అంతర్జాతీయంహార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు
ఐదో ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగింది. ఈ సదస్సును పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసియాకి అఫ్గానిస్థాన్ గుండె వంటిదని అభివర్ణించారు. అఫ్గానిస్థాన్ లో ఎన్నికైన ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని పాక్ ప్రధాని ప్రకటించారు. భారత్ తరపున సదస్సులో పాల్గొన్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అఫ్గానిస్థాన్‌లో సమర్థవంతమైన రవాణా ఏర్పాట్లకు సాయం చేస్తామని తెలిపారు. సదస్సులో 14 సభ్యదేశాలు,17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొన్నాయి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, అజర్ బైజాన్, భారత్, చైనా, ఇరాన్, కజికిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్థాన్, టర్కీ, తుర్కమెనిస్థాన్, యూఏఈ దేశాలు కలసి 2011లో హార్ట్ ఆఫ్ ఆసియాను ఏర్పాటు చేశాయి.
భూతాపం తగ్గింపునకు ఆమోదంపారిస్‌లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్21)లో రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి భూతాపాన్ని పరిమితం చేసేందుకు డిసెంబరు 12న 195 దేశాలు ఆమోదం తెలిపాయి. పారిశ్రామికీకరణ ముందునాటితో పోల్చితే 2100 నాటికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించాయి. వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అగ్రరాజ్యాలు 2020 నాటి నుంచి ఏటా కనీసం 10,000 కోట్ల డాలర్లు సమకూర్చటం, ఈ మొత్తాన్ని 2025లో మరోసారి సమీక్షించటం తదితర అంశాలను ఒప్పందంలో పొందుపరచారు.
కజకిస్తాన్ మాజీ ప్రధానికి జైలు శిక్షకజకిస్తాన్ మాజీ ప్రధాని సెరిక్ అక్మెతోవ్‌కు అవినీతి కేసులో ఆ దేశ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాని స్థాయి వ్యక్తికి ఇలాంటి శిక్ష విధించడం కజక్‌లో ఇదే తొలిసారి. సెరిక్ 2012 నుంచి 2014 వరకు కజకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. ఈయన నుర్ ఓటాన్ పార్టీకి చెందిన నేత. అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధులు కాజేయడం వంటి అవినీతి కేసుల్లో సెరిక్‌ను దోషిగా తేలుస్తూ డిసెంబర్ 12న కోర్టు తీర్పు చెప్పింది.
సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళలుఇస్లామిక్ దేశం సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా తొలిసారి అవకాశం కల్పించారు. పెరుగుతున్న లింగవివక్షను నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. డిసెంబర్ 12న జరిగిన మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికల్లో 900 మందికిపైగా మహిళా అభ్యర్థులు పోటీలో పాల్గొనగా, 20 మంది గెలుపొందారు. రాచరిక పాలన ఉన్న సౌదీలో ప్రజలు ఓటేసి ఎన్నుకునేది ఒక్క ఈ మునిసిపల్ కౌన్సిల్స్‌నే.
‘తాపి’ పైప్‌లైన్ పనులకు శ్రీకారంనాలుగు దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సహజవాయువు సరఫరా పైప్‌లైన్ (తాపి పైప్‌లైన్)కు తుర్క్‌మెనిస్తాన్‌లోని మేరీ నగరంలో డిసెంబర్ 13న శ్రీకారం చుట్టారు. తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్‌బంగులీ, అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొని వెల్డింగ్ పనులను ప్రారంభించారు. సహజవాయు సరఫరాకు గాను 1,800 కి.మీ. పొడవైన పైపులైన్‌ను రూ. 51 వేల కోట్లతో నిర్మించనున్నారు. 2019 డిసెంబరు కల్లా పూర్తిచేసి దీని ద్వారా రోజుకు 9 కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువు (ఎంఎంఎస్ సీఎండీ) 30 ఏళ్లపాటు భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లకు తుర్క్‌మెనిస్తాన్ పంపిణీ చేయనుంది.
TAPI Pipeline: Turkmenistan–Afghanistan–Pakistan–India Pipeline
జాతీయంనల్లధనం తరలింపులో 4వ స్థానంలో భారత్ నల్లధనాన్ని విదేశాలకు తరలించటంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ డిసెంబర్ 9న నల్లధనంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో 2013-14లో భారత్ నుంచి 51 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలివెళ్లిందని పేర్కొంది. పన్ను ఎగవేత, నేరాలు, అవినీతి వంటి అక్రమ మార్గాలలో ఆర్జించిన సొమ్మును నల్లధనంగా ఆ సంస్థ తెలిపింది. కాగా, ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశం నుంచి ఏటా 139 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. చైనా తర్వాత స్థానాల్లో 104 బిలియన్ డాలర్లతో రష్యా రెండో స్థానం, 52.8 బిలియన్ డాలర్లతో మెక్సికో మూడోస్థానంలో ఉన్నాయి.
వికలాంగుల జాబితాలో యాసిడ్ దాడి బాధితులుయాసిడ్ దాడి బాధితులను వికలాంగుల జాబితాలో చేర్చాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను డిసెంబర్ 7న ఆదేశించింది. ఉచిత చికిత్స, పునరావాసాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బీహార్‌లో యాసిడ్ దాడికి గురైన బాలిక కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బాలికకు ఉచిత చికిత్సతో పాటు పరిహారంగా రూ.10 లక్షలు అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న యాసిడ్ దాడులపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
కుంచించుకుపోతున్న ఎవరెస్ట్ హిమానీనదాలువాతావరణ మార్పుల కారణంగా గత 40 ఏళ్ల కాలంలో ఎవరెస్ట్ హిమానీనదాలు 28 శాతం కుంచించుకుపోయాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, హునన్ యూనివర్సిటీ ఆఫ్ సెన్సైస్, మౌంట్ కోమో లాంగ్మా స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్లు డిసెంబర్ 7న సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. గత 50 ఏళ్లుగా ఎవరెస్ట్ శిఖరం వద్ద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
జపాన్ ప్రధాని భారత పర్యటన
జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 11న భారత్ చేరుకున్నారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో అబే భేటీ అయ్యారు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వివిధ సమస్యల పరిష్కారం కోసం భారత్ తీసుకున్న చొరవను షింజో అబే స్వాగతించారు. మరోవైపు, అబేకు ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్‌యూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ పాత్ర, ప్రధానిగా షింజో అబే చొరవకు గౌరవంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్‌యూ వీసీ సుధీర్ కుమార్ తెలిపారు.
ప్రణబ్ జన్మదినం సందర్భంగా పుస్తకాల ఆవిష్కరణభారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 80వ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. ప్రణబ్ ప్రసంగాల్లో ముఖ్యమైన వాటితో రూపొందించిన ‘సెలెక్టెడ్ స్పీచెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ - మూడో సంపుటం’ పుస్తకాన్ని, ‘ప్రెసిడెన్షియల్ రిట్రీట్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. ప్రజలు చారిత్రక స్పృహను పెంపొందించుకోవాలని.. చారిత్రక వారసత్వ సంపద భావి తరాలకు అందేలా చూడాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.
‘ఒక ర్యాంకు - ఒక పెన్షన్’పై కమిటీఒక ర్యాంకు-ఒక పెన్షన్ (ఓఆర్‌ఓపీ) అమలులో ఎదురయ్యే అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ కమిటీని నియమిస్తున్నట్లు డిసెంబర్ 14న ప్రకటించింది. కమిటీకి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలుగు వాడైన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నాయకత్వం వహిస్తారు. ఆరు నెలల్లోగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 7న ప్రభుత్వం ప్రకటించిన ఓఆర్‌ఓపీ పథకానికి సంబంధించిన వివిధ అంశాలను.. వాటిపై వచ్చిన సూచనలు, సిఫార్సులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీభారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో డిసెంబర్ 15న కొచ్చిలో భేటీ అయ్యారు. హిందూ మహా సముద్ర జలాలపై యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై త్రివిధ దళాధిపతులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దేశ రాజధానికి ఆవల త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం. చరిత్రను మార్చడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సహకారంలో పురోగతి, సుస్థిరత, సౌభాగ్యతలతో ఈ ప్రాంతాన్ని విలసిల్లజేయడం లక్ష్యాలుగా పాక్‌తో చర్చలు మళ్లీ ప్రారంభిస్తున్నామని మోదీ చెప్పారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహ పాల్గొన్నారు.
భారత్‌లో మరో గూగుల్ క్యాంపస్: సుందర్ పిచాయ్
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్‌లో కొత్తగా మరో భారీ క్యాంపస్ ఏర్పాటుతో పాటు పెద్దయెత్తున ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కంపెనీ సీఈఓగా భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2015 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 16న న్యూఢిల్లీ వచ్చిన సందర్భంగా ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ కంపెనీ ప్రణాళికలను వెల్లడించారు. భారత్‌లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించారు. 2016 చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 400 స్టేషన్లలో ఉచిత వైఫై కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, రైల్వే శాఖకు చెందిన టెలికం విభాగం రైల్‌టెల్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో 100 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందిస్తామని పిచాయ్ వెల్లడించారు.
రాష్ట్రీయందక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశందక్షిణాది రాష్ట్రాల 26వ ప్రాంతీయ సమావేశం డిసెంబర్ 12న విజయవాడలో జరిగింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తీర ప్రాంత భద్రత, పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక రాయితీలపై ఒకే విధానం, అంతరాష్ట్రీయ ఒప్పందాలు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలు పంపిస్తామన్నారు. దీంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అంతరాష్ట్ర సమస్యగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత సమావేశం కేరళలోని త్రివేండ్రంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్ఛేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ శంకుస్థాపనకు 60 ఏళ్లునాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి డిసెంబర్ 10కి 60 ఏళ్లు పూర్తయ్యాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. దీన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నెహ్రూ, ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ చిత్రపటాలు, ప్రాజెక్టు నిర్మాణంలో మరణించిన కార్మికులు, ఉద్యోగుల స్మారక స్థూపం వద్ద అధికారులు నివాళులు అర్పించారు.
అందరికీ విద్యుత్తు పథకంలో తెలంగాణదేశంలో అందరికీ విద్యుత్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన పవర్ ఫర్ ఆల్ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో డిసెంబర్ 11న దీనికి సంబంధించిన ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర అధికారులు సంతకాలు చేశారు. దీంతో ఈ ఒప్పందం కుదుర్చుకొన్న ఆరో రాష్ర్టంగా తెలంగాణ నిలిచింది. ఈ పథకం కింద వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నిరంతరం నాణ్యతతో కూడిన విద్యుత్‌ను అందించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికి అయ్యే వ్యయంలో కేంద్రం 60 నుంచి 75 శాతం వరకు భరించనుంది. అందరికీ విద్యుత్తు పథకం కింద 2019 నాటికి తెలంగాణలో అన్ని గృహాలకు నిరంతర విద్యుత్‌ను అందించనున్నారు. దీని కోసం ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయనున్నారు.
ట్రైబల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా ఏటూరు నాగారం
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద తెలంగాణలోని పర్యాటక ప్రాంతంగా వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం ఎంపికైంది. ఈ ప్రాంతాన్ని గిరిజన ఇతివృత్తంతో ‘ట్రైబల్ సర్క్యూట్’గా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రూ. 120 కోట్లతో తొలిదశ పనులను చేపట్టనుండగా... కేంద్రం రూ. 92 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 కోట్లు ఇవ్వనున్నాయి. మిగతా సొమ్మును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద సమకూర్చుతారు. వరంగల్ జిల్లా ములుగు ప్రాంతం ఈ ప్రాజెక్టుకు ‘ప్రవేశ మార్గం’గా ఉండనుంది. ప్రాజెక్టు కింద తాడ్వాయి అడవి, బొగతా జలపాతం, లక్నవరం చెరువు, మేడారం, మల్లూరు, దామరవాయిలను అభివృద్ధి చేస్తారు.
ఆర్థికం 5.41 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణంనవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.41 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం డిసెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. పప్పులు, పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెకైగబాకింది. ఇది గత ఏడాది నవంబర్‌లో 3.27 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా నవంబర్‌లో మైనస్ 1.9 శాతం పెరిగింది.
మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 130వ ర్యాంకుఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) డిసెంబర్ 14న విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)-2014లో భారత్‌కు 130వ ర్యాంకు లభించింది. మొత్తం 188 దేశాలకు సంబంధించిన సూచీలో నార్వే మొదటి స్థానాన్ని దక్కించుకొంది. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక భారత్ హెచ్‌డీఐ విలువను 0.609గా పేర్కొంది. దీంతో మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ కేటగిరీలో భారత్ చేరింది. 1980లో భారత్ హెచ్‌డీఐ విలువ 0.362. ర్యాంకుల కేటాయింపులో ఆరోగ్యకరమైన జీవితం, విద్యాప్రమాణాలు, మెరుగైన జీవన విధానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదాదాపు దశాబ్ద కాలం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు డిసెంబర్ 16న ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. అమెరికాలో ప్రస్తుతం 0-0.25 శాతం శ్రేణిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. రివర్స్ రెపో రేటును పావు శాతంగా ఉంచుతున్నట్లు ఫెడ్ తెలిపింది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరగగలదని భావిస్తున్నట్లు తెలిపింది. ఫెడ్ సభ్యులు రేట్ల పెంపును ఏకగ్రీవంగా ఆమోదించారు.
స్వచ్ఛభారత్‌కు ప్రపంచబ్యాంక్ రుణం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 1.5 బిలియన్ డాలర్ల్ల రుణం అందించేందుకు ప్రపంచబ్యాంకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు, 2019 నాటికి గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకు ముగింపు పలికేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. పారిశుధ్య సదుపాయం లేని కారణంగా ప్రాణాంతక వ్యాధులతో భారత్‌లో ప్రతి పదిమందిలో ఒకరి మరణిస్తున్నారు.
ద్వైపాక్షికంభారత్ - అమెరికాల మధ్య ‘రక్షణ’ ఒప్పందంరక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్‌తో జరిపిన భేటీలో కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్‌కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహదం పడుతుంది.
భారత్, జపాన్‌ల మధ్య 16 ఒప్పందాలు
భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు డిసెంబర్ 12న ఢిల్లీలో జరిగింది. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో పాల్గొని చర్చలు జరిపారు. భారత్‌లో తొలి బుల్లెట్ రైలుతోపాటు పౌర అణు ఒప్పందం, రక్షణ రంగంలో కీలక సహకారం వంటి ముఖ్యమైన 16 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం వంటి ఒప్పందాలూ ఉన్నాయి. భారత ఆర్థిక రాజధాని ముంబై - గుజరాత్ ముఖ్య వ్యాపార కేంద్రం అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటుకు 12 బిలియన్ డాలర్ల (రూ. 98 వేల కోట్లు) ప్యాకేజీ ఇవ్వటంతో పాటు సాంకేతికంగా పూర్తి సహకారం అందించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు కోసం 50 ఏళ్ల కాల వ్యవధికి.. 0.1 శాతం వడ్డీతో 80 శాతం నిధులను (రూ.98 వేల కోట్లు) జపాన్ అందించనుంది. దీంతో పాటు పౌర అణు ఒప్పందంలో సహకారం, రక్షణ రంగ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవటంపైనా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు.. దక్షిణ చైనా సముద్రం, ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు మొదలైన అంశాలపైనా ఇద్దరు ప్రధానులు చర్చించారు.
ఒప్పందాల వివరాలు
సైన్స్ అండ్ టెక్నాలజీహైడ్రోజన్ బాంబు అభివృద్ధి చేశాం: ఉత్తర కొరియాహైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశనేత కిమ్ జాంగ్ ఉమ్ డిసెంబర్ 10న ప్రకటన చేశారు. కాగా, దీనిపై వివిధ దేశాల నిపుణులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబును థెర్మోన్యూక్లియర్ బాంబు అని కూడా పిలుస్తారు. దీని తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ బాంబు అణుబాంబు కంటే శక్తిమంతమైన పేలుడును సృష్టిస్తుంది. ఉత్తర కొరియా 2006, 2009, 2013లలో భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించింది.
షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను ప్రయోగించిన పాక్ అణ్వస్త్ర సామర్థ్యం గల షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించింది. అరేబియా సముద్రంలో డిసెంబర్ 11న షహీన్-3ని, 15న షహీన్ 1-ఎను పరీక్షించింది. సంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లే షహీన్-3.. 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను, షహీన్ 1-ఎ.. 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. భారత్‌లోని అనేక నగరాలు వీటి పరిధిలోకి వస్తాయి.
ఇస్రో 50వ అంతరిక్ష ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 50వ అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి డిసెంబర్ 16న పీఎస్‌ఎల్‌వీ సీ-29 రాకెట్ ఆరు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రో 50వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ-29 ద్వారా సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను 550 కి.మీల ఎత్తులోని సన్ సింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 1999లో వాణిజ్యపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటి వరకు 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 32వ పీఎస్‌ఎల్వీ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ - 29 రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 227.6 టన్నులు.
కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు..
వార్తల్లోని వ్యక్తులుహిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ నిర్దోషిగా తీర్పు
పదమూడేళ్ల కిందటి హిట్ అండ్ రన్ (కారు ప్రమాదం) కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిర్దోషి అని బొంబాయి హైకోర్టు డిసెంబర్ 10న తీర్పుచెప్పింది. ట్రయల్ కోర్టు ఏడు నెలల క్రితం ఇదే కేసులో సల్మాన్‌కు విధించిన ఐదేళ్ల జైలు శిక్ష ఉత్తర్వులను రద్దుచేసింది. దుర్ఘటన సమయంలో సల్మాన్ ఆ కారును నడుపుతున్నట్లు, అపుడు ఆయన తాగి ఉన్నట్లు సందేహరహితంగా రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. అయితే 2002 సెప్టెంబరు 28వ తేదీ రాత్రి సల్మాన్ ఖాన్‌కు చెందిన తెల్లని టొయోటా లాండ్ క్రూజర్ కారు బాంద్రా ప్రాంతంలోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ సమీపంలో వేగంగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అక్కడ నిద్రిస్తున్న వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. ఆ సమయంలో కారును సల్మాన్ నడుపుతున్నారనీ, అపుడు ఆయన తాగి ఉన్నారనేది అభియోగం.
26/11 కుట్రదారుడు హెడ్లీకి క్షమాభిక్షదేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26/11 ఘటనలో కీలక నిందితుడు పాకిస్తానీ అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీకి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ముంబై కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో హెడ్లీ నేరాన్ని అంగీకరించి, అప్రూవర్‌గా మారి ఘటనకు సంబంధించిన పూర్తి, వాస్తవ వివరాలు వెల్లడిస్తానని తెలిపినందుకే క్షమాభిక్ష ప్రసాదించినట్లు న్యాయమూర్తి జీఏ సనప్ తెలిపారు. 2016 ఫిబ్రవరి 8న జరిగే విచారణలో హెడ్లీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టుకు వాంగ్మూలం ఇవ్వనున్నాడు. హెడ్లీని విచారించాక ఈ ఘటనకు కుట్రపన్నిన, పాల్గొన్న మిగిలిన ఉగ్రవాదుల వివరాలు తెలుస్తాయని న్యాయమూర్తి తెలిపారు.
ఆదాయంలో షారుక్ నంబర్ వన్బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఆదాయపరంగా భారత సెలబ్రెటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రకటించిన 100 మంది అత్యధిక సంపాదనపరులైన సెలబ్రిటీల జాబితాలో తిరిగి తొలిస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. షారుక్ రూ. 257.5 కోట్ల ఆదాయ అంచనాతో అగ్రస్థానంలో నిలవగా రూ. 202.75 కోట్ల ఆదాయ అంచనాతో సల్మాన్ రెండో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బచ్చన్ రూ. 112 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నారు. టీం ఇండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ. 119.33 కోట్లతో నాలుగో స్థానం, ఆమిర్‌ఖాన్ రూ. 104.25 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. టాప్ 10లోని ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అక్షయ్ కుమార్ (రూ. 127.83 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ. 104.78 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 40 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 59 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 74.5 కోట్లు) ఉన్నారు. సెలబ్రిటీల ఆదాయంతోపాటు వారి ఖ్యాతినీ పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ప్రకటించారు. పన్ను చెల్లింపులకు ముందు ఉన్న సెలబ్రిటీల ఆదాయాన్ని, వారి ఖ్యాతి స్కోర్లను కలిపి ర్యాంకులను వెల్లడించారు.
రైతు నేత శరద్ జోషీ కన్నుమూతరైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శరద్ జోషీ (81) డిసెంబర్ 12న పుణెలో అనారోగ్యంతో కన్నుమూశారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా, జర్నలిస్ట్‌గా, వ్యవసాయదారుడిగా పేరుగడించిన జోషీ.. రైతులకు మద్దతు ధరపై దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. 1979లో రైతుల కోసం షేట్కారీ సంఘటన సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా రైతులను సంఘటితం చేశారు. ఆయన ఉల్లిరైతుల కోసం చేసిన ఉద్యమం అప్పట్లో ప్రభుత్వాల్ని కదిలించింది. మహారాష్ట్రకు చెందిన జోషీ 2004-10 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ, శివసేన మద్దతుతో రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్దేశంతో 1994లో స్వతంత్ర భారత్ అనే పార్టీని జోషీ స్థాపించారు. కేంద్ర వ్యవసాయ సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సేవలందించారు. షేట్కారీ మహిళా అగ్హదీని మహిళా హక్కుల కోసం పోరాడేందుకు స్థాపించారు.
ఐఎస్‌ఎస్‌కు తొలిసారి బ్రిటిష్ వ్యోమగామితొలిసారిగా బ్రిటిష్ దేశానికి చెందిన వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) బయలుదేరి వెళ్లాడు. రష్యా వ్యోమగామి యూరీ మాలెన్‌చెకో, అమెరికాకు చెందిన నాసా వ్యోమగామి టిమ్ కోప్రాలతో కలసి టిమ్ పీక్ అనే బ్రిటన్ పౌరుడు డిసెంబర్ 15న కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయూజ్ టీఎంఏ-19ఎం రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అక్కడ ఈయన ఆరునెలల పాటు గడపనున్నారు.
సీబీడీటీ కొత్త చైర్మన్‌గా ఏకే జైన్కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా ఏజే జైన్ నియమితులయ్యారు. ఈయన 1978 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారి. అనితా కపూర్ పదవీ విరమణ (నవంబర్ 30) తర్వాత నుంచి ఏకే జైన్ సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన రెండు నెలలపాటు మాత్రమే పదవిలో కొనసాగనున్నారు. ఇక అనితా కపూర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను సంస్కరణల సలహాదారుగా నియమితులయ్యారు.
అవార్డులుటీఎస్‌ఎస్పీడీసీఎల్‌కి ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డులువ్యాపార రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం విశేష కృషి చేసినందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)కి రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాలు వరించాయి. స్మార్‌ట మీటర్ల వినియోగంతో పాటు వినియోగదారులకు బిల్లుల జారీ కోసం ఐఆర్ మీటర్లను వినియోగిస్తూ ఆటోమెటిక్ స్పాట్ బిల్లింగ్ సేవలను అందిస్తున్నందుకు ఎస్పీడీసీఎల్ ఈ పురస్కారాలకు ఎంపికైంది. ఎస్పీడీసీఎల్ సీఎండీ డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ఈ అవార్డులను స్వీకరించారు.
టీఎస్‌పీఎస్సీకి స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ సదస్సులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డిసెంబర్ 11న ఈ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోచ్ సంస్థ ఈ అవార్డులు ఇస్తుంది. ఇదే సదస్సులో టీఎస్‌పీఎస్సీకి డిసెంబర్ 10న ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఐటీ విస్తరణ, సేవలు, డిజిటలైజేషన్, బయోమెట్రిక్ విధానాలు ప్రవేశపెట్టడం తదితర అంశాల్లో ఈ అవార్డులు లభించాయి.
ప్రభంజన్ యాదవ్‌కు పూలే పురస్కారం
తెలంగాణ రచయిత, బీసీ జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ పురస్కారం లభించింది. డిసెంబర్ 13న ఢిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ నిర్వహించిన దళిత రచయితల 31వ జాతీయ మహాసభల్లో అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనక్షర్ చేతులు మీదుగా ప్రభంజన్ యాదవ్ అవార్డును అందుకున్నారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో బహుజనుల చైతన్యం, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వారికి ప్రతి ఏటా దళిత సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మక మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డుతో సత్కరిస్తోంది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఇప్పటి వరకు తెలుగులో తొమ్మిది, ఆంగ్లంలో ఆరు పుస్తకాలను రచించారు. ఆయన రాసిన పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
‘ఎతిహాద్’కు వరల్డ్స్ లీడింగ్ ఎయిర్‌లైన్ అవార్డువరుసగా ఏడో ఏడాది కూడా ‘వరల్డ్ లీడింగ్ ఎయిర్‌లైన్ అవార్డు’ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ను వరించింది. దీంతో పాటుగా ‘వరల్డ్స్ లీడింగ్ ఫస్ట్‌క్లాస్’, ‘వరల్డ్స్ లీడింగ్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్’, ‘వరల్డ్స్ లీడింగ్ క్యాబిన్ క్రూ’ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. డిసెంబర్ 12న అబుదాబిలో జరిగిన వార్షిక ‘వరల్డ్ ట్రావెల్ అవార్డుల’ ప్రదానోత్సవ వేడుకలో వీటిని అందజేశారు.
జాతీయ ఇంధన పొదుపు అవార్డులుఇంధన పొదుపులో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో డిసెంబర్ 14న నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇంధన పొదుపులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ అవార్డులను అందచేశారు.
తెలంగాణకు వచ్చిన అవార్డులు
ఆంధ్రప్రదేశ్ అవార్డులు
క్రీడలుబ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కెంటో మొమొటా గెలుచుకొన్నాడు. డిసెంబర్ 13 జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సల్‌సన్ (డెన్మార్క్)ను మొమొటా ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వాంగ్ యిహాన్ (చైనా)ను ఓడించి నోజోమి ఒకుహార (జపాన్) గెలుచుకొంది.
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుటాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు డిసెంబర్ 13న (ముంబై) ముగిసింది. ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్ వర్మను ఓడించి సమీర్ వర్మ గెలుచుకొన్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను వన్నవాత్ అంపున్ సువాన్ - టిన్ ఇస్రియాతే జోడి దక్కించుకొంది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోన్‌పావీ చోచువాంగ్ గెలుచుకోగా, మహిళల డబుల్స్ టైటిల్‌ను థాయ్‌లాండ్‌కు చెందిన చలాద్ చలమ్‌చాయ్, మ్యూన్‌వాంగ్‌ల జోడి సాధించింది.
దక్షిణాసియా క్రీడల మస్కట్‌గా ‘టిఖోర్’దక్షిణాసియా క్రీడల మస్కట్ లోగో ‘టిఖోర్’ను కేంద్ర యువజన, క్రీడా శాఖామంత్రి శర్బానంద సోనోవాల్ డిసెంబర్ 13న గువహటిలో ఆవిష్కరించారు. ఈ క్రీడలు 2016, ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు గువహటి, షిల్లాంగ్‌లలో జరగనున్నాయి. ఇందులో ఎనిమిది దేశాలకు చెందిన 4,500 మంది క్రీడాకారులు 23 ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఈ క్రీడలు చివరిసారి బంగ్లాదేశ్‌లో (2010) జరగగా.. భారత్ అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ అంతర్జాతీయ టెస్టు క్రికెటర్ల ర్యాంకింగ్స్
అంతర్జాతీయ టెస్టు క్రికెటర్ల ర్యాంకింగ్స్ జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 15న విడుదల చేసింది. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. అలాగే మరో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టాప్-5లో నిలిచాడు. బ్యాట్స్‌మెన్ విభాగంలో అగ్రస్థానంలో జో రూట్ (886), ఆ తర్వాత డివిలియర్స్ (881), కేన్ విలియమ్సన్ (878) ఉన్నారు. బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డేల్ స్టెయిన్ (875) తొలి స్థానంలో, అశ్విన్ (871) రెండో స్థానంలో, జడేజా (789) ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా సెరెనామహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ 2015 స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది. 2015లో ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గడమే కాకుండా ఆడిన 56 మ్యాచ్‌ల్లో 53 నెగ్గి తన టాప్ ర్యాంకును వరుసగా రెండో ఏడాది నిలుపుకుంది. దీంతో ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మేగజైన్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
పుణేకు ధోని.. రాజ్‌కోట్‌కు రైనాఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్‌లు కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనిని... సంజీవ్ గోయెంకాకు చెందిన పుణే ఫ్రాంచైజీ తీసుకుంది. సురేశ్ రైనాను ఇంటెక్స్ మొబైల్స్‌కు చెందిన రాజ్‌కోట్ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. సస్పెన్షన్ వేటు పడిన చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీల ఆటగాళ్ల కోసం డిసెంబర్ 15న ఐపీఎల్ డ్రాఫ్ట్‌ను ఏర్పాటుచేశారు. 50 మంది క్రికెటర్లు ఉన్న ఈ డ్రాఫ్ట్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చెరో రూ. 39 కోట్లు ఖర్చు చేసి ఐదుగురు ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేసుకున్నాయి. పుణే.. ధోని, రహానే, అశ్విన్, స్టీవెన్ స్మిత్, డుప్లెసిస్‌లను తీసుకోగా, రాజ్‌కోట్.. రైనా, జడేజా, మెక్‌కల్లమ్, ఫాల్క్‌నర్, బ్రావోలను తీసుకుంది.
భూతాపం తగ్గింపునకు ఆమోదంపారిస్‌లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్21)లో రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి భూతాపాన్ని పరిమితం చేసేందుకు డిసెంబరు 12న 195 దేశాలు ఆమోదం తెలిపాయి. పారిశ్రామికీకరణ ముందునాటితో పోల్చితే 2100 నాటికి భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించాయి. వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అగ్రరాజ్యాలు 2020 నాటి నుంచి ఏటా కనీసం 10,000 కోట్ల డాలర్లు సమకూర్చటం, ఈ మొత్తాన్ని 2025లో మరోసారి సమీక్షించటం తదితర అంశాలను ఒప్పందంలో పొందుపరచారు.
కజకిస్తాన్ మాజీ ప్రధానికి జైలు శిక్షకజకిస్తాన్ మాజీ ప్రధాని సెరిక్ అక్మెతోవ్‌కు అవినీతి కేసులో ఆ దేశ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాని స్థాయి వ్యక్తికి ఇలాంటి శిక్ష విధించడం కజక్‌లో ఇదే తొలిసారి. సెరిక్ 2012 నుంచి 2014 వరకు కజకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. ఈయన నుర్ ఓటాన్ పార్టీకి చెందిన నేత. అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధులు కాజేయడం వంటి అవినీతి కేసుల్లో సెరిక్‌ను దోషిగా తేలుస్తూ డిసెంబర్ 12న కోర్టు తీర్పు చెప్పింది.
సౌదీ ఎన్నికల్లో తొలిసారి మహిళలుఇస్లామిక్ దేశం సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా తొలిసారి అవకాశం కల్పించారు. పెరుగుతున్న లింగవివక్షను నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. డిసెంబర్ 12న జరిగిన మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికల్లో 900 మందికిపైగా మహిళా అభ్యర్థులు పోటీలో పాల్గొనగా, 20 మంది గెలుపొందారు. రాచరిక పాలన ఉన్న సౌదీలో ప్రజలు ఓటేసి ఎన్నుకునేది ఒక్క ఈ మునిసిపల్ కౌన్సిల్స్‌నే.
‘తాపి’ పైప్‌లైన్ పనులకు శ్రీకారంనాలుగు దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సహజవాయువు సరఫరా పైప్‌లైన్ (తాపి పైప్‌లైన్)కు తుర్క్‌మెనిస్తాన్‌లోని మేరీ నగరంలో డిసెంబర్ 13న శ్రీకారం చుట్టారు. తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్‌బంగులీ, అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొని వెల్డింగ్ పనులను ప్రారంభించారు. సహజవాయు సరఫరాకు గాను 1,800 కి.మీ. పొడవైన పైపులైన్‌ను రూ. 51 వేల కోట్లతో నిర్మించనున్నారు. 2019 డిసెంబరు కల్లా పూర్తిచేసి దీని ద్వారా రోజుకు 9 కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువు (ఎంఎంఎస్ సీఎండీ) 30 ఏళ్లపాటు భారత్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లకు తుర్క్‌మెనిస్తాన్ పంపిణీ చేయనుంది.
TAPI Pipeline: Turkmenistan–Afghanistan–Pakistan–India Pipeline
జాతీయంనల్లధనం తరలింపులో 4వ స్థానంలో భారత్ నల్లధనాన్ని విదేశాలకు తరలించటంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ డిసెంబర్ 9న నల్లధనంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో 2013-14లో భారత్ నుంచి 51 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలివెళ్లిందని పేర్కొంది. పన్ను ఎగవేత, నేరాలు, అవినీతి వంటి అక్రమ మార్గాలలో ఆర్జించిన సొమ్మును నల్లధనంగా ఆ సంస్థ తెలిపింది. కాగా, ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశం నుంచి ఏటా 139 బిలియన్ డాలర్ల నల్లధనం విదేశాలకు తరలిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది. చైనా తర్వాత స్థానాల్లో 104 బిలియన్ డాలర్లతో రష్యా రెండో స్థానం, 52.8 బిలియన్ డాలర్లతో మెక్సికో మూడోస్థానంలో ఉన్నాయి.
వికలాంగుల జాబితాలో యాసిడ్ దాడి బాధితులుయాసిడ్ దాడి బాధితులను వికలాంగుల జాబితాలో చేర్చాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను డిసెంబర్ 7న ఆదేశించింది. ఉచిత చికిత్స, పునరావాసాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బీహార్‌లో యాసిడ్ దాడికి గురైన బాలిక కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బాలికకు ఉచిత చికిత్సతో పాటు పరిహారంగా రూ.10 లక్షలు అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న యాసిడ్ దాడులపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
కుంచించుకుపోతున్న ఎవరెస్ట్ హిమానీనదాలువాతావరణ మార్పుల కారణంగా గత 40 ఏళ్ల కాలంలో ఎవరెస్ట్ హిమానీనదాలు 28 శాతం కుంచించుకుపోయాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, హునన్ యూనివర్సిటీ ఆఫ్ సెన్సైస్, మౌంట్ కోమో లాంగ్మా స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్లు డిసెంబర్ 7న సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. గత 50 ఏళ్లుగా ఎవరెస్ట్ శిఖరం వద్ద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
జపాన్ ప్రధాని భారత పర్యటన
ప్రణబ్ జన్మదినం సందర్భంగా పుస్తకాల ఆవిష్కరణభారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 80వ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. ప్రణబ్ ప్రసంగాల్లో ముఖ్యమైన వాటితో రూపొందించిన ‘సెలెక్టెడ్ స్పీచెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ - మూడో సంపుటం’ పుస్తకాన్ని, ‘ప్రెసిడెన్షియల్ రిట్రీట్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. ప్రజలు చారిత్రక స్పృహను పెంపొందించుకోవాలని.. చారిత్రక వారసత్వ సంపద భావి తరాలకు అందేలా చూడాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.
‘ఒక ర్యాంకు - ఒక పెన్షన్’పై కమిటీఒక ర్యాంకు-ఒక పెన్షన్ (ఓఆర్‌ఓపీ) అమలులో ఎదురయ్యే అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ కమిటీని నియమిస్తున్నట్లు డిసెంబర్ 14న ప్రకటించింది. కమిటీకి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలుగు వాడైన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నాయకత్వం వహిస్తారు. ఆరు నెలల్లోగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 7న ప్రభుత్వం ప్రకటించిన ఓఆర్‌ఓపీ పథకానికి సంబంధించిన వివిధ అంశాలను.. వాటిపై వచ్చిన సూచనలు, సిఫార్సులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీభారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో డిసెంబర్ 15న కొచ్చిలో భేటీ అయ్యారు. హిందూ మహా సముద్ర జలాలపై యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై త్రివిధ దళాధిపతులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దేశ రాజధానికి ఆవల త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం. చరిత్రను మార్చడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సహకారంలో పురోగతి, సుస్థిరత, సౌభాగ్యతలతో ఈ ప్రాంతాన్ని విలసిల్లజేయడం లక్ష్యాలుగా పాక్‌తో చర్చలు మళ్లీ ప్రారంభిస్తున్నామని మోదీ చెప్పారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహ పాల్గొన్నారు.
భారత్‌లో మరో గూగుల్ క్యాంపస్: సుందర్ పిచాయ్
రాష్ట్రీయందక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశందక్షిణాది రాష్ట్రాల 26వ ప్రాంతీయ సమావేశం డిసెంబర్ 12న విజయవాడలో జరిగింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తీర ప్రాంత భద్రత, పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక రాయితీలపై ఒకే విధానం, అంతరాష్ట్రీయ ఒప్పందాలు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలు పంపిస్తామన్నారు. దీంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అంతరాష్ట్ర సమస్యగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత సమావేశం కేరళలోని త్రివేండ్రంలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్ఛేరి, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ శంకుస్థాపనకు 60 ఏళ్లునాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి డిసెంబర్ 10కి 60 ఏళ్లు పూర్తయ్యాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. దీన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నెహ్రూ, ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ చిత్రపటాలు, ప్రాజెక్టు నిర్మాణంలో మరణించిన కార్మికులు, ఉద్యోగుల స్మారక స్థూపం వద్ద అధికారులు నివాళులు అర్పించారు.
అందరికీ విద్యుత్తు పథకంలో తెలంగాణదేశంలో అందరికీ విద్యుత్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన పవర్ ఫర్ ఆల్ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో డిసెంబర్ 11న దీనికి సంబంధించిన ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర అధికారులు సంతకాలు చేశారు. దీంతో ఈ ఒప్పందం కుదుర్చుకొన్న ఆరో రాష్ర్టంగా తెలంగాణ నిలిచింది. ఈ పథకం కింద వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నిరంతరం నాణ్యతతో కూడిన విద్యుత్‌ను అందించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికి అయ్యే వ్యయంలో కేంద్రం 60 నుంచి 75 శాతం వరకు భరించనుంది. అందరికీ విద్యుత్తు పథకం కింద 2019 నాటికి తెలంగాణలో అన్ని గృహాలకు నిరంతర విద్యుత్‌ను అందించనున్నారు. దీని కోసం ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయనున్నారు.
ట్రైబల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా ఏటూరు నాగారం
ఆర్థికం 5.41 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణంనవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.41 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం డిసెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. పప్పులు, పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెకైగబాకింది. ఇది గత ఏడాది నవంబర్‌లో 3.27 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా నవంబర్‌లో మైనస్ 1.9 శాతం పెరిగింది.
మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 130వ ర్యాంకుఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) డిసెంబర్ 14న విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)-2014లో భారత్‌కు 130వ ర్యాంకు లభించింది. మొత్తం 188 దేశాలకు సంబంధించిన సూచీలో నార్వే మొదటి స్థానాన్ని దక్కించుకొంది. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక భారత్ హెచ్‌డీఐ విలువను 0.609గా పేర్కొంది. దీంతో మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ కేటగిరీలో భారత్ చేరింది. 1980లో భారత్ హెచ్‌డీఐ విలువ 0.362. ర్యాంకుల కేటాయింపులో ఆరోగ్యకరమైన జీవితం, విద్యాప్రమాణాలు, మెరుగైన జీవన విధానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదాదాపు దశాబ్ద కాలం తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు డిసెంబర్ 16న ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. అమెరికాలో ప్రస్తుతం 0-0.25 శాతం శ్రేణిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. రివర్స్ రెపో రేటును పావు శాతంగా ఉంచుతున్నట్లు ఫెడ్ తెలిపింది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరగగలదని భావిస్తున్నట్లు తెలిపింది. ఫెడ్ సభ్యులు రేట్ల పెంపును ఏకగ్రీవంగా ఆమోదించారు.
స్వచ్ఛభారత్‌కు ప్రపంచబ్యాంక్ రుణం
ద్వైపాక్షికంభారత్ - అమెరికాల మధ్య ‘రక్షణ’ ఒప్పందంరక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్‌తో జరిపిన భేటీలో కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్‌కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహదం పడుతుంది.
భారత్, జపాన్‌ల మధ్య 16 ఒప్పందాలు
ఒప్పందాల వివరాలు
- శాంతియుత వినియోగానికి పౌర అణుశక్తి సహకార ఒప్పందం
- ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం
- రక్షణ రంగంలో పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మార్పునకు ఒప్పందం
- పరస్పర మిలటరీ సమాచారం మార్పిడి చేసుకునే ఒప్పందం
- రెండు దేశాల మధ్య డబుల్ ట్యాక్సేషన్ తొలగింపు ఒప్పందం
- భారత రైల్వేలు, జపాన్ మౌలిక వసతుల మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం
- భారత్‌లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత రైల్వే వ్యవస్థకోసం జపాన్ రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందం
- శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం.
- శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు యువ పరిశోధకుల పరస్పర మార్పునకు సహకారం.
- భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ విభాగం, జపాన్ ఆరోగ్య శాఖ మధ్య సహకారం.
- ఇరుదేశాల మానవ వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంస్కృతి, క్రీడలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం
- నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ ఆఫ్ జపాన్ మధ్య ఒప్పందం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తోయామా ప్రిఫెక్షర్ మధ్య పరస్పర సహకార ఒప్పందం
- కేరళ ప్రభుత్వం, జపాన్‌లోని మూడు నగరాల మేయర్ల మధ్య అభివృద్ధి ఒప్పందం.
- ఐఐఎం అహ్మదాబాద్, జపాన్ నేషనల్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలసీ మధ్య ఒప్పందం
- భారత పర్యావరణ శాఖ, జపాన్ వ్యవసాయ, అటవీ శాఖ మధ్య సహకారం.
సైన్స్ అండ్ టెక్నాలజీహైడ్రోజన్ బాంబు అభివృద్ధి చేశాం: ఉత్తర కొరియాహైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశనేత కిమ్ జాంగ్ ఉమ్ డిసెంబర్ 10న ప్రకటన చేశారు. కాగా, దీనిపై వివిధ దేశాల నిపుణులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబును థెర్మోన్యూక్లియర్ బాంబు అని కూడా పిలుస్తారు. దీని తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ బాంబు అణుబాంబు కంటే శక్తిమంతమైన పేలుడును సృష్టిస్తుంది. ఉత్తర కొరియా 2006, 2009, 2013లలో భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించింది.
షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను ప్రయోగించిన పాక్ అణ్వస్త్ర సామర్థ్యం గల షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించింది. అరేబియా సముద్రంలో డిసెంబర్ 11న షహీన్-3ని, 15న షహీన్ 1-ఎను పరీక్షించింది. సంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లే షహీన్-3.. 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను, షహీన్ 1-ఎ.. 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. భారత్‌లోని అనేక నగరాలు వీటి పరిధిలోకి వస్తాయి.
ఇస్రో 50వ అంతరిక్ష ప్రయోగం విజయవంతం
కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు..
- టెలియోస్-1 (400 కిలోలు)
- కెంట్‌రిడ్జ్ (78 కిలోలు)
- వెలాక్సి-సీ1 (123 కిలోలు)
- వెలాక్సి-11 (13 కిలోలు)
- గెలాషియో (3.4 కిలోలు)
- ఎథినోక్సాట్
వార్తల్లోని వ్యక్తులుహిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ నిర్దోషిగా తీర్పు
26/11 కుట్రదారుడు హెడ్లీకి క్షమాభిక్షదేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26/11 ఘటనలో కీలక నిందితుడు పాకిస్తానీ అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీకి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ముంబై కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో హెడ్లీ నేరాన్ని అంగీకరించి, అప్రూవర్‌గా మారి ఘటనకు సంబంధించిన పూర్తి, వాస్తవ వివరాలు వెల్లడిస్తానని తెలిపినందుకే క్షమాభిక్ష ప్రసాదించినట్లు న్యాయమూర్తి జీఏ సనప్ తెలిపారు. 2016 ఫిబ్రవరి 8న జరిగే విచారణలో హెడ్లీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టుకు వాంగ్మూలం ఇవ్వనున్నాడు. హెడ్లీని విచారించాక ఈ ఘటనకు కుట్రపన్నిన, పాల్గొన్న మిగిలిన ఉగ్రవాదుల వివరాలు తెలుస్తాయని న్యాయమూర్తి తెలిపారు.
ఆదాయంలో షారుక్ నంబర్ వన్బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఆదాయపరంగా భారత సెలబ్రెటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రకటించిన 100 మంది అత్యధిక సంపాదనపరులైన సెలబ్రిటీల జాబితాలో తిరిగి తొలిస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. షారుక్ రూ. 257.5 కోట్ల ఆదాయ అంచనాతో అగ్రస్థానంలో నిలవగా రూ. 202.75 కోట్ల ఆదాయ అంచనాతో సల్మాన్ రెండో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బచ్చన్ రూ. 112 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నారు. టీం ఇండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ. 119.33 కోట్లతో నాలుగో స్థానం, ఆమిర్‌ఖాన్ రూ. 104.25 కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు. టాప్ 10లోని ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అక్షయ్ కుమార్ (రూ. 127.83 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ. 104.78 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 40 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 59 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 74.5 కోట్లు) ఉన్నారు. సెలబ్రిటీల ఆదాయంతోపాటు వారి ఖ్యాతినీ పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ప్రకటించారు. పన్ను చెల్లింపులకు ముందు ఉన్న సెలబ్రిటీల ఆదాయాన్ని, వారి ఖ్యాతి స్కోర్లను కలిపి ర్యాంకులను వెల్లడించారు.
రైతు నేత శరద్ జోషీ కన్నుమూతరైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శరద్ జోషీ (81) డిసెంబర్ 12న పుణెలో అనారోగ్యంతో కన్నుమూశారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా, జర్నలిస్ట్‌గా, వ్యవసాయదారుడిగా పేరుగడించిన జోషీ.. రైతులకు మద్దతు ధరపై దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. 1979లో రైతుల కోసం షేట్కారీ సంఘటన సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా రైతులను సంఘటితం చేశారు. ఆయన ఉల్లిరైతుల కోసం చేసిన ఉద్యమం అప్పట్లో ప్రభుత్వాల్ని కదిలించింది. మహారాష్ట్రకు చెందిన జోషీ 2004-10 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ, శివసేన మద్దతుతో రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్దేశంతో 1994లో స్వతంత్ర భారత్ అనే పార్టీని జోషీ స్థాపించారు. కేంద్ర వ్యవసాయ సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సేవలందించారు. షేట్కారీ మహిళా అగ్హదీని మహిళా హక్కుల కోసం పోరాడేందుకు స్థాపించారు.
ఐఎస్‌ఎస్‌కు తొలిసారి బ్రిటిష్ వ్యోమగామితొలిసారిగా బ్రిటిష్ దేశానికి చెందిన వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) బయలుదేరి వెళ్లాడు. రష్యా వ్యోమగామి యూరీ మాలెన్‌చెకో, అమెరికాకు చెందిన నాసా వ్యోమగామి టిమ్ కోప్రాలతో కలసి టిమ్ పీక్ అనే బ్రిటన్ పౌరుడు డిసెంబర్ 15న కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయూజ్ టీఎంఏ-19ఎం రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అక్కడ ఈయన ఆరునెలల పాటు గడపనున్నారు.
సీబీడీటీ కొత్త చైర్మన్‌గా ఏకే జైన్కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌గా ఏజే జైన్ నియమితులయ్యారు. ఈయన 1978 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారి. అనితా కపూర్ పదవీ విరమణ (నవంబర్ 30) తర్వాత నుంచి ఏకే జైన్ సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన రెండు నెలలపాటు మాత్రమే పదవిలో కొనసాగనున్నారు. ఇక అనితా కపూర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను సంస్కరణల సలహాదారుగా నియమితులయ్యారు.
అవార్డులుటీఎస్‌ఎస్పీడీసీఎల్‌కి ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డులువ్యాపార రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం విశేష కృషి చేసినందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)కి రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాలు వరించాయి. స్మార్‌ట మీటర్ల వినియోగంతో పాటు వినియోగదారులకు బిల్లుల జారీ కోసం ఐఆర్ మీటర్లను వినియోగిస్తూ ఆటోమెటిక్ స్పాట్ బిల్లింగ్ సేవలను అందిస్తున్నందుకు ఎస్పీడీసీఎల్ ఈ పురస్కారాలకు ఎంపికైంది. ఎస్పీడీసీఎల్ సీఎండీ డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ఈ అవార్డులను స్వీకరించారు.
టీఎస్‌పీఎస్సీకి స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ సదస్సులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డిసెంబర్ 11న ఈ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోచ్ సంస్థ ఈ అవార్డులు ఇస్తుంది. ఇదే సదస్సులో టీఎస్‌పీఎస్సీకి డిసెంబర్ 10న ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఐటీ విస్తరణ, సేవలు, డిజిటలైజేషన్, బయోమెట్రిక్ విధానాలు ప్రవేశపెట్టడం తదితర అంశాల్లో ఈ అవార్డులు లభించాయి.
ప్రభంజన్ యాదవ్‌కు పూలే పురస్కారం
‘ఎతిహాద్’కు వరల్డ్స్ లీడింగ్ ఎయిర్‌లైన్ అవార్డువరుసగా ఏడో ఏడాది కూడా ‘వరల్డ్ లీడింగ్ ఎయిర్‌లైన్ అవార్డు’ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ను వరించింది. దీంతో పాటుగా ‘వరల్డ్స్ లీడింగ్ ఫస్ట్‌క్లాస్’, ‘వరల్డ్స్ లీడింగ్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్’, ‘వరల్డ్స్ లీడింగ్ క్యాబిన్ క్రూ’ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. డిసెంబర్ 12న అబుదాబిలో జరిగిన వార్షిక ‘వరల్డ్ ట్రావెల్ అవార్డుల’ ప్రదానోత్సవ వేడుకలో వీటిని అందజేశారు.
జాతీయ ఇంధన పొదుపు అవార్డులుఇంధన పొదుపులో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో డిసెంబర్ 14న నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇంధన పొదుపులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ అవార్డులను అందచేశారు.
తెలంగాణకు వచ్చిన అవార్డులు
- డెయిరీ విభాగంలో ద్వితీయ బహుమతి - హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఉప్పల్ (హైదరాబాద్)
- ఫుడ్ ప్రాసెసింగ్‌లో ద్వితీయ బహుమతి - టాటా కాఫీ లిమిటెడ్, ఇన్‌స్టంట్‌కాఫీ డివిజన్, తూప్రాన్ యూనిట్ (మెదక్)
- జనరల్ కేటగిరీలో ద్వితీయ బహుమతి - దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట పంపింగ్ సెక్టర్ (సికింద్రాబాద్) నుంచి సోలంగుప్త
- మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ బీఈఈ స్టార్ లేబుల్డ్ అప్లియెన్స్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సుఫార్మర్) విభాగంలో ప్రథమ బహుమతి - తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) మెదక్
- కార్యాలయ భవనం విభాగంలో ప్రథమ బహుమతి - దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ సీ-టీఏఆర్‌ఏ బిల్డింగ్(సికింద్రాబాద్)
ఆంధ్రప్రదేశ్ అవార్డులు
- డెయిరీ విభాగంలో ప్రథమ బహుమతి - హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్(చిత్తూరు)
- విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్) విభాగంలో ప్రథమ బహుమతి - సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(చిత్తూరు)
- జనరల్ కేటగిరీలో ప్రథమ బహుమతి - గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(విశాఖ)
- స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్ విభాగంలో ప్రథమ బహుమతి - స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఎస్‌ఈసీఎం), ఇంధన శాఖ విభాగం, ఐఎండీఐ, (ఏపీ ప్రభుత్వం)
- బిజినెస్ మోడల్ విభాగంలో ప్రథమ బహుమతి - ఎస్పీడీసీఎల్(తిరుపతి)
- బిజినెస్ మోడల్ విభాగంలో ద్వితీయ బహుమతి - గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్

0 Comments