Ticker posts

9/recent/ticker-posts

Current affairs

అంతర్జాతీయంఐరాస సుస్థిర అభివృద్ధి సభఐక్యరాజ్యసమితి (ఐరాస) సుస్థిర అభివృద్ధి సభ సెప్టెంబరు 25 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ప్రపంచ బ్యాంకు, ద్రవ్యనిధి సంస్థల అధిపతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ కొత్త అభివృద్ధి లక్ష్యాలను స్వాగతించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంపన్న దేశాలు టెక్నాలజీని ఇతర దేశాలకు అందజేయాలన్నారు. ఐరాసలో సంస్కరణలు అమలు చేస్తేనే దాని విశ్వసనీయత కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి అజెండాను ఐరాస జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 15న ఆమోదించింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యకర జీవనం, విద్యను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను అరికట్టడం వంటి 17 లక్ష్యాలను ఇందులో నిర్దేశించారు. వీటి సాధనకై ఏడాదికి 3.5 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల వరకు వెచ్చించనున్నారు.

ఐరాస సంస్కరణలకు పిలుపునిచ్చిన జీ-4 దేశాలుభారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాలతో కూడిన జీ-4 సదస్సు సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా జీ-4 దేశాలు ప్రకటించాయి. నిర్దేశిత కాలవ్యవధిలో భద్రతామండలిని సంస్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఖండాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భద్రతా మండలి విశ్వసనీయత, న్యాయబద్ధత కలిగి ఉంటుందని స్పష్టం చేశాయి. దశాబ్దం తర్వాత జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌లు పాల్గొన్నారు.

హజ్ యాత్ర తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా మృతిసౌదీ అరేబియాలోని మినా వద్ద సెప్టెంబరు 24న జరిగిన తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా హజ్ యాత్రికులు మరణించారు. ఇందులో 35 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబరు 28న తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. మినాలో జమారత్ వద్ద సైతానుగా భావించే స్తంభాలను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు భారీగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

సిలికాన్ వ్యాలీలో మోదీ ‘ఐటీ’ పర్యటనడిజిటల్ ప్రపంచానికి రాజధాని అయిన సిలికాన్ వ్యాలీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ వంటి దిగ్గజాలతో సెప్టెంబర్ 26న మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తన ప్రణాళికలను ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థల సీఈఓలతో జరిగిన భేటీలో మోదీ బయటపెట్టారు.
నరేంద్రమోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా విప్లవానికి తమ సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్‌కామ్ దాదాపు రూ. వేయి కోట్లు మేర నిధులను అందించనున్నట్లు పాల్ జాకబ్స్ ప్రకటించారు. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న మోదీ విజ్ఞప్తికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ 27న ప్రధాని మోదీ ఫేస్‌బుక్, గూగుల్ ప్రధాన కార్యలయాలను సందర్శించారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో సమావేశమయ్యారు.

అగ్రరాజ్యాల అధినేతలతో మోదీ చర్చలుఅమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న అగ్రరాజ్యాల అధినేతలతో సమావేశమై పలు చర్చలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మూడోసారి సమావేశమైన మోదీ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని.. భద్రత, ఉగ్రవాదంపై పోరు, రక్షణ, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఒబామాతో భేటీకన్నా ముందు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌లతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారితో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సంస్కరణలు, వాతావరణ మార్పు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం కోసం భారత అభ్యర్థిత్వానికి బ్రిటన్, ఫ్రాన్స్‌లు రెండూ మద్దతు తెలిపాయి. 

మహాత్మాగాంధీకి లిథువేనియా ప్రత్యేక నివాళిCurrent Affirsమహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని లిథువేనియా దేశం ఘన నివాళి అర్పించనుంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీతో కలిసి పనిచేసిన ఆయన స్నేహితుడు, లిథువేనియాకు చెందిన హెర్మన్ కలెన్‌బాచ్‌లు కలిసున్న విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న లిథువేనియా ప్రధానమంత్రి అల్గిర్‌దాస్ బట్కెవిసియస్, భారత వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌భాయ్ కుందరియన్ ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. హెర్మన్ జన్మస్థలమైన రుస్నేలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

తీరప్రాంతాల సంరక్షణపై ఒప్పందంఅంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇండో-పసిఫిక్ సముద్ర తీరప్రాంతాల సంరక్షణకు కలసి పనిచేయాలని భారత్, జపాన్, అమెరికాలు నిర్ణయించాయి. ఇక నుంచి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, సముద్ర జలాల్లో స్వేచ్చాయుత సంచారానికి అనుమలు ఇవ్వడానికి ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు అంగీకరించారు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 29న నిర్వహించిన భారత్, జపాన్, అమెరికా త్రైపాక్షిక మంత్రుల చర్చల్లో విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, ఫ్యుమియో కిషిడా, జాన్ కెర్రీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జాతీయంఅత్యుత్తమ ప్రాజెక్టుగా ‘ఏపీసీఎంయూహెచ్‌ఐఎస్’అరుణాచల్‌ద్రేశ్ చీఫ్ మినిస్టర్స్ యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకం (ఏపీసీఎంయూహెచ్‌ఐఎస్)... దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు స్థానాన్ని దక్కించుకుంది. స్మార్ట్ గవర్నెన్స్- 2015 కింద దీనికి స్కోచ్ పురస్కారం దక్కింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 41వ స్కోచ్ సమితి సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టచో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలోని 12 అగ్రగామి ఆరోగ ్య ప్రాజెక్టుల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద ఈ ప్రాజెక్టుకు పురస్కారం దక్కింది.

కేరళకు రూ. వంద కోట్ల సాయాన్ని ప్రకటించిన మాతCurrent Affirsస్వచ్చభారత్ పథకంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టేందుకు కేరళ రాష్ట్రానికి మాతా అమృతానందమయి రూ. వంద కోట్ల సాయాన్ని ప్రకటించారు. మాత 62వ జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 27న ఈ మొత్తాన్ని కేరళ సీఎం ఊమెన్ చాందీ సమక్షంలో ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్రంలో టాయిలెట్ల నిర్మాణంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. గంగ శుద్ధి, స్వచ్ఛ భారత్ కోసం సెప్టెంబర్ నెలలోనే కేంద్రానికి మాత రూ. వంద కోట్లను విరాళమిచ్చారు.

ముంబై పేలుళ్ల దోషులకు ఉరిశిక్షతొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక మోకా(ఎంసీఓసీఏ) కోర్టు సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించింది. మరో ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి దాదాపు రూ. 11 లక్షల చొప్పున రూ. 1.51 కోట్ల జరిమానా విధించింది. 2006, జూలై 11న ముంబైలోని ఏడు లోకల్ రైళ్లలో పదినిమిషాల వ్యవధిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 189 మంది చనిపోగా, 829 మంది గాయపడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ముంబైలోని స్పెషల్ మోకా కోర్టు న్యాయమూర్తి యతిన్ డీ షిండే పై తీర్పును వెలవరించారు.

అంబేడ్కర్ స్మారకార్థం పోస్టల్ స్టాంపు విడుదలడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఈ మేరకు సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెప్టెంబర్ 30న స్టాంపును విడుదల చేశారు. అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను ఈ ఏడాది కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోంది.

రాష్ట్రీయంఛత్తీస్‌గఢ్-తెలంగాణల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందంఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మోగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో సెప్టెంబరు 22న ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 2014, నవంబరులో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగానే తాజా ఒప్పందం జరిగింది. వచ్చే 12 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.

తెలంగాణకు మరో మూడు ఎంఎల్‌సీ స్థానాలుCurrent Affirsతెలంగాణకు మూడు ఎంఎల్‌సీ స్థానాలు కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానాలను స్థానిక సంస్థల కోటా కింద రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు ఒక్కొక్కటి కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 11 స్థానిక సంస్థల నియోజక వర్గాలు ఉన్నాయి. తాజాగా మరో మూడు స్థానాలు చేరడంతో ఆ సంఖ్య 14 కు చేరుకుంది.

ఏపీ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.9,000 కోట్ల ఆర్‌ఈసీ రుణంఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.9,000 కోట్లు రుణం ఇచ్చేందుకు గ్రామీణ విద్యుతీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ జెన్కో, ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీల మధ్య సంతకాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.3,000 కోట్లతో అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతారు. మిగిలిన మొత్తాన్ని సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం వినియోగించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.1000 కోట్ల కేంద్ర సహాయంసెప్టెంబరు 25న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్ర, రాయలసీమల్లోని ఏడు వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 300 కోట్లు చొప్పున ఈ మొత్తాన్ని కేటాయించింది.

కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు ఒప్పందంఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ గ్రిడ్ అభివృద్ధిలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపీజీడీసీ), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), షెల్, ఇంజీ సంస్థలు ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో సెప్టెంబరు 25న విజయవాడలో దీనికి సంబంధించిన సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా రూ.1,800 కోట్ల వ్యయంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఎల్‌ఎన్‌జీ ఫ్లోటింగ్ స్టోరేజీ, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను నెలకొల్పుతారు. 

ఆర్థికంహెలికాప్టర్ల కొనుగోలుకు యూఎస్‌తో భారత్ ఒప్పందంCurrent Affirsరక్షణ రంగ వినియోగానికి 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల కొనుగోలుకు అమెరికా ప్రభుత్వంతో, అక్కడి వైమానిక సంస్థ బోయింగ్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఒప్పందం విలువ 300 కోట్ల(రూ. 19.86 వేల కోట్లు) డాలర్లు. తొలి హెలికాప్టర్‌ను భారత్‌కు అందించేందుకు మరో 3, 4 సంవత్సరాలు పడుతుంది. 

రెపో రేటు 0.5 శాతం తగ్గించిన ఆర్‌బీఐరెపో రేటును 0.5 శాతం తగ్గిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సెప్టెంబర్ 29న ప్రకటించారు. దీనితో రెపో రేటు 6.75 శాతానికి తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా మారింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోలలో (ఎస్‌ఎల్‌ఆర్) ఎటువంటి మార్పులూ చేయలేదు.

సైన్స్ అండ్ టెక్నాలజీపీఎస్‌ఎల్‌వీ సీ-30 ప్రయోగం విజయవంతంఖగోళ పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ-30 ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇస్రో 1,513 కిలోల బరువు గల ఆస్ట్రోశాట్‌ను సెప్టెంబరు 28న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. ఆస్ట్రోశాట్‌తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఇండోనేషియాకు చెందిన లపాన్-2 (76 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (14 కిలోలు), యూఎస్‌కు చెందిన లెమర్-2, 3, 4, 5 (28 కిలోలు) ఉన్నాయి. భారత్ తొలిసారి ఖగోళ పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 

చైనా లాంగ్ మార్చ్-11 ప్రయోగం విజయవంతం లాంగ్ మార్చ్-11 రాకెట్‌ను చైనా సెప్టెంబర్ 25న విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా నాలుగు సూక్ష్మ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. చైనాలో వాయవ్య ప్రాంతంలో ఉన్న గాన్సు ప్రావిన్సులోని జియుక్వాన్ శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికిల్ టెక్నాలజీ, చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్‌ను అభివృద్ధి చేశాయి. సూక్ష్మ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం దీని ముఖ్య ఉద్దేశం. లాంగ్‌మార్చ్ రాకెట్ల చరిత్రలో ఇది 211వ మిషన్.

భారీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కొచ్చి జలప్రవేశంCurrent Affirsభారతదేశ నౌకాదళంలోకి క్షిపణి సామర్థ్యమున్న అత్యాధునిక విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కొచ్చి చేరింది. భారత్ దేశీయంగా తయారు చేసిన అతిపెద్ద నౌక అయిన ఐఎన్‌ఎస్ కొచ్చిని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబర్ 30న ముంబైలోని నేవీ డాక్‌యార్డ్‌లో జలప్రవేశం చేయించారు. 
వ్యయం: రూ. 4వేల కోట్లు 
బరువు: 7,500 టన్నులు
పొడవు: 164 మీటర్లు
బీమ్(నౌక మధ్యభాగం వెడల్పు): 17 మీటర్లు
నౌకలోని బహళ నిఘా వ్యవస్థ, ప్రమాద హెచ్చరికల వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్తుంది (ఒక నాటికల్ మైలు 1.852 కిమీకి సమానం). దీనిలో 40 మంది అధికారులు, 350 మంది జవాన్లు ఉంటారు. 

అవార్డులుశాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులుకేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు 11 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. జీవశాస్త్రంలో బాలసుబ్రమణియన్ గోపాల్ (ఐఐఎస్సీ- బెంగళూరు), రాజీవ్ కుమార్ వర్షణే (ఇక్రిశాట్), భూ, వాతావరణ, సాగర, గ్రహ విజ్ఞాన శాస్త్రం: జ్యోతిరంజన్ శ్రీ చందర్ రే (ఫిజికల్ సైన్స్ లేబరేటరీ- అహ్మదాబాద్), ఇంజనీరింగ్ సెన్సైస్: యోగేష్ జోషి (ఐఐటీ- కాన్పూర్), గణిత శాస్త్రం: రితబ్రత మున్షీ (టీఐఎఫ్‌ఆర్- ముంబై), కె.సందీప్ (టీఐఎఫ్‌ఆర్- బెంగళూరు), భౌతిక శాస్త్రం: బేదంగదాస్ మొహంతీ (ఎన్‌ఐఎస్‌ఈఆర్- భువనేశ్వర్), మందర్ దేశ్‌ముఖ్ (టీఐఎఫ్‌ఆర్- ముంబై), వైద్యశాస్త్రం: విదితా వైద్య (టీఐఎఫ్‌ఆర్-ముంబై), రసాయన శాస్త్రం: డి.శ్రీనివాసరెడ్డి (సీఐఎస్‌ఆర్-పూణె), ప్రద్యుత్ ఘోష్ (ఐఎసీఎస్- జాదవ్‌పూర్).

గౌతమ్ నారాయణ్‌కు హ్యారీ మెసెల్ అవార్డుCurrent Affirs అసోంకు చెందిన వన్యప్రాణి సంరక్షకులు గౌతమ్ నారాయణ్ ప్రతిష్టాత్మక హ్యారీ మెసెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు నారాయణ్. అంతరించిపోయే దశలో ఉన్న ‘పిగ్మీ హాగ్’ సంరక్షణ కోసం ‘పిగ్మీహాగ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్’(పీహెచ్‌సీపీ) ద్వారా ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ప్రాణుల సంరక్షణకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు హ్యారీ మెసెల్ అవార్డును అందజేస్తారు.

సైఫుద్దీన్‌కు విశ్వశాంతి అవార్డుమానవ హక్కులు, సామాజిక న్యాయం రంగాల్లో విశిష్ట సేవలందించిన దావూదీ బోహ్రా ముస్లిం వర్గం ఆధ్మాత్మిక నాయకుడు సైద్నా ముఫద్దల్ సైఫుద్దీన్‌కు 2015 సంవత్సరానికి గాను విశ్వశాంతి అవార్డు దక్కింది. అఖిల భారత మానవ, పౌర హక్కులు, సామాజిక న్యాయ మండలి (ఐఏసీహెచ్‌ఎల్‌ఎస్) చైర్మన్ జోగిందర్ సింగ్ బడోరియా సెప్టెంబర్ 23న సైఫుద్దీన్‌కు ఈ అవార్డు ప్రదానం చేశారు. అంతర్జాతీయ ఆహార పంపిణీ కార్యక్రమానికి సహకరించడంతోపాటు వేలాది కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందడానికి సైఫుద్దీన్ కృషి చేశారు. మహిళలు స్వయంసమృద్ధి సాధించడానికి కూడా శ్రమించారు. ఐఏసీహెచ్‌ఎల్‌ఎస్ అవార్డుకు 144 దేశాల్లో గుర్తింపు ఉంది.

వార్తల్లో వ్యక్తులుభారతీయ సంపన్నుల్లో ముకేశ్ అంబానీకి మొదటి స్థానంసెప్టెంబర్ 24న ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన భారత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానంలో నిలిచారు. 100 మందితో భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్‌‌బ్స మేగజీన్ రూపొందించింది. ముకేశ్ 18.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలువగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ 18 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 15.9 డాలర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

పాక్‌లో భారత రాయబారిగా గౌతమ్పాకిస్తాన్‌లో భారత రాయబారిగా గౌతమ్ బంబావాలే నియమితులయ్యారు. పాక్‌లో భారత రాయబారిగా ఉన్న టీసీఏ రాఘవన్ 2015 డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తున్నారు. రాఘవన్ స్థానంలో గౌతమ్ బాధ్యతలు చేపడతారు. అలాగే బ్రిటన్‌లో భారత రాయబారిగా నవతేజ్ సర్నా, చైనాలో భారత రాయబారిగా విజయ్ గోఖలే నియమితులయ్యారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సయ్యద్ అక్బరుద్దీన్‌ను నియమించారు. 

ఒబామా సలహా మండలిలో ముగ్గురు భారతీయ అమెరికన్లుఅమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ఓ ప్రధాన సలహామండలికి సభ్యులుగా ముగ్గురు భారతీయ అమెరికన్లను బరాక్ ఒబామా సిఫార్సు చేశారు. మొత్తం 14 మందిని సిఫార్సు చేయగా అందులో భారత సంతతికి చెందిన ప్రీతా బన్సల్, నిపున్ మెహతా, జస్జిత్ సింగ్ ఉన్నారు. మత పెద్దలు, లౌకికవాద నేతలు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే తాటిపైకి తేవడంపై ఈ సలహామండలి దృష్టిసారిస్తుంది. ప్రీతా బన్సల్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిపున్ మెహతా ‘సర్వీస్‌స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ‘సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా జస్జిత్ సింగ్ పనిచేస్తున్నారు.

మణిపూర్ గవర్నర్ కన్నుమూతమణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ (73) సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. 2015 మే 16న మణిపూర్ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసి మణిపూర్‌కు బదిలీ అయ్యారు. ఉర్దూలో డాక్టరేట్ సాధించి పలు రచనలు చేశారు. 1977లో కాంగ్రెస్‌లో చేరి నాగ్‌పాడా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పలుసార్లు మంత్రిగానూ పనిచేశారు. అహ్మద్ మృతితో మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్‌కు మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

జార్ఖండ్ టూరిజం అంబాసిడర్‌గా ధోనిCurrent Affirsభారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జార్ఖండ్ పర్యాటక శాఖ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ సెప్టెంబర్ 28న ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆన్ ఎక్స్‌ప్లోర్డ్ జార్ఖండ్ 2015’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘువర్‌దాస్ ధోనీని పర్యాటక శాఖ ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు చెప్పారు.

క్రీడలుసానియా- హింగిస్‌లకు గ్వాంగ్‌జౌ ఓపెన్ టైటిల్గ్వాంగ్‌జౌ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మిర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. చైనాలోని గ్వాంగ్‌జౌలో సెప్టెంబరు 26న జరిగిన ఫైనల్స్‌లో జు షిలిన్- యు జియోడి (చైనా) జోడీని ఓడించి వీరిద్దరు టైటిల్‌ను గెలుచుకున్నారు. 2015 సీజన్‌లో సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా హింగిస్‌కు ఆరో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెలెనా జంకోవిచ్ (సెర్బియా) గెలుచుకుంది. 

క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీబెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబరు 24న ఈ మేరకు ప్రకటన చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో క్యాబ్ పగ్గాలను గంగూలీ చేపట్టారు. 2016లో క్యాబ్ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్Current Affirs ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)లో సెప్టెంబరు 27న జరిగిన ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. ఇది పంకజ్‌కి 14వ టైటిల్.

హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 27న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలువగా నికో రోస్‌బర్గ్ రెండో స్థానం, వెటల్ మూడో స్థానంలో నిలిచారు.

ఖతర్‌లో 2022 సాకర్ ప్రపంచకప్2022 సాకర్ ప్రపంచకప్‌ను అరబ్ దేశం ఖతర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ఫిఫా సెప్టెంబర్ 25న ప్రకటించింది. 28 రోజుల పాటు జరిగే ఈ 22వ ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి ఖతర్ ఆతిథ్యమిస్తోంది. ఫిఫా ప్రంపచకప్‌ను నిర్వహిస్తున్న తొలి అరబ్, మధ్య ఆసియా దేశంగా ఖతర్ నిలిచింది. టోర్నీ 2022 నవంబర్ 21న మొదలై డిసెంబర్ 18 (ఖతర్ జాతీయ దినం)న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. జూన్-జూలైల్లో కాకుండా వేరే నెలల్లో జరుగుతున్న మొదటి ఫిఫా ప్రపంచకప్ ఇదే.

ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన 16వ ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు ఏడు పతకాలు సాధించారు. వీటిలో ఐదు రజతాలు కాగా రెండు కాంస్య పతకాలున్నాయి. తొలుత కపిల్ శర్మ, జస్విందర్ సింగ్, రాజేశ్ వర్మ, మహ్మద్ అజాద్‌ల తో కూడిన భారత బృందం తొలి రజతాన్ని అందించింది. అనంతరం దత్తు బబన్ భోకనాల్ పురుషుల సింగిల్స్‌లో రెండో రజతాన్ని భారత్ ఖాతాలో జమ చేశాడు. పురుషుల డబుల్స్ లైట్ వెయిట్, పురుషుల డబుల్స్, పురుషుల 8 ఈవెంట్ విభాగాల్లో భారత్‌కు రజతాలు దక్కాయి. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో దేవిందర్ సింగ్, నవీన్, పురుషుల లైట్‌వెయిట్ విభాగంలో దుష్యంత్ కాంస్యాలు అందించారు.

చాంపియన్స్ ట్రోఫీకి వెస్టిండీస్ అనర్హతదశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టు మినీ ప్రపంచకప్‌గా భావించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. 2015 సెప్టెంబర్ 30 వరకు ఐసీసీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కుతుంది. తాజాగా సెప్టెంబర్ 30న ప్రకటించిన ర్యాంకుల్లో విండీస్ 9వ స్థానానికి పడిపోయింది. దీంతో 1998 నుంచి సాగుతున్న ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ కరీబియన్ జట్టు ఆడలేకపోతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో పాక్, భారత్, దక్షిణాఫ్రికా జట్లను తమ అద్భుత ఆటతీరుతో వణికించిన బంగ్లాదేశ్ 9వ ర్యాంకు నుంచి 7కు చేరింది. ఈ ర్యాంకుతో 2006 అనంతరం మరోసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates