Ticker posts

9/recent/ticker-posts

Current affairs

అంతర్జాతీయంబాగ్దాద్ ఆత్మాహుతి పేలుళ్లలో 200 మంది మృతిCurrent Affairs ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జూలై 2న (అర్ధరాత్రి) ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 200 మంది మరణించగా, మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. దీంతోపాటు జూన్ 28న టర్కీలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందగా, 230 మందికిపైగా గాయపడ్డారు. 

హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో 105వ స్థానంలో భారత్హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. మొత్తం 130 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం సందర్భంగా ఆయా దేశాలు.. ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రతిభను గుర్తించడం, అభివృద్ధి చేయడం వంటి అంశాల ఆధారంగా జూన్ 27న ర్యాంకులను ప్రకటించారు. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌లు నిలిచాయి. భారత్ కంటే చైనా (71), బంగ్లాదేశ్ (104), భూటాన్ (91), శ్రీలంక (50) వంటి దేశాలు మెరుగైన స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల్లో భారత్ చివరి స్థానంలో ఉంది. 

జాతీయంలక్ష కి.మీ పరిధిలో మొక్కలు నాటాలని కేంద్రం నిర్ణయంజాతీయ రహదారుల వెంట లక్ష కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 1న ప్రకటించారు. నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్ కింద 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనతోపాటు రహదారుల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించనున్నారు. 2019 లోగా జాతీయ రహదారుల నిర్మాణానికి వెచ్చించనున్న రూ.5 లక్షల కోట్లలో.. ఐదువేల కోట్ల రూపాయలను పచ్చదనం కోసమే ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో రూ.300 కోట్లు వెచ్చించి 1500 కి లోమీటర్ల పరిధిలో మొక్కలు నాటనున్నారు. 

ఏకీకృత రక్షణ సమాచార వ్యవస్థ ప్రారంభందేశంలో మొట్టమొదటి ఏకీకృత రక్షణ సమాచార వ్యవస్థను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి దళానికి ఆయా సమాచార, మేధో వ్యవస్థలు ఉన్నప్పటికీ అన్ని దళాలకు ఉపయోగపడేలా ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా అత్యంత అధునాతన పద్ధతుల్లో పనిచేసే ఈ వ్యవస్థను రక్షణ సమాచార వ్యవస్థ (డీసీఎన్)గా వ్యవహరిస్తారు. ఇది లడఖ్, ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపాల్లో సైతం సమర్థవంతంగా పనిచే స్తుంది. 

స్వలింగ సంపర్కులు మూడో లింగ పరిధిలోకి రారన్న సుప్రీంకోర్టుస్వలింగ సంపర్కులను మూడో లింగ (థర్డ్ జెండర్) వ్యక్తులుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు జూన్ 30న స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ నిర్వహించిన కోర్టు 2014లో (సుప్రీంకోర్టు) ఇచ్చిన తీర్పు ప్రకారం.. లింగమార్పిడి చేయించుకున్నవారు, హిజ్రాలు మాత్రమే మూడో లింగ వర్గానికి చెందుతారని, స్వలింగ సంపర్కులు ఆ పరిధిలోకి రారని పేర్కొంది. 

జీవ ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సు ప్రారంభంకర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) దేశంలో తొలిసారి పూర్తిగా జీవ ఇంధనం (బయో డీజిల్)తో నడిచే బస్సును జూలై 4న బెంగళూరులో ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలమైన ఈ సూపర్ లగ్జరీ బస్సు బెంగళూరు-చెన్నైల మధ్య నడుస్తుంది.

దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అన్ని సర్వీసుల్లో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టు జూలై 4న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1995లో వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ) చట్టం చేసిన ఇన్నేళ్ల తర్వాత కూడా వారికి 3 శాతం కంటే తక్కువగా ఉద్యోగాలు కల్పించడంపై కోర్టు విచారం వ్యక్తం చేసింది.

మోదీ మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు
Current Affairs
భారీస్థాయి మార్పులు, చేర్పులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గానికి కొత్తరూపునిచ్చారు. ఐదుగురు సహాయమంత్రులను తొలగించి.. కొత్తగా 19 మందికి చోటు కల్పిస్తూ విస్తరించటంతో పాటు.. పలువురు మంత్రుల శాఖలనూ మార్చుతూ పునర్‌వ్యవస్థీకరించారు. జూలై 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది.

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు:ప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల శాఖ (కేబినెట్ హోదా)
స్మృతి ఇరానీ - చేనేత, జౌళి శాఖ (మానవ వనరుల శాఖ మార్పు)
రవిశంకర్ ప్రసాద్ - ఐటీ శాఖకు అదనంగా న్యాయ శాఖ
సదానంద గౌడ - గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రి (న్యాయ శాఖ తొలగింపు)
అనంత కుమార్ - ఎరువులు, రసాయనాల శాఖకు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాలు
వెంకయ్య నాయుడు - పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (పార్లమెంటరీ వ్యవహారాలు, గృహ నిర్మాణం తొలగింపు)
పీయూశ్ గోయల్ - విద్యుత్, పునరుత్పత్తి విద్యుత్ శాఖకు అదనంగా గనులు
చౌదరీ బీరేంద్ర సింగ్ - స్టీల్ (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం తొలగింపు)
హన్సరాజ్ ఆహిర్ - హోం శాఖ సహాయ మంత్రి (ఎరువులు, రసాయనాలు శాఖ తొలగింపు)
సంతోష్ కుమార్ గంగ్వార్ - ఆర్థిక శాఖ సహాయ మంత్రి (చేనేత, జౌళి శాఖ తొలగింపు)
మనోజ్ సిన్హా - రైల్వే సహాయ మంత్రి, కమ్యూనికేషన్స్ (అదనం)
సంజీవ్ కుమార్ - జలవనరులు, నదుల అనుసంధానం (సహాయ మంత్రి); (వ్యవసాయం తొలగింపు)
జయంత్ సిన్హా - పౌర విమానయాన (సహాయ మంత్రి) (ఆర్థిక సహాయ మంత్రి తొలగింపు)
హరిభాయ్ చౌదరి - సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (సహాయ మంత్రి) (హోం శాఖ తొలగింపు)
రావ్ ఇందర్‌జిత్ సింగ్ - ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన (సహాయ మంత్రి) (రక్షణ శాఖ తొలగింపు)
నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుధ్య (సహాయ మంత్రి), (గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖ తొలగింపు)

కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు:అనిల్ మాధవ్ దవే - అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులు (స్వతంత్ర)
విజయ్ గోయల్ - క్రీడలు, యువజన సర్వీసులు (స్వతంత్ర)
అర్జున్ రామ్ మేఘ్వాల్ - ఆర్థికర, కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ మంత్రి)
ఎస్‌ఎస్ అహ్లువాలియా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు (సహాయ మంత్రి)
ఫగన్ సింగ్ కులస్తే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి)
అనుప్రియ పటేల్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి)
రాజన్ గోహెన్ - రైల్వే శాఖ (సహాయ మంత్రి)
ఎంజే అక్బర్ - విదేశీ వ్యవహారాలు (సహాయ మంత్రి)
కృష్ణపాల్ - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి)
రాందాస్ అఠావలే - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి)
జస్వంత్ సింహ బహదూర్ - గిరిజన వ్యవహారాలు
పీపీ చౌదరి - న్యాయ, ఐటీ శాఖలు (సహాయ మంత్రి)
డాక్టర్ సుభాష్ భామ్రే - రక్షణ (సహాయ మంత్రి)
సీఆర్ చౌదరి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ (సహాయ మంత్రి)
అజయ్ తాంతా - చేనేత, జౌళి (సహాయ మంత్రి)
మన్షుక్ మాండవీయ - రహదారులు, రవాణా, షిప్పింగ్, ఎరువులు-రసాయనాలు (సహాయ మంత్రి)
పర్షోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీ రాజ్ (సహాయ మంత్రి)
డాక్టర్ మహేంద్రనాథ్ పాండే - మానవ వనరుల శాఖ (సహాయ మంత్రి)
రమేశ్ చందప్ప జిగజినాగి - తాగునీరు, పారిశుద్ధ్యం

ఆర్థికంభారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుCurrent Affairs ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ భారత పర్యటనలో భాగంగా జూన్ 30న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పోషకాహారం, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాలపై చర్చించారు. కిమ్ పర్యటనలో సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత్‌కు ప్రపంచ బ్యాంక్ దాదాపు రూ.6,750 కోట్ల సాయం అందించనుంది. భారత్ 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీవైమానిక దళంలో చేరిన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ స్వదేశీ యుద్ధ విమానం తేజస్ జూలై 1న వైమానిక దళంలో చేరింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. తేజస్ ప్రపంచంలోనే తేలికైన సూపర్ సోనిక్ యుద్ధ విమానం. ఇది గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, గగనతలం నుంచి సముద్రంపై లక్ష్యాలను ఛేదించగలదు.

ఇజ్రాయెల్-భారత్ ఎంఆర్-శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతంభూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మీడియం రేంజ్ మిస్సైల్ (ఎంఆర్-శామ్)ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్‌కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

గురుడి కక్ష్యలోకి ప్రవేశించిన ‘జునో’అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ప్రయోగించిన సౌర విద్యుత్తుతో పనిచేసే అంతరిక్ష వ్యోమనౌక ‘జునో’ జూలై 5న విజయవంతంగా గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఐదేళ్ల కాలంలో 170 కోట్ల కి.మీ ప్రయాణించి జునో లక్ష్యాన్ని చేరింది. జునోకు మూడు పొడవైన భారీ సౌర ఫలకాలుంటాయి. మన సౌరవ్యవస్థతోపాటు గ్రహాల్లో అన్నింటికన్నా పెద్దదైన బృహస్పతిల పుట్టుక, పరిణామక్రమాలను అర్థం చేసుకోడానికి జునో సహాయపడనుంది. ఈ అంతరిక్ష వాహకనౌకపై అమెరికా ప్రభుత్వం 1.1 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. గెలీలియో(వాహకనౌక) తర్వాత గురుడి కక్ష్యలోకి వెళ్లిన తొలి వ్యోమనౌక జునోనే. జునోలో 9 సైన్సు పరికరాలుంటాయి. గురుగ్రహంపై అయస్కాంత క్షేత్రాల మ్యాపింగ్, నీరు, అమ్మోనియాల పరిమాణాన్ని కొలవడం, అరోరాలను (ధ్రువాల వద్దే ఏర్పడే రంగు రంగుల ప్రాంతాలు) పరిశీలించడం వంటి బాధ్యతలను జునో నిర్వర్తిస్తుంది. 2018 ఫిబ్రవరి 20న జునో మిషన్ ముగుస్తుంది. అప్పటిలోపు జునో బృహస్పతి చుట్టూ 37 సార్లు పరిభ్రమిస్తుంది. ఈ వ్యోమనౌకను నాసా 2011 ఆగస్టు 5న ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించింది. 

వార్తల్లో వ్యక్తులుడిజిటల్ విప్లవ దార్శనికుడు ఆల్విన్ టోఫ్లర్ కన్నుమూతశాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చే మార్పులను దశాబ్దాల కిందటే ఊహించి చెప్పిన దార్శనికుడు, రచయిత ఆల్విన్ టోఫ్లర్ (87) లాస్‌ఏంజెల్స్‌లో జూన్ 27న కన్నుమూశారు. ఆయన 1980లో రాసిన థర్డ్ వేవ్ పుస్తకంలో ఈ- మెయిల్స్, ఇంటరాక్టివ్ మీడియా, ఆన్‌లైన్ చాట్‌రూమ్‌ల వినియోగం భవిష్యత్తులో విస్తృతమవుతుందని పేర్కొన్నారు. 

మెస్సీకి జైలు శిక్షCurrent Affairs పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో ఇద్దరికి 21 నెలల జైలు శిక్షతో పాటు మెస్సీకి 2.09 మిలియన్ యూరోలు (రూ. 15 కోట్లు), జార్జ్‌కు 1.6 మిలియన్ యూరోలు (రూ. 12 కోట్లు) జరిమానా విధించింది. అయితే స్పెయిన్‌లో అహింస నేరాలకు సంబంధించిన కేసులో రెండేళ్ల కంటే తక్కువ శిక్ష పడితే వాటిని ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణం. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను కూడా స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్‌లు అప్పీలు చేయనున్నారు. 2007-09 వరకు ఇమేజ్ రైట్స్ (చిత్రం వాడుకున్నందుకు) వల్ల తనకు వచ్చిన ఆదాయం 4.16 మిలియన్ యూరో (రూ. 31 కోట్లు)లకు పన్ను చెల్లించలేదని కోర్టు తేల్చింది. బెలిజ్, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఉరుగ్వేలోని పలు కంపెనీలను ఉపయోగించి తండ్రీకొడుకులు ఈ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది.

పిస్టోరియస్‌కు ఆరేళ్లు జైలు శిక్ష విధించిన దక్షిణాఫ్రికా కోర్టుప్రియురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దక్షిణాఫ్రికా పారా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. రీవా స్టీన్‌కాంప్ హత్య కేసులో ప్రిటోరియా హై కోర్టు జూలై 6న తీర్పు వెలువరించింది. నిజానికి దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉన్నా.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పిస్టోరియస్‌కు తక్కువ శిక్షను విధిస్తున్నట్లు జడ్జి థోకోజిలే మసిపా వ్యాఖ్యానించారు. 2013 ప్రేమికుల రోజున తన ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడని భావించిన పిస్టోరియస్ బాత్రుమ్ తలుపు వెనుక నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతని ప్రియురాలు రీవా మరణించింది. 

అవార్డులు గూగుల్ సీఈవోకు ప్రతిష్టాత్మక గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డుCurrent Affairs అమెరికాలో ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డుకు గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ ఏడాది 42 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. అందులో పిచాయ్‌తోపాటు నలుగురు భారత-అమెరికన్లు ఉన్నారు.

డాక్టర్ బీసీ రాయ్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతిప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన 25 మంది డాక్టర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1 ‘డాక్టర్ బీసీ రాయ్ అవార్డు’లను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 2008, 2009, 2010 సంవత్సరాలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. 2009 ఏడాదికి గాను హైదరాబాద్‌లోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో పనిచేస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ జీవీ రావు అవార్డు అందుకున్నారు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1976 నుంచి ఈ అవార్డులను అందజేస్తుంది. 

అవార్డు గ్రహీతలు:2008: డా. మమెన్ చాందీ, ప్రొ. రాజేశ్వర్ దయాళ్, డా. రోహిత్ వి. భట్, డా. నీలం మోహన్, డా. మోహన్ కామేశ్వరణ్, డా. హర్ష జౌహారి, డా. గోపాల్ హెచ్. బద్లానీ, డా. యశ్ గులాటి
2009: డా. కె.హెచ్. సచేతి, డా. అతుల్ కుమార్, డా. రేణు సక్సేనా, ప్రొ. డా. కనన్ ఎ. గెలికర్, డా. ఎ.కె. కృపలాణి, డా. జీవీ రావు, డా. హెచ్.ఎస్. భానుశాలి, డా. మోతీలాల్ సింగ్, డా. సి.ఎన్. పురందరే, ప్రొ. డా. సీవీ హరినారాయణ్
2010: డా. నిఖిల్ సి. మున్షి, డా. తేజీందర్ సింగ్, ప్రొ. ఒ.పి. కల్‌రా, డా. అమ్రీందర్ జిత్ కన్వార్, డా. సుభాష్ గుప్త, డా. రాజేంద్ర ప్రసాద్, డా. గ్లోరీ అలెగ్జాండర్

క్రీడలుహామిల్టన్‌కు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి టైటిల్ఫార్ములావన్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. స్పీల్‌బర్గ్‌లో జూలై 3న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా మ్యాక్ వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో, రైకోనెన్ మూడో స్థానంలో నిలిచారు.

కెనడా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సాయి ప్రణీత్Current Affairs కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సాయి ప్రణీత్ (భారత్) పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూలై 4న కాల్గరీ (కెనడా)లో జరిగిన ఫైనల్లో లీ హ్యున్‌ను సాయి ప్రణీత్ ఓడించాడు. కెరీర్‌లో ప్రణీత్‌కు ఇది తొలి గ్రాండ్ ప్రి టైటిల్. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్‌రెడ్డి-మను అత్రిల జోడి గెలుచుకుంది.

సెరెనా 300వ గ్రాండ్‌స్లామ్ విజయంఅమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 300వ విజయాన్ని నమోదు చేసింది. జూలై 3న జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో అన్నికా బేక్ (జర్మనీ)పై విజయం సాధించింది. ఫలితంగా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ‘ఓపెన్ ఎరా’లో మార్టినా నవ్రోతిలోవా (అమెరికా) 306 విజయాలతో ప్రథమ స్థానంలో ఉంది. 34 ఏళ్ల సెరెనాకు వింబుల్డన్‌లో ఇది 82వ విజయం కాగా, ఏడో టైటిల్ కోసం బరిలోకి దిగిన ఆమె... స్టెఫీ గ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ద్యుతీ బృందం జాతీయ రికార్డుకజకిస్థాన్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణిలు కొత్త జాతీయ రికార్డును సృష్టించారు. జూలై 4న జరిగిన మహిళల 4x100మీ. రిలేను ద్యుతీచంద్, శ్రాబణి నందా, హెచ్.ఎం. జ్యోతి, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన బృందం 43.32 సెకన్లలో ముగించి రజత పతకాన్ని సాధించింది. దీంతో గతంలో తమ పేరిటే ఉన్న 44.03సెకన్ల జాతీయ రికార్డును అధిగమించింది. 42.92 సెకన్లలో లక్ష్యదూరాన్ని చేరుకున్న కజకిస్థాన్ బృందం పసిడి పతకాన్ని దక్కించుకుంది. మరోవైపు భారత పురుషుల బృందం 39.90 సెకన్లలో 4ఁ100మీ. రిలేను పూర్తి చేసి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates