Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయంటిబెట్ ప్రధాన మంత్రిగా లోబ్సంగ్ సాంగేCurrent Affirs టిబెట్ ప్రధాన మంత్రిగా న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త లోబ్సంగ్ సాంగే ఏప్రిల్ 27న తిరిగి ఎన్నికయ్యారు. ధర్మశాల నుంచి పాలన సాగుతున్న టిబెట్‌కు సాంగే తొలిసారి 2011 ఆగస్టులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 

పపువా న్యూగినియాలో రాష్ట్రపతి పర్యటనభారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 28 నుంచి 2 రోజుల పాటు పపువా న్యూగినియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి పీటెర్ ఓ నీల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఆ దేశంలో చమురు, సహజ వాయువుల వెలికితీత, అభివృద్ధిలో సహకరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ ఆ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 100 మిలియన్ డాలర్ల రుణం, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు మందులు అందజేసేందుకు అంగీకరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 209 మిలియన్ డాలర్లుగా ఉంది. పపువా అతిపెద్ద పసిఫిక్ ఐలాండ్ దేశం. ఆ దేశ జనాభా 7.1 మిలియన్లు. విస్తీర్ణం 462.840 చ.కి.మీ. ఈ దేశంలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. 

న్యూజిలాండ్ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏప్రిల్ 30న న్యూజిలాండ్ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక సంప్రదాయం ప్రకారం మవోరీ తెగ అధిపతితో, ఆయన భార్యతో పరస్పరం ముక్కు రాసుకున్నారు. ముక్కు రాసుకునే సంప్రదాయాన్ని ‘హోంగీ’గా పిలుస్తారు. దీని వల్ల శ్వాస మార్పిడి జరిగి, రెండు మనసులు కలుస్తాయని విశ్వాసం. న్యూజిలాండ్ మూలవాసులైన మవోరీలు క్రీ.శ. 1280లో అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. స్వాగతం తర్వాత ప్రణబ్.. గవర్నర్ జనరల్ మట్‌పరే భేటీ అయ్యారు. మే 1న ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

జాతీయం‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ ప్రారంభంCurrent Affirs దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను ప్రధాని నరేంద్రమోదీ మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద.. వచ్చే మూడేళ్లలో ఐదు కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.8,000 కోట్లు ఖర్చుచేస్తుంది. వారణాసిలో జరిగిన మరో కార్యక్రమంలో ప్రధాని 11,000 మంది లబ్ధిదారులకు ఇ-రిక్షాలను పంపిణీ చేశారు. గంగా నదిలో బోట్లు నడిపేవారికి సోలార్ విద్యుత్‌తో నడిచే 11 బోట్లను మోదీ అందించారు. 

ఠాగూర్ జయంతికి ఈజిప్ట్‌లో ఉత్సవాలురవీంద్రనాథ్ ఠాగూర్ 155వ జయంతి సందర్భంగా ఈజిప్టులో సాంస్కృతికోత్సవాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను ఏర్పరిచేందుకు ఈ వేడుకలను జరపనుంది. మే 8 నుంచి 12 వరకు ఉత్సవాలు జరుగుతాయి. కైరోలో భారత రాయబార కార్యాలయం, మౌలానా ఆజాద్ భారత సాంస్కృతిక కేంద్రాలు సంయుక్తంగా వేడుకలను నిర్వహిస్తాయి. ఠాగూర్ రచనల్లో గీతాంజలితో పాటు అనేక ఇతర కావ్యాలను అరబిక్ లోకి అనువదించారు. ఆయన రచనలు ఈజిప్టులో మంచి గుర్తింపు పొందాయి. నైలు నది, ఈజిప్టు ప్రజల నాగరికతల మధ్యనున్న బంధం గురించి కూడా ఠాగూర్ రచనలు చేశారు. 

ఎంపీ పదవికి విజయ్ మాల్యా రాజీనామాకింగ్‌ఫిషర్ మాజీ అధిపతి, ఎంపీ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఆయన పంపిన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆమోదించారు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఈమేరకు మే 4న రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని చెప్పారు. నిబంధనల ప్రకారం లేదంటూ మాల్యా తొలుత పంపిన రాజీనామా లేఖను అన్సారీ మే 3న తిరస్కరించారు. దీంతో మాల్యా తాను సంతకం చేసిన రాజీనామాను మరోసారి పంపారు. మాల్యా సభ్యత్వాన్ని తక్షణమే బహిష్కరించాలంటూ రాజ్యసభ నైతిక విలువల కమిటీ కూడా తన సిఫార్సును మే 4న నివేదించింది. మాల్యా తొలుత పంపిన లేఖతోసహా మొత్తం వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకొని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రీయంకాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన కేసీఆర్గోదావరి నదిపై నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద మే 2న భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18,19,550 ఎకరాలకు నీరందుతుంది. 185 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు. ఇందుకు రూ. 69,581.33 కోట్లు ఖర్చు చేస్తారు.

తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ మండలి ఏర్పాటుపశు సంవర్థక శాఖ మంత్రి చైర్మన్‌గా.. సినీనటి, బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ మండలిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, చెన్నైకి చెందిన భారత జంతు సంక్షేమ మండలి చైర్మన్ సహా 13 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. సభ్య కన్వీనర్‌గా పశుసంవర్థక శాఖ డెరైక్టర్ ఉంటారు. అనధికారిక సభ్యుల్లో అమలతో పాటు స్వామి స్వయం భగవాన్‌దాస్, వైల్డ్‌లైఫ్ ప్రచార మేనేజర్ సి.సంయుక్త, జంతు సంక్షేమ ఉద్యమకారుడు శ్యాంసుందర్ అగర్వాల్, పీలా రామకృష్ణ మెమోరియల్ జీవరక్ష సంఘానికి చెందిన సతీష్ ఖండేవాల్ తదితరులున్నారు. మొత్తం 21 మందితో ఏర్పాటైన మండలి... పీసీఏ చట్టం-1960ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. 

ఏపీ, టీఎస్ ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్Current Affirs ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ జోసెఫ్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా రాష్ట్రపతికి సిఫార్సులు పంపింది. కాగా ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది.

ఆర్థికంఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.8 శాతానికి పెంపుCurrent Affirs ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతూ ఏప్రిల్ 29న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈపీఎఫ్‌పై మార్చి నుంచి మూడుసార్లు తన నిర్ణయాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్‌పై పన్ను విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం.. నిరసనల నేపథ్యంలో విరమించుకుంది. ఎంప్లాయిర్ వాటా నిధులను 58 ఏళ్ల తర్వాతే ఉద్యోగి పొందేలా తీసుకున్న నిర్ణయాన్నీ మార్చుకుంది. తాజాగా ఈపీఎఫ్‌పై 8.7 శాతమే వడ్డీ చెల్లిస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. 2015-16కు పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదించగా ఆర్థిక శాఖ తిరస్కరించడంతో చివరకు 8.7 శాతంగానే నిర్ణయించారు. దీనిపై కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒత్తిడి పెరగడంతో కేంద్రం నిర్ణయం మార్చుకుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి విజయవంతం
Current Affirs భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఏడో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్(ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)-1జి ఉపగ్ర హాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 28న విజయవంతంగా ప్రయోగించింది. 1,425 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ33 ద్వారా భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కిలోమీటర్లు, దూరంగా (అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు.
  • మొదటి దశలో చేపట్టిన ఏడు నావిగేషన్ ఉపగ్రహాల్లో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి చివరిది. ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. భారత దిక్సూచి వ్యవస్థ ద్వారా సరిహద్దు నుంచి 1,500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సౌకర్యం కల్పించవచ్చు. ఇది విమానాలు, ఓడల గమనాన్ని తెలపడంలో తోడ్పడుతుంది. వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. విపత్తుల సమయంలో బాధితులకు సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ సదుపాయాన్ని సైనిక అవసరాలకు, క్షిపణి సంబంధ అవస రాలకు వినియోగించుకుంటారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుసంధానం చేయొచ్చు. 2016 చివరికి దిక్సూచి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • దిక్సూచి వ్యవస్థ.. నావిక్: భారత దిక్సూచి వ్యవస్థకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టలేషన్)గా నామకరణం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి వ్యవస్థలు అమెరికా జీపీఎస్ పేరుతో, రష్యా గోనాస్, ఐరోపా గెలీలియో, చైనా బేయ్‌డోవ్, జపాన్ క్వాసీ జెనిత్ పేర్లతో కలిగి ఉన్నాయి. ఈ దేశాలు ఒక్కోటి 28-35 నావిగేషన్ ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. భారత్.. అమెరికా జీపీఎస్ సేవలను వినియోగించుకుంటోంది.

అతిపెద్ద మానవరహిత నౌకను పరీక్షించిన యూఎస్ మిలటరీప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను యూఎస్ మిలటరీ పరీక్షించింది. ఈ మేరకు పెంటగాన్‌లో మే 3న ఈ మానవరహిత నౌకను ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. కాగా నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్ డియాగో తీరంలో పరీక్షించనున్నారు. 

వార్తల్లో వ్యక్తులుపపంచ టాప్-10 వేతన సీఈఓల్లో భారతీయులు
Current Affirs ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పదిమంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి 8వ స్థానంలో, ల్యాండెల్‌బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ 6వ స్థానంలో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వందమంది జాబితాలో భారత సంతతి వ్యక్తి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. వివరాలు..
  • రసాయనాల కంపెనీ ల్యాండెల్‌బాసెల్ ఇండస్ట్రీస్ సీఈఓ భవేశ్ వి. పటేల్ 2.45 కోట్ల డాలర్ల వేతనంతో ఆరవ స్థానంలో ఉన్నారు.
  • 2.22 కోట్ల డాలర్ల వేతనంతో పెప్సికో ఇంద్రా నూయికి ఎనిమిదవ స్థానం లభించింది.
  • మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 26వ స్థానంలో ఉన్నారు. ఆయన వేతనం 1.83 కోట్ల డాలర్లు.
  • ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన మార్క్ వి. హర్డ్, సఫ్ర ఏ కాట్జ్‌లు 5.32 కోట్ల డాలర్ల వేతనాలతో మొదటి స్థానంలో నిలిచారు.
  • వాల్ట్ డిస్ని రాబర్ట్ ఏ ఐగర్ 4.35 కోట్ల డాలర్ల వేతనంతో రెండో స్థానంలో ఉండగా, హనీవెల్ ఇంటర్నేషనల్ సీఈఓ డేవిడ్ ఎం. కోట్ 3.31 కోట్ల డాలర్ల వేతనంతో మూడో స్థానంలో, జనరల్ ఎలక్ట్రిక్ చీఫ్ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్ 2.64 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

ఐరాస యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా రాధా కుమార్ఐక్యరాజ్య సమితి (ఐరాస) యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఢిల్లీ పాలసీ గ్రూప్ డెరైక్టర్ జనరల్ రాధా కుమార్ నియమితులయ్యారు. ఆమెతో సహా 12 మందిని ఈ పదవిలో నియమిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఉత్తర్వులు జారీచేశారు. మే నెలలో వీరందరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీకాలం మూడు లేదా ఆరేళ్లు ఉంటుంది. యూనివర్సిటీ విధానాలను రూపొందించడం, దాని పాలనను పర్యవేక్షించడం, ద్వైవార్షిక బడ్జెట్‌ను పరిశీలించి, ఆమోదించడం వీరి విధులు. శాంతి పరిరక్షణలో రాధాకుమార్‌కు విశేషానుభవం ఉందని ఐరాస ఏప్రిల్ 28న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌పై భారత ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల సంప్రదింపుల బృందంలో ఆమె కూడా ఉన్నారని తెలిపింది.

భారత గుడ్‌విల్ అంబాసిడర్లుగా అభినవ్ బింద్రా, సచిన్రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి సుహృద్భావ రాయబారాలు (Goodwill Ambassadors)గా మేటి షూటర్ అభినవ్ బింద్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లను భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) నియమించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌లాగానే వివిధ రంగాలకు చెందిన మరికొంత మందిని కూడా రాయబారులుగా నియమించనున్నట్లు ఐఏఓ వెల్లడించింది.

‘జనసంఘ్’ మధోక్ కన్నుమూతభారతీయ జనతా పార్టీ మాతృసంస్థ అయిన భారతీయ జన సంఘ్ మాజీ అధ్యక్షుడు, ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు బలరాజ్ మధోక్(96) మే 2న న్యూఢిల్లీలో కన్నుమూశారు. మధోక్ 1920లో అవిభక్త కశ్మీర్‌లోని స్కార్దులో జన్మించారు. జన సంఘ్‌కు ముందు ఆరెస్సెస్‌లో పనిచేశారు. 1966లో ఆ సంస్థ అధ్యక్ష పదవి చేపట్టారు. భారతీయ జన సంఘ్ ఆయన సారథ్యంలో 1967 నాటి లోక్‌సభ ఎన్నికల్లో 35 సీట్లు గెలిచి సత్తా చాటింది. ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు తెరపైకి వచ్చాక ప్రాధాన్యం లేకుండా పోయింది. క్రమశిక్షణ రాహిత్యం పేరుతో 1973లో ఆయనను సంస్థ నుంచి బహిష్కరించారు కూడా. 

గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన బంగారు చొక్కాఅత్యంత విలువైన బంగారు చొక్కా కలిగిన మహారాష్ట్ర వ్యాపారి పంకజ్ పరఖ్(47)కు గిన్నీస్ బుక్‌లో చోటు లభించింది. ఈయన 2014లో తన 45వ పుట్టినరోజున రూ. 98,35,099 విలువ గల చొక్కాను తయారుచేయించారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన చొక్కా అంటూ గిన్నీస్ బుక్ వారు మే 3న పరఖ్‌కు సర్టిఫికెట్ ఇచ్చారు. వస్త్రాల వ్యాపారం చేసే పరఖ్ ముంబైకి 260 కి.మీ దూరంలో ఉన్న యోలా పట్టణానికి డిప్యూటీ మేయర్ కూడా. ఆయన చేయించుకున్న బంగారు చొక్కా బరువు 4.10 కిలోలు. దీని ప్రస్తుత విలువ కోటి ముప్పై లక్షలు. దీనితో పాటు బంగారు గడియారం, గోల్డ్ చైన్లు, ఉంగరాలు, బంగారు మొబైల్ కవర్, బంగారు కళ్లజోడు మొత్తం పది కిలోల బరువు కలిగిన వస్తువులు ఈయన దగ్గర ఉన్నాయి. వీటిని సంరక్షించడానికి లెసైన్స్‌డ్ రివాల్వర్‌తో పాటు ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు.

అవార్డులుఇద్దరు భారతీయులకు మంగోలియా అత్యున్నత పౌర పురస్కారంమంగోలియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘నార్త్ స్టార్’ను ఇద్దరు భారతీయ విద్యావేత్తలకు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలోని మంగోలియా దౌత్య కార్యాలయంలో ఏప్రిల్ 28న నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ విదేశాంగ మంత్రి లుండెగ్ పురేవ్‌సురెన్ ఈ అవార్డును భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) అధ్యక్షుడు లోకేశ్ చంద్ర, ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్ర మాజీ సలహాదారు మన్సూరా హైదర్‌లకు అందచేశారు. 

ఎన్‌కే సింగ్‌కు జపాన్ అవార్డుCurrent Affirs మాజీ ప్రభుత్వాధికారి, రాజకీయ నాయకుడు ఎన్‌కే సింగ్ జపాన్ ప్రభుత్వం అందజేసే ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కొనసాగడానికి చేసిన కృషికి గుర్తింపుగా సింగ్‌ను ‘ది ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు జపాన్ ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే చేతుల మీదుగా మే 10వ తేదీని సింగ్ ఈ అవార్డును అందుకుంటారు. జపాన్ రాజధాని టోక్యోలోగల ఇంపీరియల్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. జపాన్, ఇండియా మధ్య కుదిరిన మారుతి-సుజుకి వంటి అనేక అటోమొబైల్ ఒప్పందాల విషయంలో సింగ్ మధ్యవర్తిగా వ్యవహరించారు. గతంలో భారత ఆదాయ వ్యయాలశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా విధులు నిర్వర్తించిన సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఏపీ జెన్‌కోకు శ్రామికశక్తి అవార్డు‘మే డే’ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ(ఏపీ జెన్‌కో)కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కార్మిక సంక్షేమ అవార్డు(శ్రామిక శక్తి)ను అందజేసింది. మే 1న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జెన్‌కో డెరైక్టర్(థర్మల్) సుందర్‌సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలతో పాటు ఉత్పత్తి పెంపునకు చేసిన కృషికి గానూ కార్మిక శాఖ ఈ అవార్డు దక్కింది.

నీలా బెనర్జీకి ఎడ్గర్ ఏ పో అవార్డుఇండో-అమెరికన్ జర్నలిస్టు నీలా బెనర్జీ ప్రతిష్టాత్మకమైన ‘ఎడ్గర్ ఏ పో’ అవార్డును అందుకున్నారు. మే 1న వాషింగ్లన్‌లోని వైట్‌హౌస్‌లో జరిగిన కరెస్పాండెంట్ డిన్నర్‌లో ఒబామా దంపతులు నీలా బెనర్జీకి అవార్డును అందజేశారు. బెనర్జీ ప్రస్తుతం ‘ఇన్‌సైడ్ క్లైమేట్ న్యూస్’లో జర్నలిస్టుగా సేవలందిస్తున్నారు. జర్నలిజంలో అందించిన సేవలకు గుర్తింపుగా వైట్‌హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్ ఈ అవార్డుతో సత్కరించింది. ఇన్‌సైడ్ క్లైమేట్ న్యూస్‌లో చేరక ముందు లాస్‌ఏంజిలెస్ టైమ్స్‌లో రిపోర్టర్‌గా పనిచేశారు. ఇరాక్ యుద్ధం, గ్లోబల్ ఎనర్జీ వార్తలను కవర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. యేల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీని పూర్తి చేసిన నీలా.. వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కూడా మాస్కో కరస్పాండెంట్‌గా విధులు నిర్వహించారు.

‘హరితప్రియ’కు ఐక్యరాజ్య సమితి అవార్డురైతులకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నిర్ధిష్ట సమాచారాన్ని అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వినూత్నంగా ప్రారంభించిన సంక్షిప్త సమాచార వ్యవస్థ(SMS) ‘హరితప్రియ’కు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇ-అగ్రికల్చర్ విభాగంలో వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ(WSIS) 2016 ప్రైజ్‌కు ‘హరితప్రియ’ ఎంపికైంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్(ఐటీయూ) జెనీవాలో ప్రకటించింది. వ్యవసాయ క్షేత్రాల నుంచి వాతావరణ, భూ సమాచారాన్ని సేకరించి, శాస్త్రవేత్తలతో విశ్లేషించి రైతులకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించేందుకు ఏపీ వ్యవసాయ శాఖ, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) సాయంతో 2015లో ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో ప్రారంభించింది. అనంతపురం జిల్లాలోని కొత్తపేట, ధర్మాపురం గ్రామాల్లో 2015 జనవరి 4న ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ మెట్టభూముల పరిశోధనా సంస్థ(క్రిడా), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్), ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నాయి. 

క్రీడలువాడా జాబితాలో భారత్ స్థానం.. మూడు
2014లో డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఏప్రిల్ 27న విడుదల చేసిన జాబితాలో రష్యా మొదటి స్థానంలో, ఇటలీ రెండో స్థానంలో నిలిచాయి. భారత్ (96) మూడో స్థానంలో ఉంది. అథ్లెటిక్స్, బాడీబిల్డింగ్ క్రీడాకారులు డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఎక్కువగా ఉన్నారు. 

ఉమెన్స్ స్క్వాష్ వరల్డ్ చాంపియన్‌షిప్మహిళల స్క్వాష్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నౌర్ ఎల్ షెర్బినీ (ఈజిప్ట్) గెలుచుకుంది. కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్స్‌లో లౌరా మస్సారో(ఇంగ్లండ్)ను ఓడించింది. 

రోస్‌బర్గ్‌కు రష్యా గ్రాండ్ ప్రి టైటిల్మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములావన్ రష్యా గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. సోచి(రష్యా)లో మే1న జరిగిన రేసులో లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.

రైల్వేస్‌కు పురుషుల హాకీ చాంపియన్‌షిప్జాతీయ పురుషుల 6వ హాకీ చాంపియన్‌షి ప్‌ను రైల్వేస్ నిలబెట్టుకుంది. మే 1న సైఫైలో జరిగిన ఫైనల్స్‌లో పంజాబ్‌ను ఓడించింది. 

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌ను లీ చోంగ్ వీ (మలేషియా) గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను వాంగ్ యిహాన్ (చైనా) గెలుచుకుంది. ఫైనల్స్‌లో లీ గ్జురాయ్ (చైనా)ను ఓడించింది. 

టి20ల్లో 21 బంతుల్లోనే సెంచరీవెస్టిండీస్‌లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో బ్యాట్స్‌మన్ ఇరాఖ్ థామస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 21 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. టి20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. టొబాగో క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీలో స్కార్‌బారో తరఫున బరిలోకి దిగిన అతను, స్పీ సైడ్ టీమ్‌పై ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ ముగిసేసరికి 23 ఏళ్ల ఇరాఖ్ 31 బంతుల్లోనే 15 సిక్సర్లు, 5 ఫోర్లతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గతంలో ట్రినిడాడ్ జట్టులో అండర్-13 స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన అతను, జాతీయ అండర్-19 ప్రాబబుల్స్‌లో కూడా ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణేపై క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఇప్పుడు తెరమరుగైంది. 

ఈపీఎల్ చాంపియన్‌గా లీసెస్టర్ సిటీ క్లబ్ఏమాత్రం అంచనాలు లేని లీసెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్.. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) 2015-2016 సీజన్ చాంపియన్‌గా నిలిచింది. 132 ఏళ్ల చరిత్ర ఉన్న లీసెస్టర్ సిటీ క్లబ్ చరిత్రలో ఆ జట్టు ఈపీఎల్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. 24 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు విఖ్యాత ఆటగాళ్లు సభ్యులుగా ఉన్న ప్రముఖ జట్లే విజేతలుగా అవతరించాయి. ఈసారి ప్రీమియర్ లీగ్‌లో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉండగానే... ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా లీసెస్టర్ సిటీకి టైటిల్ ఖాయమైంది. ప్రస్తుతం 36 మ్యాచ్‌లు ఆడిన లీసెస్టర్ సిటీ 77 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టొటెన్‌హమ్ 70 పాయింట్లతో రెండో స్థానంలో, అర్సెనల్ 67 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 

‘ఖేల్త్న్ర’కు కోహ్లి పేరు సిఫారసుCurrent Affirs భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’కు బీసీసీఐ ప్రతిపాదించింది. అలాగే అర్జున అవార్డు కోసం అజింక్యా రహానే పేరును కూడా క్రీడా శాఖకు సిఫారసు చేసింది. ఒకవేళ ఖేల్త్న్ర కోహ్లిని వరిస్తే ఈ అవార్డును దక్కించుకున్న మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో సచిన్, ధోని అందుకున్నారు. ఖేల్త్న్రకు రూ.7.5 లక్షలు, అర్జునకు రూ.5 లక్షలు బహుమతిగా అందిస్తారు. ఈ పురస్కారం విషయంలో కోహ్లికి స్క్వాష్ చాంపియన్ దీపికా పళ్లికాల్, గోల్ఫర్ అనిర్బాన్ లాహిరి, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత షూటర్ జితూ రాయ్, రన్నర్ టింటూ లూకాలతో పోటీ ఎదురుకానుంది.

ఐసీసీ వార్షిక టీం ర్యాంకులుఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా (124) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ (113), దక్షిణాఫ్రికా (112) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2013-14 ఏడాదిలో ఫలితాలను పక్కనబెట్టి 2014-15లో జట్లు సాధించిన విజయాల్లో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వార్షిక ర్యాంక్‌లను కేటాయించారు. టి20 ర్యాంకింగ్స్‌లో భారత్, న్యూజిలాండ్ సమాన పాయింట్ల (132)తో నిలిచినా... దశాంశమానం (+0.21) తేడాతో టీమిండియా రెండో ర్యాంక్‌కు పడిపోయింది. 2016 టి20 చాంపియన్ వెస్టిండీస్ (122) మూడు రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ టాప్-10లో ఉన్నాయి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates