Ticker posts

9/recent/ticker-posts

అంతర్జాతీయం


అమల్లోకి వచ్చిన నేపాల్ రాజ్యాంగం
Current Affirsనేపాల్‌లో సెప్టెంబరు 20 నుంచి చారిత్రాత్మక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో నేపాల్ పూర్తి స్థాయి లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 239 ఏళ్ల నేపాల్ రాచరికం 2008లో రద్దయింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్ట సభలు ఉంటాయి. ప్రతినిధుల సభ, దిగువసభలో 375 మంది, ఎగువసభలో 60 మంది సభ్యులు ఉంటారు. ఏడు ప్రావిన్సుల(రాష్ట్రాల)తో సమాఖ్య ఏర్పడుతుంది. దక్షిణ మైదాన ప్రాంతంలో మైనారిటీ గ్రూపులు తమ ప్రావిన్సుల విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఐరాసలో సంస్కరణలకు తొలి అడుగుఐక్యరాజ్యసమితి(ఐరాస)లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన చర్చా పత్రానికి ఐరాస సర్వప్రతినిధి సభ సెప్టెంబరు 14న ఆమోదం తెలిపింది. ఏడేళ్ల అనంతరం సభలో ముసాయిదా ఆధారంగా చర్చ జరుగనుంది. ఈ చర్చా పత్రంలో భద్రతా మండలి సంస్కరణలపై సభ్యదేశాల వైఖరి, భద్రతామండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాన్ని ఏవిధంగా విస్తరించాలి వంటి అంశాలున్నాయి. భద్రతామండలిలో సంస్కరణ లు చేపట్టాలని భారత్ కోరుతోంది.

గ్రీస్ ప్రధానిగా సిప్రాస్ తిరిగి ఎన్నికఅలెక్సిస్ సిప్రాస్ సెప్టెంబరు 21న గ్రీసు ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. గ్రీసు పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 300 స్థానాలకు వామపక్ష పార్టీ సిరిజా నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ 145 స్థానాల్లో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి న్యూ డెమొక్రసీ నాయకుడు వాంగెలిస్ మీమరాకిస్‌కు 75 స్థానాలు దక్కాయి. రుణ సంక్షోభం నేపథ్యంలో ఆగస్టులో సిప్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు.

పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడిపాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్తూన్‌క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సెప్టెంబర్ 18న జరిగిన ఈ దాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్‌కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరం చెక్‌పోస్ట్‌పై, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక ఆర్మీ కెప్టెన్, ఇద్దరు సైనికులు, 23 మంది పాక్ వైమానిక దళ సిబ్బంది, ముగ్గురు పౌరులు మృతిచెందారు. భద్రతా బలగాలు ఎదురుదాడి చేసి మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ దాడికి పాల్పడింది తమ ఆత్మాహుతి మిలిటెంట్లేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది.

నేపాల్ జాతీయ జంతువుగా ఆవుగోమాతను పవిత్రంగా భావించే నేపాల్‌లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు. 2015 సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకొచ్చిన కొత్త రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా పరిగణించాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ చివరికి ఆవును ఎంపికచేశారు. దీంతో దానికి రాజ్యాంగ రక్షణ కల్పించినట్లయింది. దేశంలో గోవధను నిషేధించారు. ఈ అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ చివరగా చేర్చారు. 

ఐర్లాండ్‌లో మోదీ పర్యటనఏడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌కు చేరుకున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా డబ్లిన్‌లో ఆ దేశ ప్రభుత్వాధినేత (Taoiseach) ఎన్డా కెన్నీతో ప్రధాని సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతునివ్వాలని మోదీ ఐర్లాండ్‌ను కోరారు. అనంతరం మోదీ డబ్లిన్ నుంచి ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ బయల్దేరి వెళ్లారు. తరవాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యమిస్తున్న శాంతి పరిరక్షక సదస్సులో పాల్గొంటారు. 

జాతీయం
ఎస్‌పీఎంఆర్‌ఎం మిషన్‌కు కేబినెట్ ఆమోదంగ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ రర్బన్(రూరల్-అర్బన్) మిషన్ (ఎస్‌పీఎంఆర్‌ఎం)కు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 16న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో రూ.5,142.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300 గ్రామీణ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పురపథకం స్థానంలో ప్రభుత్వం గతేడాది ఎస్‌పీఎంఆర్‌ఎంను ప్రకటించింది. క్లస్టర్స్ అభివృద్ధిలో 14 అంశాలను పేర్కొన్నారు. ఇందులో డిజిటల్ అక్షరాస్యత, సంచార ఆరోగ్య కేంద్రం, రోడ్ల అనుసంధానం, ఆర్థిక కార్యక్రమాలతో ముడిపడిన నైపుణ్య అభివృద్ధి తదితర అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం తగ్గించడం,గ్రామీణ వలసలను తగ్గించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటారు.

నేతాజీ రహస్య ఫైళ్లను బయటపెట్టిన బెంగాల్ ప్రభుత్వంనేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగం, ప్రభుత్వ లాకర్లలో ఉన్న 64 రహస్య ఫైళ్లను సెప్టెంబర్ 18న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీస్ మ్యూజియంలో బహిర్గతం చేశారు. 12,744 పేజీలున్న ఈ ఫైళ్లను నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బయటపెట్టారు. ఫైళ్ల డీవీడీలను నగర పోలీస్ కమిషనర్ ఎస్‌కేపురకాయస్థ నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయుధ పోరాటంతో బ్రిటిష్ వలసపాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేతాజీ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోలేదని ఈ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది. 1949 వరకు ఆయన జీవించే ఉన్నట్లు ఆధారాలున్నాయి.

బీడీఎల్, ఈసీఐఎల్ మధ్య అవగాహన ఒప్పందంభారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్(ఈసీఐఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ రంగంలో క్షిపణులు, నీటి అడుగున ఆయుధ వ్యవస్థ తయారీలో పరస్పర సహకారంతో పనిచేయాలని సెప్టెంబర్ 21న బీడీఎల్‌లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు బీడీఎల్ చైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ వీ ఉదయ భాస్కర్, ఈసీఐఎల్ మేనేజింగ్ డెరైక్టర్ పీ సుధాకర్‌లు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.

డబ్ల్యూసీడీ, వేదాంత అవగాహన ఒప్పందందేశవ్యాప్తంగా నాలుగువేల అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ (డబ్ల్యూసీడీ) సెప్టెంబర్ 21న వేదాంత సంస్థతో అవగాహనా ఒప్పందం కుదర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా చిన్నారులు, మహిళల అభివృద్ధికి వేదాంత సోషల్ ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా బాలల్లో అక్షరాస్యత పెంపు, పోషకాహార లేమిని నివారించడం, మహిళల్లో వృత్తినైపుణ్యాన్ని పెంచడం వంటి చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను వేదాంత ఆధునీకరిస్తుంది.

రాజస్తాన్‌లో గుజ్జర్లకు రిజర్వేషన్ బిల్లు ఆమోదంCurrent Affirs రాజస్తాన్‌లో గుజ్జర్లు, మరికొన్ని ఇతర కులాల వారికి ప్రత్యేక వెనుకబడిన తరగతుల (ఎస్‌బీసీ) కింద ఐదు శాతం రిజర్వేషన్లు, రిజర్వేషన్లు లేని వారిలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) వారికి 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సెప్టెంబర్ 22న వేర్వేరు బిల్లులను ఆమోదించింది. బంజారా/బల్దియా/లాబానా, గడియా లోహర్/గడిలియా, గుజర్/గుర్జార్, రాయికా/రెబారి/దేబాసి, గడారియా/గాడ్రి/గయారి అనే పేర్లు గల ఐదు కులాల వారికి ఎస్‌బీసీ కింద 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

రాష్ట్రీయంపట్టిసీమ పథకం ప్రారంభంపశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ వద్ద గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 16న ప్రారంభించారు. రూ.1300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నదీ జలాలను పోలవరం కుడి కాల్వ ద్వారా 174 కి.మీ తరలించి కృష్ణా నదిలో కలపనున్నారు. ఈ నీటిని కృష్ణా బ్యారేజ్ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టుకు అందిస్తారు.

సీఎం కేసీఆర్ చైనా పర్యటన విజయవంతంCurrent Affirs తెలంగాణ ముఖ్యమంత్రి సెప్టెంబరు 7 నుంచి 16 వరకు పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని సీఎం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా చైనాకు చెందిన బహుళజాతి సంస్థ వాండా కంపెనీ గ్రేటర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 

ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం రూ.6 లక్షలకు పెంపుతెలంగాణ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెప్టెంబరు 19న సమావేశమైన రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తంలో రూ.5 లక్షలు రైతు కుటుంబానికి, రూ.1 లక్షను రైతులు చెల్లించాల్సిన అప్పుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌గా అందజేస్తారు.

అమరావతి శంకుస్థాపనకు సింగపూర్ ప్రధానికి ఆహ్వానంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సెప్టెంబర్ 22న సింగపూర్‌లో లూంగ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. నాలెడ్జ్ ఎకాన మీగా ఏపీ ఆవిర్భావానికి, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్‌గా తయారుచేసేందుకు సహకరించాల్సిందిగా లూంగ్‌ను సీఎం కోరారు.

పుష్కరాల తొక్కిసలాటపై విచారణ కమిటీరాజమండ్రి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి సీవై సోమయాజులతో న్యాయ విచారణ కమిటీని నియమించింది. పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు.

అమరావతిలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తమ శాఖను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంబ్రిడ్జి ప్రతినిధి జెన్నిఫర్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

సైన్స్ అండ్ టెక్నాలజీఅమోఘ-1 క్షిపణి పరీక్ష విజయవంతంCurrent Affirs యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్ అమోఘ-1ను సెప్టెంబరు 10న భారత్ విజయవంతంగా పరీక్షించింది. యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్‌ను మధ్యప్రదేశ్‌లోని బాబినా ఆర్మీ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తెలిపింది. ఈ క్షిపణి 2.8 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో దీన్ని అభివృద్ధి చేశారు.

20 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా ఉపగ్రహ వాహక నౌక లాంగ్ మార్చ్-6 ద్వారా చైనా ఒకేసారి 20 సూక్ష్మ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టింది. సెప్టెంబరు 20న షాంఘై ప్రావిన్సులోని తైయువాన్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌లో ఇంధనంగా కాలుష్య రహిత ఇంధనాలు ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌లను ఉపయోగించారు. 

స్పేస్ షాట్‌గన్ అభివృద్ధి చేస్తున్న నాసాఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రపంచంలోనే తొలి స్పేస్ షాట్ గన్‌ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్‌ని ఈ షాట్‌గన్‌తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో దీన్ని తయారుచేస్తోంది. ఆస్టరాయిడ్ రీడెరైక్ట్ మిషన్(ఏఆర్‌ఎమ్)లో భాగంగా నాసా షాట్‌గన్ తయారీపై దృష్టిసారించింది. ఆస్టరాయిడ్‌లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడెరైక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం.

అవార్డులుసిడ్బీకి ప్రతిష్టాత్మక పురస్కారంరాజ్‌భాషా కీర్తి పురస్కార్ పథకం కింద భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్‌ఐడీబీఐ-సిడ్బీ) ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందింది. ఇందుకు సంబంధించి ద్వితీయ బహుమతిని సిడ్బీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కె. శివాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. అధికార భాష అమలుకు సంబంధించి 2014-15 ఏడాదికి గాను సిడ్బీకి ఈ పురస్కారం లభించడం ఇది మూడోసారి. 

నూయీ, భారతీయలకు యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డుCurrent Affirs పెప్సికో సీఈఓ ఇంద్రా నూయీ, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ శోభనా భారతీయలకు 2015 సంవత్సరానికి గాను యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌ఐబీసీ) గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును ప్రదానం చేసింది. ప్రపంచ సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి మహిళా నాయకురాళ్లుగా వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. సెప్టెంబర్ 21న వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్‌ఐబీసీ వార్షిక వేడుకల్లో వారికి ఈ అవార్డులను అందజేశారు. యూఎస్‌ఐబీసీ అనేది అమెరికాలోని భారత, అమెరికా కంపెనీలకు సంబంధించిన అత్యున్నత న్యాయ సంఘం.

డాక్టర్ ఎస్వీకి జాషువా సాహితీ పురస్కారంసుప్రసిద్ధ అభ్యుదయ కవి, విమర్శకులు, సాహిత్య పరిశోధకులు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవి కోకిల గుర్రం జాషువా సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. గుంటూరులోని సెప్టెంబర్ 26న జరగనున్న పద్మభూషణ్ గుర్రం జాషువా 120వ జయంతి ఉత్సవంలో డాక్టర్ ఎస్వీకి జాషువా సాహితీ పురస్కారంతో పాటు రూ.10వేల నగదును పారితోషికంతో సత్కరించనున్నారు.

ఒడిశా బాలికకు స్వచ్ఛభారత్ హరిత పురస్కారంఒడిశాకు చెందిన 16 ఏళ్ల బాలిక స్వచ్ఛభారత్ హరిత పురస్కారాన్ని అందుకుంది. ఓఎల్‌ఎక్స్ ఐడియాథాన్-2015 పేరిట నిర్వహించిన ఈ పోటీలో పర్యావరణానికి మేలు చేసేలా కూరగాయలను ఎరువుగా మార్చే విధానాన్ని వివరించిన జైపూర్‌కు చెందిన జెశ్వాంత్ జెంబాలీ ఈ అవార్డుకు ఎంపికైంది. సెప్టెంబరు 17న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా చేతుల మీదుగా జెంబాలీ ఈ అవార్డు అందుకుంది.

వార్తల్లో వ్యక్తులుఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా పీవీ చంద్రన్ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) అధ్యక్షుడిగా పీవీ చంద్రన్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 18న బెంగళూరులో జరిగిన సంస్థ 76వ వార్షిక సమావేశంలో ఆయనను 2015-16కుగాను ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ‘మాతృభూమి’ గ్రూపు సంస్థలకు ఎండీగా ఉన్న చంద్రన్.. కిందటేడాది ఐఎన్‌ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. సోమేశ్ శర్మ(రాష్ట్రదూత్ సప్తాహిక్)ను ఐఎన్‌ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, అఖిలా ఉరంకార్(బిజినెస్ స్టాండర్డ్)ను వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతిభారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) అనారోగ్యంతో సెప్టెంబరు 20న కోల్‌కతాలో మరణించారు. ఈ ఏడాది మార్చి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఆయన బీసీసీఐ (2001-2004), ఐసీసీ(1997-2000) అధ్యక్షులుగా సేవలందించారు. 1987, 1996 ప్రపంచకప్‌ల నిర్వహణలో దాల్మియా కీలకపాత్ర పోషించారు.

రచయిత్రి జాకీ కోలిన్స్ మృతిప్రముఖ బ్రిటన్ రచయిత్రి జాకీ కోలిన్స్ (77) లాస్ ఏంజిలెస్‌లో సెప్టెంబరు 20న మరణించారు. ఆమె రాసిన 30కి పైగా పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆమె 1968లో రాసిన మొదటి నవల ‘ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యారీడ్ మెన్’ బాగా ప్రాచుర్యం పొందింది. ద స్టడ్, రాక్‌స్టార్ ఆమె ఇతర ప్రముఖ నవలలు.

యూఎన్ అత్యుత్తమ సలహా సంఘంలో శ్రీధరన్మెట్రో మేన్‌గా పేరుగాంచిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రధాన సలహాదారు శ్రీధరన్‌కు గొప్ప అవకాశం దక్కింది. ‘సస్టయినబుల్ ట్రాన్స్‌పోర్ట్’పై ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి అత్యుత్తమ సలహా సంఘం సభ్యుడి పదవి ఆయనను వరించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు డీఎంఆర్‌సీ సెప్టెంబర్ 18న ఓ ప్రకటన విడుదల చేసింది. 

జయప్రదకు నవరస కళాభినేత్రి బిరుదుప్రముఖ సినీనటి జయప్రదకు నవరస కళాభినేత్రి బిరుదును టీఎస్సార్ లలిత కళాపరిషత్ ప్రదానం చేసింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 20న విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, జమునారాణిల చేతుల మీదుగా ఆమెకు బిరుదు అందజేశారు. జయప్రద ముంజేతికి స్వర్ణకంకణం తొడిగి, వీణను అందజేశారు.

గణిత శాస్త్రవేత్త ‘నల్లాన్’ కన్నుమూతCurrent Affirs గణితశాస్త్రవేత్త ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభి రామాచార్యులు (82) సెప్టెంబర్ 19న వరంగల్ జిల్లా హన్మకొండలో కన్నుమూశారు. నడయాడే గణితశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా పిలిచే పట్టాభి రామాచార్యులు ఆర్‌ఈసీ(నేటి నిట్)లో గణితశాస్త్ర ఆచార్యులుగా పని చేశారు. గొప్పనటుడిగా సుపరిచితులు.పట్టాభిరామాచార్యులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు అగ్రహారంలో 1933 నవంబర్ 11న జన్మించారు. 1967లో ‘సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నాన్-న్యూటోనియన్ ఫ్లుయిడ్, డైనమిక్స్’ అనే అంశంపై పరిశోధనా వ్యాసం సమర్పించి డాక్టరేట్ అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు ఐదు ఏళ్లు డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు.

ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్‌గా స్తుతి నారాయణ్ కక్కర్రిటైర్డు ఐఏఎస్ అధికారిణి స్తుతి నారాయణ్ కక్కర్‌ను జాతీయ పిల్లల హక్కుల సంరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) చైర్‌పర్సన్‌గా కేంద్రం సెప్టెంబర్ 22న నియమించింది. ఇంతకుముందు స్తుతి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలో కార్యదర్శిగా పనిచేశారు. 2014 అక్టోబర్‌లో కుశాల్ సింగ్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయనప్పటి నుంచి దాదాపు ఏడాదిగా ఆపోస్టు ఖాళీగానే ఉంది. చిన్నారులకు సంబంధించిన విద్య, శిశు అభివృద్ధి, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం తదితర అంశాలపై ఈ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. 

క్రీడలునేషనల్ ఓపెన్ అథ్లెటెక్స్ ఛాంపియన్‌గా రైల్వేస్కోల్‌కతాలో సెప్టెంబరు 19లో ముగిసిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా రైల్వేస్ నిలిచింది. మొత్తం 267 పాయింట్లతో రైల్వేస్ మొదటి స్థానంలో నిలువగా, ఓఎన్‌జీసీ(185),సర్వీసెస్(174.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్క పతకం కూడా దక్కలేదు.

వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్Current Affirs ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సింగపూర్‌లో సెప్టెంబరు 20న జరిగిన రేసులో వెటల్ మొదటి స్థానంలో నిలువగా, డేనియల్ రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు.

కొరియా ఓపెన్ టైటిల్కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. సెప్టెంబరు 20న సియోల్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అజయ్ జయరామ్ (భారత్)ను చెన్ లాంగ్ ఓడించాడు.కెరీర్‌లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ ఫైనల్ ఆడుతున్న జయరామ్‌పై ఇప్పటికే 18 సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన చెన్ లాంగ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు.విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates