన్ని పోలిన భారీ మట్టిదిబ్బను శాస్త్రవేత్తలు గుర్తించారు. మూన్ మినరాలజీ మ్యాపర్ అనే ఉపగ్రహం అందించిన సమాచారాన్ని అధ్యయనం చేసిన బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇస్రో 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1తో పాటు ఈ ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి పంపారు. దీని ప్రకారం అగ్నిపర్వతాన్ని పోలిన ఈ ఆకారం.. దాదాపు 800 మీటర్ల ఎత్తు, 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో దక్షిణ ధ్రువంలోని ‘అట్కిన్ బేసిన్’ అనే భారీ కందకానికి సరిగ్గా మధ్యలో విస్తరించి ఉంది. మాక్ మౌండ్‌లుగా పిలిచే ఈ మట్టిదిబ్బలను తొలిసారిగా 1990లో కార్ల్ పీటర్స్ అనే ప్లానెటరీ జియాలజిస్టు గుర్తించారు. ఇవి పుష్కలమైన కాల్షియం పైరాగ్జిన్‌లతో నిండి ఉండి వాటిపై తక్కువ కాల్షియం ఉన్న రాతి పొరలు ఉంటాయి.

410 కోట్ల ఏళ్ల క్రితమే జీవం పుట్టుక!భూమిపై 410 కోట్ల సంవత్సరాల కిందటే జీవం ఆవిర్భవించి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజిలిస్(యూసీఎల్‌ఏ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఇంతకు ముందు భావించిన దానికంటే 30 కోట్ల సంవత్సరాలు ముందుగానే భూమిపై జీవం ఏర్పడి ఉంటుందని అంచనా. 454 కోట్ల ఏళ్ల కిందట భూమి ఆవిర్భావం చెందిన కొద్దికాలానికే జీవం పుట్టుక కూడా సాధ్యమై ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

మార్స్‌పై సేద్యానికి పరిశోధనలుఅరుణ (మార్స్) గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అక్కడి వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త మైకెల్ అలెన్, యూనివర్సిటీ ఆఫ్ ఇదాహో ఫుడ్ సైంటిస్టు హెలెన్ జాయినర్ కలసి ప్రయోగాలు చేస్తున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులను కలుపుకుపోతున్నారు. అక్కడి వాతావరణంలో కార్బన్ (జీవం పెరిగేందుకు ఆధారం), నైట్రోజన్ (చెట్లు ప్రొటీన్ తయారు చేసుకునేందుకు అవసరం) ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నీటి జాడలున్నట్లు అర్థమవుతోంది. వీటి ఆధారంగా అక్కడ వ్యోమగాములు.. వారికి వారే పంటలు పండించుకునే ప్రయత్నం చేయాలని అలెన్ చెప్పారు.

వార్తల్లో వ్యక్తులు
ఆసియా ఉత్తమ ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ
Current Affirs ఆసియాలో ఉత్తమ ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఎంపికయ్యారు. ఈ మేరకు లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ మేగ జీన్ ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ జైట్లీని ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్,ఆసియా’గా ఎంపిక చేశామని తెలిపింది.

మిస్ దివా 2015 గా ఊర్వశి రౌతెలాఅక్టోబర్ 19న ముంబైలో జరిగిన Yamaha Fascino Miss Diva 2015 పోటీల్లో ‘మిస్ దివా-2015’ కిరీటాన్ని బాలీవుడ్ నటి, మోడల్ ఊర్వశి రౌతెలా సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ 21 ఏళ్ల సుందరి భారత్ తరఫున 2015 మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పాల్గొననుంది. అలాగే బెంగళూరుకి చెందిన నటాషా అసది మొదటి రన్నరప్‌గా, ఔరంగబాద్‌కు చెందిన నవేలి దేశ్‌ముఖ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూతప్రముఖ తెలుగు హాస్యనటుడు కళ్లు చిదంబరం(70) అనారోగ్యంతో అక్టోబర్ 19న తుదిశ్వాస విడిచారు. విజయనగరంలో 1948 ఆగస్టు 8న జన్మించిన కొల్లూరు చిదంబరం విశాఖ పోర్టులో ఉద్యోగం చేశారు. తర్వాత ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి 1989లో గొల్లపూడి రచనతో దర్శకుడు ఎం.వి.రఘు తీసిన ‘కళ్లు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అందులో అంధుని పాత్రలో మెప్పించారు. దీంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. 300 చిత్రాల్లో నటించిన చిదంబరానికి కళ్లు, అమ్మోరు, జంబలకడి పంబ, ఆ ఒక్కటీ అడక్కు, మనీ మనీ మనీ, గోవింద గోవింద, కొండవీటి దొంగ వంటి చిత్రాలు గుర్తింపునిచ్చాయి. నాటకరంగ కళాకారుల కోసం 2009లో విశాఖలో 1,180 మంది కళాకారులతో ‘సకల కళాకారుల సమాఖ్య’ అనే సంస్థను స్థాపించి చిదంబరం పలు సేవలందించారు.

సెండ్ మై గిఫ్ట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్బెంగళూరులో నూతనంగా ప్రారంభమైన ఈ కామర్స్ స్టార్టప్ ‘సెండ్ మై గిఫ్ట్’కు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించనున్నాడు. మనం అనుకునే వారికి బహుమతులను చేర్చేలా ‘సెండ్ మై గిఫ్ట్’ పేరిట ఈ-కామర్స్ వెబ్‌పోర్టల్ అక్టోబర్ 22 నుంచి తన కార్యకలాపాలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికైనా బహుమతులను పంపగల సౌకర్యం ‘సెండ్ మై గిఫ్ట్’లో అందుబాటులో ఉంది.

జాతీయ మహిళా కమిషన్ సభ్యుడిగా అలోక్ రావత్కేంద్ర మాజీ క్యాబినెట్ కార్యదర్శి అలోక్ రావత్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యునిగా కేంద్రం నియమించింది. ఐదుగురు సభ్యులు గల బృందంలో రావత్ నాలుగో సభ్యుడు. ఈ కమిషన్‌లో సభ్యునిగా పనిచేయనున్న తొలి పురుషుడు రావత్. 1977 బ్యాచ్, సిక్కిం కేడర్‌కు చెందిన రావత్ కేంద్రంలో పలురకాల హోదాల్లో పనిచేశారు.

అవార్డులు
కైలాష్ సత్యార్థికి హార్వర్డ్ పురస్కారం
Current Affirs నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థికి ఈ ఏడాది హార్వర్డ్ వర్సిటీ మానవతావాది (హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ 2015) పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం భారత్‌లో ఆయన చేస్తున్న సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇచ్చినట్లు హార్వర్డ్ ఫౌండేషన్ పేర్కొంది.

ఎల్‌ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు 2015 సంవత్సరానికిగాను గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎల్‌ఐసీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ తరఫున ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్ చీఫ్ మేనేజర్ కేఆర్ అశోక్ ఈ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ కేబినెట్ మంత్రి, డ్యూష్ ఆఫ్ లాన్‌కాస్టర్ చాన్సలర్ ఆలీవర్ లిట్‌విన్ అవార్డులను ప్రదానం చేశారు.

క్రీడలు
కామన్వెల్త్‌లో భారత లిఫ్టర్ల పతకాల పంట కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 10 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకాలు భారత వెయిట్‌లిఫ్టర్లు సాధించారు.
  • బంగారం: సతీశ్ కుమార్, లాలూ టకూ, నుంగ్ షిటాన్, కోజుమ్ తాబా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ లిఫ్టర్ రాగాల వెంకట్; జూనియర్, సీనియర్ మహిళల విభాగంలో పూనమ్ యాదవ్ రెండు స్వర్ణాలు; వికాస్ ఠాకూర్,స్వప్నప్రియ బారువా
  • రజతం: జూనియర్ విభాగంలో అజయ్ సింగ్, సీనియర్ విభాగంలో రాగాల వెంకట్, యూత్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.లలిత
  • కాంస్యం: సీనియర్ మహిళల విభాగంలో మినాతి 

డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ 
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అక్టోబరు 18న జరిగిన ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్(చైనా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింధూకు రూ.16 లక్షల ప్రైజ్‌మనీ, 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ వీడ్కోలు 2011 వరల్డ్‌కప్‌లో 21 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు(311) తీసిన నాలుగో బౌలర్ జహీర్‌ఖాన్. కుంబ్లే(619), కపిల్‌దేవ్(434), హర్భజన్ సింగ్ (417) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. 37 ఏళ్ల జహీర్ టెస్ట్‌ల్లో 311 వికెట్లు, వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్ గుడ్ బైCurrent Affirs ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. అక్టోబర్ 20న 37 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సెహ్వాగ్ దుబాయ్‌లో తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. 2013 మార్చిలో తన ఆఖరి టెస్టు ఆడిన సెహ్వాగ్, అదే ఏడాది జనవరిలో చివరిసారిగా వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ‘ట్రిపుల్ సెంచరీలు’ చేసిన ఏకైక భారత ఆటగాడైన సెహ్వాగ్, వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు.
104 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సెహ్వాగ్ 49.34 సగటుతో 8,586 పరుగులు చేశాడు. వీటిలో 23 సెంచరీలు ఉన్నాయి. అలాగే 251 వన్డేలు ఆడి 35.05 సగటుతో 8,273 పరుగులు సాధించాడు. 19 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సెహ్వాగ్ 21.88 సగటుతో 394 పరుగులు చేశాడు.
తొలి టెస్టు: నవంబర్ 3-6, 2001 దక్షిణాఫ్రికాతో (బ్లూమ్‌ఫాంటెయిన్‌లో)
చివరి టెస్టు: మార్చి 2-5, 2013 ఆస్ట్రేలియాతో (హైదరాబాద్‌లో)
తొలి వన్డే: ఏప్రిల్ 1, 1999 పాకిస్తాన్‌తో (మొహాలీలో)
చివరి వన్డే: జనవరి 3, 2013 పాకిస్తాన్‌తో (కోల్‌కతాలో)
తొలి టీ20: డిసెంబర్ 1, 2006 దక్షిణాఫ్రికాతో (జోహెన్నస్‌బర్గ్‌లో)
చివరి టీ20: అక్టోబర్ 2, 2012 దక్షిణాఫ్రికాతో (కొలంబోలో)
తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్: 1997-98 సీజన్‌లో..
చివరిది: అక్టోబర్ 15-18 2015 హర్యానా తరఫున ఢిల్లీతో

సంక్షిప్తంగా
  • టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా టి.వివేక్, డి.కృష్ణారెడ్డి, కె.రామ్మోహన్ రెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ రావు అక్టోబరు 14న బాధ్యతలు స్వీకరించారు. మంగారి రాజేందర్, సీహెచ్ సాయిలు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • అక్టోబరు 31న పీవీ రాజగోపాల్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారంతోపాటు రూ. 10 లక్షల నగదును కూడా అందజేస్తారు.
  • పంది జన్యువులోని రిట్రోవైరస్‌లను క్రియారహితం చేయడం ద్వారా పంది అవయవాలు మనిషికి అమర్చవచ్చని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.
  • ఐరాస వాతావరణ మార్పుల అంతర్ ప్రభుత్వ ప్యానల్ చైర్మన్‌గా దక్షిణ కొరియాకు చెందిన హోసుంగ్‌లీ ఎన్నికయ్యారు.
  • 2003 నుంచి భారత్‌లో కేసులు నమోదు కాని ‘యాస్’ చర్మవ్యాధిని కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చారు.
  • బీపీఎల్ గుర్తింపు ప్రమాణాన్ని ప్రపంచబ్యాంకు 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు పెంచింది.
  • యమహా ఫాసినో మిస్ దివా-2015 కిరీటాన్ని మోడల్, నటి ఊర్వశి రౌతెలా సొంతం చేసుకుంది. 21 ఏళ్ల ఊర్వశి స్వస్థలం ఉత్తరాఖండ్. విశ్వసుందరి-2015 పోటీకి ఆమె భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, వెల్దుర్తి మండలాల్లో 2,721.98 ఎకరాలను డీఆర్‌డీఓకు కేటాయిస్తున్నట్లు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ అక్టోబరు 16న ఉత్తర్వులు జారీ చేశారు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates