నల్గొండ జిల్లా
తెలంగాణ • భారతదేశం
నల్గొండ
అక్షాంశరేఖాంశాలు: 17°03′N 79°16′E / 17.05°N 79.27°Eకాలాంశంభాప్రాకా (గ్రీ.కా+5:30)విస్తీర్ణం14,240 కి.మీ² (5,498 చ.మై)ముఖ్య పట్టణమునల్గొండజనాభా
• జనసాంద్రత
• మగ
• ఆడ
• అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ34,83,648 (2011)
• 245/కి.మీ² (635/చ.మై)
• 1758061
• 1725587
• 57.84(2001)
• 70.19
• 45.07
నల్గొండ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రము నల్గొండ. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లామరియు వరంగల్ జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లామరియు పాక్షికముగా మహబూబ్ నగర్ జిల్లా , తూర్పున ఖమ్మం జిల్లా మరియు కృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా లు సరిహద్దులు. ఉద్యమాల పురుటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు[1], ప్రముఖ గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడుపులిజాల రంగారావు, ఆర్యసమాజ ప్రముఖుడునూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.
జిల్లా చరిత్ర
తెలంగాణ*వేదిక
శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్లగొండగా మారింది. నల్లగొండ జిల్లాపోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు.
భౌగోళిక స్వరూపం
జిల్లాలోని రెండు ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు:నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరియు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు.
నదులు
కృష్ణా నదిమూసీ నదిఆలేరుపెద్దవాగుదిండిపాలేరు
ఆర్ధిక స్థితి గతులు
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపేటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు
భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[2]. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య(Mandal Code).

1.బొమ్మలరామారం
2. తుర్కపల్లి
3. రాజాపేట
4. యాదగిరి గుట్ట
5. ఆలేరు
6. గుండాల
7. తిరుమలగిరి
8. తుంగతుర్తి
9. నూతనకల్లు
10. ఆత్మకూరు(S)
11.జాజిరెడ్డిగూడెం
12. శాలిగౌరారం
13. మోత్కూరు
14.ఆత్మకూరు(M)
15. వలిగొండ
16.భువనగిరి
17.బీబీనగర్
18.పోచంపల్లి
19.చౌటుప్పల్
20.రామన్నపేట
21. చిట్యాల
22.నార్కెట్‌పల్లి
23.కట్టంగూర్
24. నకిరేకల్
25. కేతేపల్లి
26.సూర్యాపేట
27.చివ్వెంల
28. మోతే
29.నడిగూడెం
30.మునగాల
31. పెన్‌పహాడ్
32. వేములపల్లి
33. తిప్పర్తి
34. నల్గొండ మండలం
35. మునుగోడు
36.నారాయణపూర్
37. మర్రిగూడ
38. చండూరు
39. కనగల్
40.నిడమానూరు
41. త్రిపురారం
42.మిర్యాలగూడ
43. గరిడేపల్లి
44. చిలుకూరు
45. కోదాడ
46.మేళ్లచెరువు
47.హుజూర్‌నగర్
48. మట్టంపల్లి
49. నేరేడుచర్ల
50. దామరచర్ల
51. అనుముల
52. పెద్దవూర
53.పెద్దఅడిశర్లపల్లి
54.గుర్రమ్‌పోడ్
55. నాంపల్లి
56. చింతపల్లి
57. దేవరకొండ
58. గుండ్లపల్లి
59.చందంపేట
రెవిన్యూ డివిజన్లు (4): నల్గొండ, సూర్యాపేట,మిర్యాలగూడ, భువనగిరిలోక్‌సభ స్థానాలు (2): భువనగిరి, నల్గొండశాసనసభ స్థానాలు (12): సూర్యాపేట, ఆలేరు,దేవరకొండ, తుంగతుర్తి, కోదాడ, మిర్యాలగూడ,
హుజూర్ నగర్, నకిరేకల్, నల్గొండ,నాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు.
రవాణా వ్వవస్థ
1.పగిడిపల్లి్-నడికుడి రైలుమార్గం 2.సికిందరాబాద్-వరంగల్-ఖమ్మం-విజయవాడ రైలుమార్గం
గ్రామ జనాభా
జనాభా లెక్కలు
1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్గొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగ వారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587. 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84 శాతం నమోదైంది. పురుషులలో 70.19శాతం స్త్రీలలో 45.07.
సంస్కృతి
పశుపక్ష్యాదులు
విద్యాసంస్థలు
జిల్లాలో 2007 లో మహత్మగాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడినది.
ఆకర్షణలు
యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ దేవస్థానం
వేమలకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం
భువనగిరి కోట
బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోనినాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నదిపొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ధి చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. వాడపల్లి తీర్థం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ఇది కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం.
బుద్ధుడి శిల్పం
హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.
ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.
నాగార్జున కొండ
మానవ నిర్మిత సరస్సు మధ్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.
129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
యాదగిరిగుట్ట
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండ లోని భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉన్నది. యాదర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కథనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
చంద్రవంక జలపాతము
ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.
ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.
నందికొండ
నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.
పోచంపల్లి
1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పిల్లలమర్రి
ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.
కొలనుపాక
ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్దం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఇంకా కొన్ని ప్రముఖ ప్రాంతాలు : రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి,భోంగిర్ ఫోర్ట్,మటంపల్లి,వడపల్లి,పంగల్,సుంకిశాల,

0 Comments