Ticker posts

9/recent/ticker-posts

19th February current affairs (25th February 2016

అంతర్జాతీయంభారత్‌లో ‘ఎఫ్-16’ తయారీకి సిద్ధం అమెరికాకు చెందిన యుద్ధవిమానాల తయారీ సంస్థ లకీద్ మార్టిన్.. భారత్‌లో ‘ఎఫ్-16’ ఫైటర్ విమానాల తయారీకి సిద్ధమని ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సింగపూర్‌లో జరుగుతున్న ఎయిర్ షోలో లకీద్ మార్టిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షా తెలిపారు. భారత్‌లో‘ఎఫ్-16’ తయారీ దిశగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు మద్దతు పలుకుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

సిరియాలో కారుబాంబుల దాడిలో 87 మంది మృతిసిరియాలోని హామ్స్ నగరం, డమాస్కస్ శివారులోని ఓ ప్రార్థనా మందిరం దగ్గర ఫిబ్రవరి 21న వేర్వేరు కారుబాంబుల దాడిలో 87 మంది మృతి చెందారు. హామ్స్‌లోని ఆల్-జహ్రనా జిల్లాలో జరిగిన దాడిలో 57 మంది మృతి చెందగా, సయిదా జినాబ్‌లో జరిగిన దాడిలో 30 మంది చనిపోయారు.

ప్రపంచంలో సౌరశక్తితో నడిచే తొలి పార్లమెంటుCurrent Affirs ప్రపంచంలో పూర్తి సౌరశక్తితో నడిచే మొట్టమొదటి పార్లమెంటుగా పాకిస్తాన్ పార్లమెంటు నిలిచింది. చైనా సహాయంతో 55 మిలియన్ డాలర్ల వ్యయంతో పాకిస్తాన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఫిబ్రవరి 23న రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సోలార్ పవర్‌తో నడిచే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. పాకిస్తాన్, చైనా మధ్య స్నేహానికి ఈ ప్రాజెక్టు మరో నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ద్వైపాక్షికంనేపాల్‌తో భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలుCurrent Affirs భారత్-నేపాల్‌ల మధ్య రవాణా, విద్యుత్ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి తొమ్మిది అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 20న ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ నుంచి నేపాల్‌కు 80 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసే 400 కేవీ ధాల్కేబార్-ముజఫర్‌పూర్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను ఇద్దరూ జాతికి అంకితం చేశారు. ప్రధానితో భేటీకి ముందు ఓలీతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్‌కు గతంలో ప్రకటించిన 100 కోట్ల డాలర్లలో భాగంగా 25 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం విడుదల, భారత్‌తో సరిహద్దుగల తెరాయ్ ప్రాంతంలో 518 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి, నేపాల్ బంగ్లాదేశ్‌ల మధ్య విశాఖపట్నం పోర్టు ద్వారా వర్తకం. విశాఖపట్నం నుంచి రైలు రవాణా మార్గం మొదలైన అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

జాతీయంగురుత్వాకర్షణ తరంగాల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు ఏర్పాటు చేయనున్న లిగో (లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 17న ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన లిగో ప్రయోగశాల సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా

శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ప్రారంభంశ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని డొంగర్‌గఢ్ బ్లాక్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని 300 గ్రామాలను పట్టణ వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. తొలి ఏడాది 100 కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. దీని కోసం రానున్న మూడేళ్లలో రూ.5000 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నారు. పురా పథకం స్థానంలో కేంద్రం కొత్తగా రూర్బన్ మిషన్‌ను ప్రవేశపెట్టింది.

207 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరాలిజాతీయ భావన పెంచేందుకు దేశంలోని 46 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ యూనివర్సిటీల వీసీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతోంది. అయితే.. అన్ని చోట్లా దీని ఎత్తు సమానంగా ఉండాలని నిర్ణయించారు. 2012 యూజీసీ చట్టం (వర్సిటీల్లో సమానత్వ భావన పెంచటం, ఎస్సీ, ఎస్టీల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించటం) అమలుపై చర్చించారు.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి: ఐదుగురు జావాన్లు మృతిజమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఫిబ్రవరి 20న శ్రీనగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలోని పాంపోర్‌లో శ్రీనగర్-జమ్మూ హైవేలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లను, ఒక పౌరుణ్ని బలితీసుకున్నారు. కాల్పుల తర్వాత మిలిటెంట్లు పక్కనే ఉన్న ప్రభుత్వ భవనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఈడీఐ)లోకి చొరబడ్డారు. ఈ ఆపరేషన్లో ఫిబ్రవరి 21న మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జాట్‌ల రిజర్వేషన్‌పై కేంద్ర కమిటీఓబీసీల్లో చేర్చాలంటూ హరియాణాలో జాట్ వర్గీయులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో.. వారి రిజర్వేషన్ల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 21న ప్రకటించారు. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కోరుతున్న జాట్‌ల డిమాండ్‌ను పరిశీలించి, ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. వెంకయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ ఉపాధ్యక్షులు సత్పాల్ మాలిక్, అవినాశ్ రాయ్ ఖన్నా సభ్యులుగా ఉంటారు. నివేదికను కమిటీ ప్రభుత్వానికి, అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అందజేస్తుంది.

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోయిన విజయకాంత్Current Affirs తమిళనాడు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత అర్హతను డీఎండీకే అధినేత విజయకాంత్ కోల్పోయారు. ఆ పార్టీకి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఫిబ్రవరి 21న ప్రకటించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోటీచేసిన డీఎండీకే 29 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా విజయ్‌కాంత్ ఎదిగారు. ఇప్పటివరకు డీఎండీకేకు 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వీరిలో అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్న 8 మంది ఎమ్యేల్యేలు ఫిబ్రవరి 21న తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాల్ని ఆమోదించిన స్పీకర్.. డీఎండీకే ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయినట్లు ప్రకటించారు.

పాస్‌పోర్టుల జారీలో మూడో స్థానంలో భారత్పాస్‌పోర్టుల జారీలో భారత్ మూడోస్థానంలో ఉందని విదేశీ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, చీఫ్ పాస్‌పోర్టు అధికారి ముక్తేశ్ పరదేశీ ఫిబ్రవరి 22న పేర్కొన్నారు. మొదటి రెండు స్థానాల్లో చైనా, యూఎస్‌లు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కంటే 2010 నుంచి రెట్టింపు స్థాయిలో పాస్‌పోర్టు జారీ చేసినట్లు చెప్పారు. ఐదేళ్ల క్రితం సంవత్సరానికి 60 లక్షల పాస్‌పోర్టులు అందజేయగా, ప్రస్తుతం 1.2 కోట్ల మందికి జారీ చేస్తున్నట్లు ముక్తేశ్ వివరించారు. 

వాయు కాలుష్యంలో చైనాను దాటిన భారత్వాయుకాలుష్యంలో భారత్ చైనాను దాటిపోయిందని గ్రీన్‌పీస్ ఇండియా వెల్లడించింది. 21వ శతాబ్దంలో మొదటిసారిగా 2015 సంవత్సరంలో వాయుకాలుష్యం స్థాయి చైనా కంటే భారత్‌లో ఎక్కువగా నమోదైందని గ్రీన్‌పీస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం అందించిన సమాచారం ప్రకారం భారత్‌లో కాలుష్యం పెరిగినట్లు వెల్లడించింది. అత్యధిక కాలుష్య నగరాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని గ్రీన్‌పీస్ పేర్కొంది.

రాష్ట్రీయంఅమరావతిలో అమృత వైద్య విశ్వవిద్యాలయంCurrent Affirs అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్టు ముందుకొచ్చింది. ఈ మేరకు ట్రస్టు ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని కలసి చర్చించారు. రూ.2,500 కోట్ల వ్యయంతో 2,250 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్- హెల్త్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణకు మరో 22,817 ఇళ్లుకేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ తెలంగాణకు మరో 22,817 ఇళ్లను మంజూరు చేసింది. తెలంగాణలోని 45 పట్టణాలు, నగరాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. 

విశాఖలో సమీర్ కేంద్రానికి శంకుస్థాపనవిశాఖపట్నంలో విద్యుదయస్కాంత తరంగాల అధ్యయన, పరిశోధన సంస్థకు (సమీర్) కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫిబ్రవరి 18న శంకుస్థాపన చేశారు. దీన్ని రూ.80.02 కోట్ల వ్యయంతో విశాఖ శివారులోని గంభీరం ఐటీ ఆర్థిక మండలిలో ఏర్పాటు చేయనున్నారు.

ఏపీ ఆర్థిక సలహాదారుగా కె. నరసింహమూర్తిఏపీ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా ప్రముఖ కాస్ట్ అకౌటింగ్ నిపుణులు కె. నరసింహమూర్తి ఎంపికయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం మూర్తి ఏపీ ఫిస్కల్ మేనేజ్‌మెంట్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు.

విశాఖలో పెట్రోలియం వర్సిటీఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంటో పెట్రోలియం యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన నిబంధన ప్రకారం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) పేరుతో జాతీయస్థాయి విద్యాసంస్థను నెలకొల్పుతున్నట్టుగా భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు 9.2 శాతంతెలంగాణ రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. రాష్ట్ర స్థూలోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ. 5,83,117 కోట్లకు చేరుకుంది. తలసరి ఆదాయం రూ. 1.43 లక్షలకు పెరిగింది. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరపు జీఎస్‌డీపీ అంచనా గణాంకాలను రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఫిబ్రవరి 23న వెల్లడించింది. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ గణాంకాల నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జీఎస్‌డీపీని లెక్కించటం ఇదే మొదటిసారి. గతేడాది వరకు 2004-05 స్థిరధరలను ప్రామాణికంగా తీసుకుని జీఎస్‌డీపీని లెక్కించారు. ఈసారి 2011-12 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. జీఎస్‌డీపీలో అత్యధిక వాటా రియల్ ఎస్టేట్ రంగానిదే. గత ఏడాది జీఎస్‌డీపీలో 19.3 శాతం వాటా పంచుకున్న ఈ విభాగం ఈసారి 20.1 శాతానికి పెరిగింది. తయారీ రంగం 15.1 శాతం, ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసులు 11.2 శాతం, నిర్మాణ రంగం 5.8 శాతం, ఫైనాన్స్ సర్వీసెస్ 6.8 శాతం, మైనింగ్, క్వారీయింగ్ 4.2 శాతం వాటాలు నమోదు చేశాయి.

భారత్‌లో నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్దేశంలో మెరుగైన జీవనం సాగించేందుకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ విడుదల చేసిన ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016’ సర్వే వెల్లడించింది. ఈ నగరంలో సామాన్యుడు మనుగడ సాగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేల్చింది. హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలోని పుణె, ముంబై, దేశ రాజధాని ఢిల్లీ నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 230 పెద్ద నగరాలను ఎంపిక చేసుకుని... అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య సమస్యలు, ప్రజాసేవలు, వినోద సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేసినట్లు మెర్సర్ సంస్థ ప్రకటించింది. ఈ సర్వేలో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోని నగరాల్లో సింగపూర్ 26వ స్థానంతో అన్నింటికన్నా పైన నిలిచింది.

ఆర్థికంజీఎస్‌టీ కమిటీ చైర్మన్‌గా అమిత్ మిత్రాCurrent Affirs వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)పై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ నూతన చైర్మన్‌గా పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఫిబ్రవరి 19న ఎంపికయ్యారు. దీని చైర్మన్‌గా ఉన్న కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2015 నవంబర్‌లో పదవి నుంచి తప్పుకున్నారు. మిత్రా ఆర్థికవేత్తగా సుపరిచితులు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. 2011లో రాజకీయాల్లో చేరిన ఆయన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమలుకోసం నిబంధనలను రూపొందించడం లక్ష్యంగా జీఎస్‌టీ కమిటీ పనిచేస్తుంది.

స్టార్టప్‌లకు 700 మిలియన్ డాలర్లురాబోయే ఏడాది కాలంలో 130 దేశీయ స్టార్టప్ కంపెనీలు సుమారు 700 మిలియన్ డాలర్లను సమీకరించనున్నాయి. అలాగే 5,000లకు పైగా ఉద్యోగాలను కల్పించనున్నాయి. ఈ మేరకు ఇన్నోవెన్ క్యాపిటల్ సంస్థ ‘ఇండియా స్టార్టప్ అవుట్‌లుక్ 2016’ పేరిట రూపొందించిన నివేదికలో పేర్కొంది.

పోస్టల్ చెల్లింపు బ్యాంకుకు పీఐబీ ఆమోదంఇండియా పోస్ట్ రూ.800 కోట్లతో ఏర్పాటు చేయాలనుకుంటున్న చెల్లింపు బ్యాంకు ప్రతిపాదనకు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (పీఐబీ) ఆమోదం తెలిపింది. మరో నెల రోజుల్లో ఈ ప్రతిపాదన తుది ఆమోదం కోసం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉందని పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారొకరు తెలిపారు.

2016 - 2017ల్లో భారత్ వృద్ధి 7.5 శాతం: మూడీస్భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2016, 2017 సంవత్సరాల్లో 7.5 శాతం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడీస్ ఫిబ్రవరి 18న విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. ప్రభుత్వ ఆదాయా-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటును 2017 జీడీపీలో 3.5 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం తన వ్యయాల్ని తగ్గించుకునే అవకాశముందని సంస్థ విశ్లేషించింది. ఇదిలా ఉండగా 2016-17లో భారత్ వృద్ధి 7.4 శాతంగా ఉండవచ్చని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అంచనావేసింది. మూడు నెలల క్రితం అంచనా 7.3 శాతం కాగా దీనిని తాజాగా సంస్థ సవరించి పెంచింది. సంవత్సరాల పరంగా చూస్తే 2016లో 7.4 శాతం, 2017లో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. చైనా వృద్ధి రేట్లను ఈ రెండేళ్లలో వరుసగా 6.5 శాతం, 6.2 శాతంగా పేర్కొంది.

కార్డుతో చెల్లింపులపై సర్‌చార్జీలు రద్దుక్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా, ఇంటర్నెట్ ద్వారాను జరిపే చెల్లింపులపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ ఫిబ్రవరి 24న ఆమోదించింది. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

సైన్స్ అండ్ టెక్నాలజీఅంతరిక్ష విహారం కోసం నాసాకు 18,300 మంది దరఖాస్తుCurrent Affirs వ్యోమగాములుగా తమను ఎంచుకోవాలంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు 18,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య 2012లో వచ్చిన దరఖాస్తుల కంటే మూడు రెట్లు ఎక్కువని నాసా అధికారులు పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నైపుణ్యం ఉన్న 8-14 మందిని ఎంపిక చేయనున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్ తెలిపారు.

స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష నిర్వహించిన ఇస్రోభారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు తోడ్పడే క్రయోజెనిక్ ఇంజన్ పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 19న విజయవంతంగా పూర్తి చేసింది. మహేంద్రగిరి (తమిళనాడు)లోని ప్రొపల్షన్ సముదాయంలో క్రయోజెనిక్ ఇంజన్‌కు 640 సెకన్ల పాటు ఉష్ణ పరీక్షను నిర్వహించారు.

వార్తల్లో వ్యక్తులుఅరుణాచల్ ప్రదేశ్ సీఎంగా కలిఖో పుల్ Current Affirs అరుణాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా కలిఖో పుల్ ఫిబ్రవరి 19న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఎత్తేయాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించటంతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 60 మంది సభ్యులు గల శాసనసభలో బీజేపీ సభ్యులతో కలుపుకొని మొత్తం 31 మంది మద్దతుతో కలిఖో పుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఐరాస మాజీ ప్రధాన కార్యద ర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ మృతిఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యద ర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (93) ఫిబ్రవరి 16న కైరోలో మరణించారు. ఆయన 1992 నుంచి 1996 మధ్య ఐరాస ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆఫ్రికా నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఘలీ గుర్తింపు పొందారు.

సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అబ్దుల్ రషీద్‌ఖాన్ మృతిప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్‌ఖాన్ (107) కోల్‌కతాలో ఫిబ్రవరి 18న మరణించారు. తాన్‌సేన్ వంశస్థుడైన ఉస్తాద్ 107 ఏళ్ల వయసులో కూడా గీతాలను ఆలపించారు. రసన్ పియా కలం పేరుతో రెండు వేల కవితలు రాశారు. ఆయనకు పద్మభూషణ్, సంగీత, నాటక అకాడెమీ అవార్డులు లభించాయి.

లిమ్కా బుక్‌లో సచిన్ పుస్తకంమాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పెద్దల విభాగంలో భారత దేశంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా రికార్డులకెక్కింది. మొత్తం లక్షా 50 వేల 289 కాపీల ఆర్డర్‌ను ఈ పుస్తకం సొంతం చేసుకుంది. 6 నవంబర్ 2014న ఈ పుస్తకం విడుదలైంది. 

కౌలాలంపూర్ పోలీస్ చీఫ్‌గా భారత సంతతి వ్యక్తిభారత సంతతికి చెందిన అమర్‌సింగ్ కౌలాలంపూర్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. మలేసియాలో ఓ సిక్కు వ్యక్తి సాధించిన అత్యున్నత పోలీస్ పదవి ఇదే. సీఐడీ విభాగానికి బదిలీ అయిన తాజుద్దీన్ మహ్మద్ స్థానంలో అమర్‌సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అమర్‌సింగ్ గతంలో సీఐడీ డిప్యూటీ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అమర్‌సింగ్ కుటుంబానిది భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ నుంచి మలేసియా వెళ్లిన అమర్‌సింగ్ తండ్రి ఇషార్‌సింగ్ 1939లో అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.

మూడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలుమేఘాలయ, కర్ణాటక, ఒడిశా రాష్ట్ర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను కేంద్ర న్యాయ శాఖ నియమించింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సుబ్రో కమల్ ముఖర్జీని అదే కోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కర్ణాటక హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ వినీత్ సరన్‌ను ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

అవార్డులుటేలర్ స్విఫ్ట్‌కు గ్రామీ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు58వ గ్రామీ సంగీత అవార్డుల్లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పాప్ సంగీత గాయని టేలర్ స్విఫ్ట్ దక్కించుకున్నారు. ఆమె ఆల్బమ్ 1989కు ఈ అవార్డు లభించింది. 2014లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బమ్‌గా 1989 నిలిచింది. ర్యాప్ గాయకుడు కెండ్రిక్ ల్యామర్ అత్యధికంగా ఐదు అవార్డులను దక్కించుకొన్నారు. ఫిబ్రవరి 15న లాస్‌ఏంజెలస్‌లో ఈ అవార్డులను ప్రధానం చేశారు.

ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలకు జియోసైన్స్ అవార్డుజియోఫిజిక్స్‌లో చేసిన విశేష పరిశోధనలకు హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు అరుదైన అవార్డులు లభించాయి. 2014 సంవత్సరానికి డాక్టర్ సింహాచలం పదే, డాక్టర్ సందీప్‌గుప్తాలు జాతీయ జియోసైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. భూ నిర్మాణంపై నిర్వహిస్తున్న పరిశోధనకు డాక్టర్ సింహాచలాన్ని, భూకంపాలు సంభవించినప్పుడు వచ్చే శబ్దాలను గుర్తించినందుకు సందీప్ గుప్తాను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఇండియా ఆస్ట్రేలియా స్టార్టజిక్ రీసెర్చ్‌లో ఇతను కీలక శాస్త్రవేత్త. 

మలయాళం సినిమాకు అంతర్జాతీయ అవార్డుCurrent Affirs ఇప్పటికే జాతీయ అవార్డు అందుకున్న మలయాళం సినిమా ‘ఒత్తాళ్’ బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ బాలల సినిమా అవార్డును (క్రిస్టల్ బేర్ అవార్డ్) గెలుచుకుంది. జయరాజ్ రాజశేఖరన్ నాయర్ ఈ సినిమా దర్శకుడు. సుప్రసిద్ధ ర ష్యన్ రచయిత ఆంటన్ చెహోవ్ రాసిన ఓ కథానికను ఒత్తాళ్ పేరుతో ఆయన తెరకెక్కించారు. ఓ వృద్ధ జాలరి, అతని మనవడు ఎదుర్కొన్న ఆటుపోట్లే సినిమా కథాంశం.

క్రీడలుమయూఖా జానీకి స్వర్ణంఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మయూఖా జానీ (మహిళల లాంగ్‌జంప్) స్వర్ణపతకం గెలుచుకొంది. మయూఖా 6.35 మీటర్ల దూరం దూకి తొలిస్థానంలో నిలిచింది. దీంతో ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల లాంగ్‌జంప్ విభాగంలో భారత్ నుంచి స్వర్ణం నెగ్గిన తొలి అథ్లెటిక్‌గా రికార్కుకెక్కింది.

టెస్టుల్లో మెకల్లమ్ ఫాస్టెస్ట్ సెంచరీCurrent Affirs అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్ చరిత్రలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ 54 బంతుల్లో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మెకల్లమ్ ఫిబ్రవరి 20న ఆస్ట్రేలియాతో క్రైస్ట్‌చర్చ్ జరిగిన రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో చెలరేగి ఆడి వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో), మిస్బా ఉల్ హక్ (56 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 

హాకీ ఇండియా లీగ్ చాంపియన్‌గా పంజాబ్హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్ విజేతగా పంజాబ్ నిలిచింది. రాంచీలో ఫిబ్రవరి 20న జరిగిన ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ను పంజాబ్ ఓడించింది. చాంపియన్ పంజాబ్‌కు రూ. 2.50 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన కళింగ జట్టుకు రూ.రూ.1.75 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది.

ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో చైనా... పురుషుల విభాగంలో ఇండోనేసియా విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 21న ముగిసిన ఈ ఈవెంట్‌లో మహిళల ఫైనల్లో చైనా 3-2తో జపాన్‌పై... పురుషుల ఫైనల్లో ఇండోనేసియా 3-2తో జపాన్‌పై విజయం సాధించాయి. పురుషుల విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత్‌కు కాంస్యం లభించింది.

భారత రెజ్లర్లకు 9 పతకాలుఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత కుస్తీ వీరులు తొమ్మిది పతకాలు సాధించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ (57 కేజీలు) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... ఓంప్రకాశ్ వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ప్రియాంక ఫోగట్ (55 కేజీలు) రజతం నెగ్గగా... వినేశ్ ఫోగట్ (53 కేజీలు), అనితా తోమర్ (63 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్‌దీప్ సింగ్ (98 కేజీలు), గౌరవ్ శర్మ (59 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) కాంస్య పతకాలు సంపాదించారు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు మెకల్లమ్ వీడ్కోలున్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ద్వారా మెకల్లమ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. 12 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో మెకల్లమ్ అరంగేట్రం నుంచి వరుసగా 101 టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి రిటైరయ్యాడు. టెస్టు కెరీర్‌లో 106 సిక్సర్లతో రికార్డు, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (54 బంతులు) రికార్డులు కెరీర్ చివరి టెస్టులో సాధించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక న్యూజిలాండ్ క్రికెటర్ కూడా మెకల్లమే. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మెకల్లమ్ 101 టెస్ట్‌లు, 260 వన్డేలు, 71 టి20లు ఆడాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు రెండు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు. 

టెస్టుల్లో నంబర్‌వన్ ఆస్ట్రేలియాఅంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు నంబర్‌వన్‌గా నిలిచింది. ఫిబ్రవరి 24న న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా 112 పాయింట్లతో భారత్ (110)ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. 2014 తర్వాత ఆసీస్ మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates