Ticker posts

9/recent/ticker-posts

Happy children's day to all

👉బాలల దినోత్సవ సందర్భంగా
శుభాకాంక్షల తో..

👉జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14,1889–మే 27,1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు.పండిత్‌జీగా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

👉🏻విషయ సూచిక
1నవ భారత రూపశిల్పి
2బాల్యం
3జీవిత చరిత్ర
4భారత దేశ మొదటి ప్రధాన మంత్రి
4.1ఆర్ధిక విధానాలు
4.2విద్య మరియు సంఘ సంస్కరణ
4.3జాతీయ భద్రత మరియు విదేశాంగ విధానం

ఆయన భారత దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు అందరికంటే ఎక్కువకాలం పనిచేసిన ప్రధాన మంత్రి. వీరి పదవీ కాలం 1947 నుండి 1964 వరకు సాగింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ ప్రముఖ నాయకుడైన నెహ్రూ, స్వంతంత్ర భారతదేశ మొదటి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీచే ఎన్నుకోబడ్డారు.పిమ్మట 1952 లోభారతదేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినపుడు ప్రధాని అయ్యారు.అలీనోద్యమస్థాపకుల్లో ఒకరైన నెహ్రూ యుద్ధానంతర కాల అంతర్జాతీయ రాజకీయాలలో ముఖ్య వ్యక్తి. ఆయననుపండిట్ నెహ్రూఅని,(సంస్కృతం లో "పండిట్" గౌరవసూచకము ) భారతదేశంలోపండిట్ జీ(జీ, మర్యాద పూర్వక పదం) అని పిలిచేవారు.భారత దేశంలో సంపన్నన్యాయవాదిమరియు రాజకీయ వేత్త అయినమోతిలాల్ నెహ్రూకుమారుడైన నెహ్రూ, యువకునిగా ఉన్నప్పుడేభారత జాతీయ కాంగ్రెస్లో వామ పక్ష నాయకుడయ్యారు.బ్రిటిష్ సామ్రాజ్యంనుండిసంపూర్ణ స్వాతంత్ర్యసముపార్జనకు అనుకూలుడైన నెహ్రూ,మహాత్మా గాంధీసలహాలతో , ప్రజాకర్షణ కలిగిన సంస్కరణ వాద నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. దీర్ఘ కాలం కొనసాగిన భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించి గాంధీగారి రాజకీయ వారసునిగా గుర్తించ బడ్డారు. జీవిత పర్యంతం స్వేచ్ఛా వాదిగా ఉన్న నెహ్రూ, పేద దేశాలదీర్ఘకాలఆర్ధిక అభివృద్ధిసమస్యలుఎదుర్కోవటానికి నిలకడతో కూడిన సామ్యవాదం మరియుప్రభుత్వ రంగంఅనుకూలమని భావించారు.ఆగష్టు 151947లో భారత దేశం స్వాతంత్ర్య్యం సంపాదించినపుడున్యూఢిల్లీలో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛా వాద సుగుణాల పట్ల గుర్తింపుతో పాటు పేద మరియు అణగారిన వర్గాల పట్ల వ్యాకులత, నెహ్రూ తన విధానాలు రూపొందించటంలో దిశానిర్దేశం చేసి భారతదేశ సిద్ధాంతాలను నేటికి కూడా ప్రభావం చేస్తున్నాయి. ఇవి ఆయన సామ్యవాద మూలాలతో ప్రపంచాన్ని అవలోకనం చేసుకోవడాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రధాన మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన నెహ్రూ, తన పార్టీ సభ్యుల ఆధిక్యత కలిగిన పార్లమెంటు ద్వారా హిందూ స్త్రీల దాస్య విముక్తికి మరియు సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం, మహిళలను వారి భర్తల నుండి విడాకులు పొంది, ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఉన్నాయి.ఆయన సుధీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉన్నది.ఆయనను కొన్ని సందర్భాలలో 'నవ భారత రూపశిల్పి'గా పేర్కొంటారు. ఆయన కుమార్తె,ఇందిరాగాంధీ, మరియు మనుమడు,రాజీవ్ గాంధీకూడా భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసారు.

☀బాల్యం
 నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరం నందు జన్మించాడు.స్వరూపరాణి,మోతీలాల్ నెహ్రూదంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యోగ నిమిత్తము కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ మరియు అయన తోబుట్టువులు అనంద్ భవన్ అనబడు ఒక భవంతి నందు ఉంటూ, దుస్తుల విషయంలో హావాభావాల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతాహిందీ,సంస్కృతంతోపాటుఆంగ్లములో కూడ తర్ఫీదు ఇవ్వబడినారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులోఇంగ్లాండుపయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతాఇంటి వద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా పేరోందిన పాఠశాలలందు జరిగినది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించాడు. "జొ" అను ముద్దు పేరు తో పిలిచేవారు.

📃జీవిత చరిత్ర
నెహ్రూ -గాంధీ కుటుంబం , కా 1927Nehru-Gandhi family, ca 1927నేటిఉత్తరప్రదేశ్రాష్ట్రంలోనిఅలహాబాద్నగరంలో, సంపన్న న్యాయవాది అయినమోతిలాల్ నెహ్రూమరియు స్వరూప్ రాణిల ప్రధమసంతానంగానెహ్రూ జన్మించారు.
నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణ వంశానికి చెందినది. మోతీలాల్ చాలా సంవత్సరాల క్రితంఅలహాబాద్కు తరలి వెళ్లి న్యాయవాద వృత్తిలో విజయవంతమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో రెక్కలు విప్పుకున్న భారత స్వతంత్ర పోరాటంలో అయన చురుకైన సభ్యుడు. నెహ్రూ మరియు అయన ఇద్దరు సోదరీమణులు-విజయలక్ష్మి పండిట్మరియు కృష్ణ- ఒక పెద్ద భవనమైన ఆనంద్ భవన్ నందు, ఆ రోజులలో శిష్ట వర్గం అవసరమని భావించిన, ప్రబలమైన ఆంగ్లసాంప్రదాయ పద్ధతులలో, పెంచబడ్డారు. వారికిహిందీ, సంస్కృతాలు నేర్పించడంతో పాటు భారతదేశంకు చెందిన సారస్వత గ్రంధాలలో పునాది వేయబడింది. మోతిలాల్ తన కుమారుడు ఇండియన్ సివిల్ సర్వీసు నందు అర్హత పొందాలని ఆశించి, యువ జవహర్ లాల్ నుఇంగ్లాండ్నందుగల హార్రో కి పంపారు. జవహర్ లాల్ తన పాఠశాల సిలబస్ ను కష్టమైనది గాను, మరియు నివాస షరతులు అనుకూలంగా లేనివి, భరింప శక్యం కానివిగా భావించి హర్రో నందు గల పాఠశాల జీవితం ఆనందించలేకపోయారు.ఐనప్పటికీ,నెహ్రూ పాఠశాల విద్య పూర్తి చేసి, 1907 లోకేంబ్రిడ్జిఎంట్రన్స్పరీక్ష వ్రాసి జీవశాస్త్ర అభ్యసనకుట్రినిటీ కళాశాలకువెళ్లారు. జవహర్ లాల్ తనట్రిపోస్నందు రెండవ స్థానంలో నిలిచి 1910 లో పట్టా పొందారు. విశ్వవిద్యాలయంలోనిస్వేచ్ఛాయుత వాతావరణం ఆయనను ఇతర కార్యక్రమాలు నిర్వహించేటట్లు ప్రోత్సహించి, సాధారణ దృష్టికోణంపై కీలక ప్రభావాన్ని చూపింది. పిమ్మట అయన అక్టోబర్, 1910 లో న్యాయ అభ్యసనకు ఇన్నెర్ టెంపుల్ నందు భర్తీ అయ్యారు. హర్రో మరియు కేంబ్రిడ్జిలందు అభ్యసించాలనే నిర్ణయం న్యాయ విద్య యందు జవహర్ లాల్ కు ఉన్నఆకర్షణవల్ల కాక వారి తండ్రి ఆజ్ఞానుసారం జరిగింది. జవహర్ లాల్ 1912 నందు చివరి పరీక్ష ఉత్తీర్ణుడై అదే సంవత్సరం నందు ఇన్నెర్ టెంపుల్ నందు న్యాయ వాద వృత్తిని చేపట్టారు. దాని వెంటనే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.అయితే, రాజకీయాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకత్వంలోని భారత స్వాతంత్ర్య సంగ్రామం ఆయనను ఆకర్షించింది.1919 లో జలియన్ వాలా బాగ్ లో ఆందోళనకారులపై ఆంగ్లేయుల ఊచకోత తరువాత, నెహ్రూ తీవ్ర ప్రతీకారంతో తన శక్తులన్నీ స్వాతంత్ర్య సంగ్రామానికే కేటాయించారు.మొదట తన కుమారుని రాజకీయ యోచనను సందేహించినా, తరువాత స్వాతంత్ర్య సముపార్జనకు కాంగ్రెస్ ప్రయత్నాలలో మోతీలాల్ కూడా పాల్గొన్నారు. అతి త్వరగా నెహ్రూ, గాంధీ గారినమ్మినబంటుగా గుర్తింపు పొందారు. ఆయన ఉద్యమాలు, ఆహింసాయుతమైనవే అయినప్పటికీ,ఆయన జీవితకాలంలో తొమ్మిది సంవత్సరాలు కారాగారంలో ఉండేటట్లు చేసాయి. కారాగారంలో ఉన్న కాలంలో నెహ్రూ, "గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ(1934), తన "జీవితచరిత్ర "(1936), మరియు "ది డిస్కవరీ అఫ్ ఇండియా "(1946) రచించారు. ఈ రచనలు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయనకు పెరుగుతున్న కీర్తితో పాటు రచయితగా కొంత ప్రత్యేకతను సంపాదించి పెట్టాయి.గాంధీ గారి మార్గదర్శకత్వంలో నెహ్రూ మొదటిసారిగా 1929 లో భారత జాతీయ కాంగ్రెస్ , లాహోర్ సమావేశాలకు నాయకత్వం వహించారు. అయన మరలా 1936, 1937 చివరిగా 1946 లలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై స్వతంత్ర సంగ్రామంలో గాంధీ తరువాత రెండవ నాయకునిగా గుర్తింపు పొందారు.
  ఫిబ్రవరి 8, 1916 లో కాశ్మీరి బ్రాహ్మణ వంశానికే చెందిన కమలా కౌల్ తో అయన వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఇందిరా ప్రియదర్శిని పుట్టింది.ఈమె తరువాత కాలంలోఇందిరా గాంధీగా పిలువబడింది.కమలా నెహ్రూ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలోచురుకుగా పాల్గొన్నారు కానీ 1936లో క్షయ వ్యాధితో మరణించారు. నెహ్రూ తన శేష జీవితం మొత్తం ఒంటరిగానే గడిపారు. అయితే 1946 నుండి వైస్రాయి భార్యగా నున్నఎడ్విన మౌన్త్బట్టేన్తో అయన సంబంధం గురించి అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అయన తన తరువాత జీవితకాలంలో ఎక్కువగా తన కుమార్తె పైన మరియు సోదరివిజయలక్ష్మి పండిట్పైన ఆధార పడ్డారు.

👳🏼భారత దేశ మొదటి ప్రధాన మంత్రి

👉🏻తీన్ మూర్తి భవన్, ప్రధాన మంత్రిగా నెహ్రూ యొక్క నివాసము, ప్రస్తుతం అయన జ్ఞాపకార్ధ మ్యూజియం.బ్రిటిష్ కాబినెట్ మిషన్ అధికార బదిలీ ప్రస్తావన చేసేందుకు వచ్చినపుడు, నెహ్రూ మరియు ఆయన సహచరులు విడుదల చేయబడ్డారు.బ్రద్దలైన మతకలహాలు మరియు గతి తప్పిన రాజకీయాలు, ప్రత్యేక ముస్లిం రాజ్య మైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వం లో నడుపబడుచున్న ముస్లింలీగ్ నుండి వ్యతిరేకతల నడుమ, నెహ్రూ అధిపతిగా నున్న తాత్కాలిక ప్రభుత్వం బలహీనపడింది.మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత, నెహ్రూ జూన్3, 1947 న ఆంగ్లేయులచే ప్రతిపాదించబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరించారు.ఆయన 15ఆగష్టునభారత దేశ ప్రధాన మంత్రిగాపదవీ స్వీకారం చేసిఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ: గా ప్రసిద్దమైన తన మొదటి ప్రసంగాన్ని చేసారు.చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది.భారత దేశం కొరకు మరియు దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది."ఏమైనప్పటికీ, ఈ కాలం తీవ్రమైన మతహింసకు ఆనవాలుగా ఉన్నది. ఈ హింసపంజాబ్ ప్రాంతం,ఢిల్లీ,బెంగాల్మరియు భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. శాంతిని పెంపొందించేందుకు , కోపోద్రిక్తులై, దిక్కుతోచక యున్న శరణార్ధులను శాంతింప చేసేందుకు, నెహ్రూ పాకిస్తానీ నాయకులతో కలిసి పర్యటనలు నిర్వహించారు.నెహ్రూ, మౌలానా ఆజాద్ మరియు ఇతర ముస్లింనాయకులతో కలిసి, ముస్లింలకు భద్రత కల్పించి, భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేసారు. ఈ కాలంలోని హింస నెహ్రూను తీవ్రంగా కలచి వేసి , కాల్పుల విరమణ ను పాటించేలా మరియు భారత-పాకిస్తాన్ యుద్ధం 1947, ఆపడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది. మతవిద్వేషాలకు భయమునొందిహైదరాబాద్ రాష్ట్రవిలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంశయించారు.స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరాలలో, తన బాగోగులు చూడడానికి మరియు వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు, నెహ్రూ తరచుగా తన కుమార్తె పై ఆధార పడేవారు.ఆయన నాయకత్వంలో, 1952 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది. ఇందిర, తన తండ్రి సంరక్షణకై ఆయన అధికారికనివాసం లోనికి మారారు. వాస్తవానికి ఇందిర నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ ఆయన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు.

💰ఆర్ధిక విధానాలు

👉🏻భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక మరియు నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు. వ్యాపార మరియు ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్, విద్యుత్ మరియు భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానంను యోచించారు. నెహ్రూభూపునఃపంపిణివిధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.కమ్యూనిటీ అభివృద్ది పధకాలకు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యాన్ని ఇనుమడించే వివిధ కుటీర పరిశ్రమలను విస్తరింపచేసారు.భారీ ఆనకట్టలను ('నెహ్రూ వీటిని భారత దేశ ఆధునిక దేవాలయాలు' అనేవారు ) ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన మరియుజలవవిద్యుత్ఉత్పత్తి తో పాటు, నెహ్రూ భారతదేశఅణుశక్తికార్యక్రమాలను కూడాప్రవేశ పెట్టారు.నెహ్రూ పదవీకాలంలో అభివృద్ధిమరియు ఆహారోత్పత్తి పెరుగుదలజరిగినప్పటికీ, భారత దేశం తీవ్రమైన ఆహారపు కొరతను ఎదుర్కొంటూనే ఉంది.నెహ్రూ ఆర్ధిక విధానాలు , ఆర్ధిక విధాన ప్రకటన 1956 లో పొందుపరచబడి, విభిన్న ఉత్పాదక మరియు భారీ పరిశ్రమలను ప్రోత్సహించినప్పటికీ , దేశ ప్రణాళిక, నియంత్రణ మరియు క్రమబద్దీకరణలు ఉత్పాదకత, నాణ్యత మరియు లాభదాయకతలను బలహీన పరచాయి.భారతఆర్ధిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, విస్తారమైనపేదరికం, దీర్ఘకాల నిరుద్యోగిత అనే అంటురోగాల బారిన ప్రజలు చిక్కుకున్నారు. నెహ్రూ ప్రజాదరణ చెక్కుచెదరక పోగా, ఆయన ప్రభుత్వం విస్తారమైన భారత గ్రామీణ ప్రజానీకానికి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య రక్షణ, రహదారులు మరియు వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో విజయవంతమయ్యింది.

📗విద్య మరియు సంఘ సంస్కరణ

👉🏻భారత దేశ బాలలు మరియు యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు.ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్,ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీమరియుఇండియన్ ఇన్స్టిట్యూట్అఫ్ మానేజ్మెంట్వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు.దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను మరియు వేలాది పాఠశాలల నిర్మాణాన్నిపర్యవేక్షించారు.అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు మరియు ఆహార సరఫరా ప్రారంభించడానికిచొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి మరియు సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించుటకు మరియు స్త్రీల యొక్క న్యాయ పరమైన హక్కులను మరియు సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది.
షెడ్యుల్డ్ కులాలు మరియు తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను మరియు అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి మరియు ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates