Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయం (7th December, 2015.)

అంతర్జాతీయంమాల్టాలో చోగమ్ సదస్సుకామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు(చోగమ్).. మాల్టా రాజధాని వాలెట్టాలో నవంబరు 27 నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఉగ్రవాద నిధులపై సదస్సు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల హబ్ నెలకొల్పేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి. కామన్వెల్త్‌లోని చిన్న, పేద దేశాలకు ఉద్గారాలను తగ్గించేందుకు నిధులు సమకూర్చేందుకు ఈ హబ్ తోడ్పడనుంది. ఉగ్రవాద నిర్మూలనకు రూ.50 కోట్ల నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు సదస్సులో ప్రకటించారు. ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ ఇతివృత్తంతో సదస్సు జరిగింది. సదస్సులో 53 సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ-మూన్ కూడా పాల్గొన్నారు. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సదస్సుకు హాజరయ్యారు.

బ్రిటన్‌లో ‘చోగమ్ 2018’2018లో చోగమ్‌ను బ్రిటన్ నిర్వహించనుంది. చోగమ్ ప్రతి రెండేళ్లకూ ఒకసారి జరుగుతుంది. 53 దేశాలతో కూడిన ఈ సదస్సు 2017లో వనటు దేశంలో జరగాల్సి ఉంది. అయితే.. 2015 మార్చిలో తుపాన్ తాకిడితో చిన్న పసిఫిక్ దీవి దేశమైన వనటు తీవ్రంగా దెబ్బతింది. దీంతో తదుపరి సదస్సును 2018లో తాము నిర్వహించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

పారిస్‌లో ‘వాతావరణ సదస్సు’వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశం నవంబర్ 30న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రారంభమైంది. సదస్సుకు 150పైచిలుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. COP21 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)గా పిలిచే ఈ సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కర్బన ఉద్గారాలపై పోరాటానికి భారత్ నిబద్ధతను ప్రదర్శిస్తూ సదస్సు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతదేశ వేదికను మోదీ ప్రారంభించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశాలు.. ఉద్గారాలను తగ్గించే భారాన్ని భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకు నెట్టివేయటం నైతికంగా తప్పన్నారు. పేద దేశాలకు.. తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవటానికి కర్బనాన్ని మండించే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌లతో మోదీ భేటీ అయ్యారు.

అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమిపారిస్ వాతావరణ సదస్సులో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ నవంబర్ 30న అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమిని ప్రారంభించారు. ఈ కూటమిలో సుమారు 120 దేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సెక్రటేరియట్ ఏర్పాటు సహా మౌలిక వసతుల కోసం భూమిని కేటాయిస్తామని, అలాగే భారత్ తరఫున వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 200 కోట్లు) ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోదీ ప్రకటించారు. కూటమికి సంబంధించిన కార్యక్రమాన్ని త్వరలో హర్యానాలోని గుర్గావ్‌లో ఉన్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ’లో నిర్వహిస్తామన్నారు.

వృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశం చైనాCurrent Affirsప్రపంచంలోనే వృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశంగా చైనా నిలిచింది. ఆ దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా 212 మిలియన్ల(21.2 కోట్లు)కు చేరుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇన్సూరెన్స్ అసోసియేషన్ ఆఫ్ చైనా, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్, మరో మూడు సంస్థలు కలసి నవంబర్ 29న ఈ నివేదికను విడుదల చేశాయి.

బ్రిక్స్ మీడియా శిఖరాగ్ర సమావేశంఐదు బ్రిక్స్ దేశాలకు చెందిన 25 మీడియా సంస్థలు పాల్గొన్న తొలి ‘బ్రిక్స్ మీడియా శిఖరాగ్ర సమావేశం’ డిసెంబర్ 1న చైనా రాజధాని బీజింగ్‌లో ముగిసింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదం, వాతావరణ మార్పుపై పోరాటం చేయాలని మీడియా సంస్థల అధినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రిక్స్ కూటమికి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల్లో మీడియా ప్రయోజనాలను మెరుగుపరచడంతో పాటు సంస్థాగత వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. 

జాతీయంరాజ్యంగ దినోత్సవంగా నవంబరు 26రాజ్యాంగ సభ.. 1949, నవంబరు 26న రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నట్లు నవంబరు 26న లోక్‌సభ ప్రకటించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 26న ప్రారంభమయ్యాయి.

భారత్‌లో తొలి పోలియో వ్యాక్సిన్ ఇంజక్షన్Current Affirsపోలియోను సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తొలి సారిగా ఇంజక్టబుల్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ‘ఇన్‌యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (IPV)’ ఇంజక్షన్‌ను నవంబర్ 30న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. మొదటి దశలో ఈ వ్యాక్సిన్ ఆరు రాష్ట్రాల్లో (అస్సాం, గుజరాత్, పంజాబ్, బిహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్) ప్రవేశ పెడుతున్నారు.

రాష్ట్రీయం హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ తయారీ పరిశ్రమరూ.500 కోట్లతో 50 ఎకరాల్లో ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు నవంబరు 30న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివెసైస్ (ఏవోడీ) కంపెనీతో కలిసి భారత్‌కు చెందిన సిస్కో కంపెనీ ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది.

నౌకాశ్రయ విధానాన్ని ప్రకటించిన ఏపీCurrent Affirs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబరు 27న నౌకాశ్రయ విధానం (పోర్టు పాలసీ)-2015ను విడుదల చేసింది. ఈ విధానం కింద ప్రధాన ఓడరేవులను విస్తరిస్తారు. 14 చిన్న ఓడరేవులను అభివృద్ధి చేస్తారు. దీనికోసం ‘మారిటైం బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఓడరేవుల ప్రణాళిక, అభివృద్ధి, పర్యవేక్షణ, రాయితీలు వంటివి ఈ బోర్డు పరిధిలోకి వస్తాయి. అయిదేళ్లకు ఒకసారి ఈ విధానాన్ని సమీక్షిస్తారు.

బాక్సైట్ తవ్వకాలపై ఏపీ శ్వేతపత్రంవిశాఖపట్నం జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నవంబరు 24న శ్వేతపత్రం విడుదల చేశారు. బాక్సైట్ తవ్వకాలను స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో బాక్సైట్ నిల్వలు ఉండగా, ఒడిశా మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో ఉన్నాయి.

ఆర్థికం రెండేళ్ల కనిష్టానికి రూపాయిడాలర్‌తో రూపాయి మారకం నవంబరు 27న 19 పైసలు క్షీణించి 66.76 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. నెల చివర కావడంతో దిగుమతిదారులు, కొన్ని బ్యాంక్‌ల నుంచి డాలర్‌కు డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి విలువ ఈ స్థాయిలో క్షీణించిందని నిపుణులు పేర్కొంటున్నారు.

రూపే కార్డు బీమాకు కాల పరిమితి పొడిగింపురూపే కార్డుకు సంబంధించి ప్రమాద బీమా క్లెయిమ్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఏదైనా ఒక ప్రమాద సంఘటన విషయంలో... క్లెయిమ్‌కు ముందు కార్డు వినియోగ కాలాన్ని (కార్డ్ యూసేజ్ కండీషన్) 90 రోజుల వరకు పొడిగించింది. ఇప్పటి వరకు ఈ పరిమితి 45 రోజులుగా ఉంది. నవంబర్ 25 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద జారీ అయిన రూపే డెబిట్ కార్డుపై రూ.లక్ష వరకు ప్రమాద బీమా కవరేజ్ ఉంది.

మొబైల్ సర్వీస్ రంగం విస్తరణభారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2 శాతానికి (దాదాపు రూ.14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్‌ఎంఏ పేర్కొంది. 2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపింది. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని అభిప్రాయపడింది.

‘అమృత్’కు రూ.వెయ్యి కోట్లు విడుదలCurrent Affirs ‘అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్-ఏఎమ్‌ఆయ్‌యూటీ)’ పథకం అమలుకు తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2న నిధులు మంజూరు చేసింది. 13 రాష్ట్రాలకు సుమారు రూ.1000 కోట్లకు పైగా నిధులను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, హరియాణా, జార్ఖండ్, మిజోరాం రాష్ట్రాలకు మొత్తం రూ.1062.27 కోట్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అమృత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను అభివృద్ధి చేయనున్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ‘అగ్ని-1’ ప్రయోగం విజయవంతంCurrent Affirsఅణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-1 క్షిపణిని భారత్ నవంబర్ 27న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది 700 కి.మీ. పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకుపోగల అగ్ని-1 బరువు 12 టన్నులు, పొడవు 15 మీటర్లు. క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేయగా, భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేసింది.

పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతంఅణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణిని భారత్.. నవంబరు 26న ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని భూతలం నుంచి భూతలం పైకి ప్రయోగిస్తారు. ఇది 350 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 500 నుంచి 1000 కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు.

నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ కదమత్స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కదమత్ (Kadmatt)’ నవంబరు 26న నౌకాదళంలోకి చేరింది. శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే ఈ యుద్ధ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) అభివృద్ధి చేసింది. దీని బరువు 3,200 టన్నులు, పొడవు 109 మీటర్లు. 25 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ తరహాకు చెందిన 4 యుద్ధ నౌకలను ‘పి-28’ ప్రాజెక్ట్ కింద జీఆర్‌ఎస్‌ఈ అభివృద్ధి చేసింది. వీటిలో కదమత్ రెండోది కాగా, మొదటిది ఐఎన్‌ఎస్ కమోర్తాను 2014లో నౌకాదళంలో ప్రవేశపెట్టారు.

‘బారక్-8’ ప్రయోగం విజయవంతంభారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బారక్-8 క్షిపణిని జెరుసలేంలో నవంబరు 27న విజయవంతంగా పరీక్షించారు. ఇది 250 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. దీన్ని భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు.

అవార్డులునంగి దేవేందర్ రెడ్డికి జయశంకర్ అవార్డుప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు-2015కు నవ తెలంగాణ సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డి ఎంపికయ్యారు. డిసెంబర్ 22న తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగే 5వ సౌత్ ఇండియా యాక్టివిస్ట్ కాన్ఫరెన్స్‌లో నంగి దేవేందర్‌కు అవార్డు అందజేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా ఉన్నందునే ఆయనను అవార్డుకు ఎంపిక చేశారు.

జీఎం రావుకు జీవిత సాఫల్య పురస్కారంCurrent Affirs మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి. మల్లికార్జున రావుకు ఆసియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం(ఏబీఎల్‌ఎఫ్) నుంచి జీవిత సాఫల్య పురస్కారం వరించింది. దుబాయ్‌లో నవంబర్ 29న జరిగిన ఏబీఎల్‌ఎఫ్ ఆరో ఎడిషన్‌లో జీఎం రావు ఈ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన సంస్థలు, వ్యక్తులను ఏబీఎల్‌ఎఫ్ ఏటా అవార్డులతో సత్కరిస్తోంది. 

వార్తల్లో వ్యక్తులుతెలుగు ప్రొఫెసర్లకు జేసీ బోస్ ఫెలోషిప్సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డెరైక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, మాలి క్యూల్ మోడలింగ్ హెడ్ డాక్టర్ నరహరి శాస్త్రిలు ప్రఖ్యాత జగదీశ్ చంద్రబోస్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఈ మేరకు వారిని ఎంపిక చేసింది. శాస్త్ర పరిశోధనల్లో చేస్తున్న పరిశోధనలకు వీరికి ఈ గౌరవం దక్కింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ పరిశోధనల్లో చంద్రశేఖర్ అపారమైన కృషి చేస్తున్నారు. ఇందుకుగానూ ఆయన ఇప్పటికే పలు అవార్డులు కూడా అందుకున్నారు. కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్‌పై నరహరిశాస్త్రి కృషి చేశారు. 

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులుసీనియర్ పాత్రికేయులు వి.వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. 1991లో ఆంధ్రప్రభ యాజమాన్యం ఆయనను ఎడిటర్‌గా నియమించింది. జర్నలిజంలో అందించిన సేవలకు గాను తెలుగు యూనివర్శిటీ దీక్షితులును ఘనంగా సత్కరించించింది. మద్రాస్ తెలుగు అకాడెమీ.. ఖాసా సుబ్బారావు అవార్డును ఇచ్చి సత్కరించింది.

ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ భారీ విరాళంCurrent Affirs ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల కోసం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (31) భారీ విరాళాన్ని ప్రకటించారు. తండ్రి అయిన సందర్భంగా ఫేస్‌బుక్‌లోని 99 శాతం షేర్లను ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఈ షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్లో 45 బిలియన్ డాలర్లు (దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు). ‘చాన్ జుకర్‌బర్గ్ ఇన్షియేటివ్’ పేరుతో మానవ వనరుల సామర్థ్యం పెంపు, అందరూ సమానమే అనే భావన పెంచే దిశగా.. ముందు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, అందరికీ సమాన హక్కుల కల్పన, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మార్క్ తెలిపారు. ఈ సందర్భంగా తర్వాతి తరం భవిష్యత్తుపై కంటున్న కలలతో మాక్స్ (కూతురు)కి జుకర్‌బర్గ్ దంపతులు ఓ లేఖ రాశారు.

డబ్ల్యూహెచ్‌ఓ భారత ప్రతినిధిగా హెంక్ బెకెడమ్ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) భారత ప్రతినిధిగా డాక్టర్ హెంక్ బెకెడమ్ నియమితులయ్యారు. నెదర్లాండ్స్‌కు చెందిన బెకెడమ్ డబ్ల్యూహెచ్‌ఓలో 19 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. చైనా, ఈజిప్టులలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధిగా, మనీలాలోని డబ్ల్యూహెచ్‌ఓ పశ్చిమ పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయంలో హెల్త్ సెక్టార్ డెవలప్‌మెంట్ డెరైక్టర్‌గా, కాంబోడియాలో హెల్త్ సెక్టార్ రిఫార్మ్ ప్రాజెక్టుకు టీమ్ లీడర్‌గా పనిచేశారు.

క్రీడలుబ్రిటన్‌కు డేవిస్ కప్ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఈవెంట్ డేవిస్ కప్‌ను బ్రిటన్ గెలుచుకుంది. గెంట్(బెల్జియం)లో నవంబరు 29న జరిగిన ఫైనల్లో బెల్జియంను ఓడించింది. బ్రిటన్ 77 ఏళ్ల తర్వాత ఈ విజయం సాధించింది.

తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ మైదానంలో జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసింది (నవంబర్ 28-29). 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను వాడారు.

రోస్‌బర్గ్‌కు అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్అబుదాబిలో నవంబరు 29న ముగిసిన రేసులో ఫార్ములా వన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ సాధించారు. ఇదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్‌కు రెండో స్థానం లభించింది.

హారికకు ప్రపంచ చెస్ ఆన్‌లైన్ టైటిల్భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల ఆన్‌లైన్ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆన్‌లైన్లో చెస్ టోర్నీ నిర్వహించటం ఇదే తొలిసారి. ఇటలీలోని రోమ్‌లో నిర్వహించిన ఈ టోర్నీ నవంబరు 27న ముగిసింది. నానా జాగ్నిడ్జ్ (జార్జియా)కు రెండో స్థానం లభించింది.

పి.వి.సింధుకు మకావు ఓపెన్
Current Affirs మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. ఆమె మకావులో నవంబరు 29న జరిగిన ఫైనల్లో మితాని మినత్సు (జపాన్)ను ఓడించింది. సింధు ఈ టైటిల్ వరుసగా మూడుసార్లు గెలుచుకొని, హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది.

ఉత్తమ అథ్లెట్స్‌గా ఈటన్, దిబాబా2015 సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ అథ్లెట్స్‌గా అమెరికా డెకాథ్లెట్ యాష్టన్ ఈటన్... ఇథియోపియా రన్నర్ గెన్‌జెబె దిబాబా ఎంపికయ్యారు. డెకాథ్లెట్ విభాగంలో ప్రపంచ ఉత్తమ అథ్లెట్‌గా నిలిచిన తొలి పురుషుడిగా ఈటన్ నిలిచాడు. ఇతను 2015 ఆగస్టులో బీజింగ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో డెకాథ్లాన్‌లో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల విభాగంలో నిలకడగా రాణించిన గెన్‌జెబె దిబాబా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించింది. ఈ విభాగంలో ఆమె పేరిటే ప్రపంచ రికార్డు ఉంది.

వెస్టిండీస్ స్పిన్నర్ నరైన్‌పై వేటుసందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. ఇక నుంచి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. బంతులు విసిరేటప్పుడు నరైన్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని లాబోర్గ్‌లోని ఐసీసీ అక్రిడేటెడ్ ల్యాబ్‌లో జరిపిన పరీక్షల్లో తేలింది. ఐసీసీ ఆర్టికల్ 6.1 ప్రకారం ఇది బౌలింగ్ నిబంధనలకు విరుద్ధంకావడంతో సస్పెన్షన్ విధించింది. అయితే బౌలింగ్ యాక్షన్‌ను సరి చేసుకున్న తర్వాత నిబంధన 2.4 ప్రకారం తనను మరోసారి పరీక్షించాలని నరైన్ ఐసీసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కెయిన్స్ నిర్దోషిమ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌ను నిర్దోషిగా తేలుస్తూ లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కెయిన్స్‌తో పాటు అతని స్నేహితుడు ఫిచ్ హాలండ్‌ను కూడా నిర్దోషిగా ప్రకటించింది. 2010లో లలిత్ మోడి చేసిన ఒక ట్వీట్‌తో ఈ కేసు మొదలయింది. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని మోడీ ట్వీట్ చేశారు. దీనికి ఆగ్రహించిన కెయిన్స్ 2012లో కోర్టును ఆశ్రయించారు. కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నట్లు ఐసీసీ కూడా 2013లో ప్రకటించింది. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు కెయిన్స్‌ను నిర్దోషిగా తేల్చింది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates