Ticker posts

9/recent/ticker-posts

Economy

గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేబినెట్ ఆమోదంగోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపింది. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభిస్తోంది. అదే విధంగా ఇళ్లకు పరిమితమవుతున్న బంగారాన్ని మార్కెట్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ పథకాలు ఉపయోగపడతాయి. వీటివల్ల బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తులను అభివృద్ధి చేసేందుకు బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఈ బాండ్లను జారీచేస్తుంది.
వ్యాపారానికి అనువైన రాష్ట్రాల్లో గుజరాత్‌కు మొదటి స్థానం
Current Affirs
వ్యాపారానికి అనువైన రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐఐపీ), సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక సెప్టెంబరు 14న విడుదలైంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం, జార్ఖండ్‌కు మూడో స్థానం లభించింది. తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అరుణాచల్‌ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. స్థల కేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు వంటి 8 ప్రాతిపదికల ఆధారంగా నివేదికను రూపొందించారు.

కరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం!నకిలీ కరెన్సీ నోట్ల నియంత్రణ దిశగా రూ.1000, రూ.500 నోట్లలో కొత్త నంబరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ముద్రా ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు సూచించింది. ఈ కొత్త నోట్లు వచ్చే ఏడాది మే నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో ఐఓసీఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్‌కు చెందిన అతిపెద్ద చమురు రిటైల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి 119వ స్థానం దక్కింది. ఇది 2015 సంవత్సరానికి గ్లోబల్ 500 రెవెన్యూలో అతిపెద్ద భారతీయ సంస్థగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచింది. గత 20 ఏళ్లుగా ఐఓసీ ఈ జాబితాలో చోటుదక్కించుకుంటోంది. ఇంతవరకు ఏ భారతీయ కంపెనీ కూడా ఫార్చ్యూన్ జాబితాలో ఐఓసీని అధిగమించలేదు.
జతియా హౌస్‌ను రూ.425 కోట్లకు కొన్న బిర్లా
Current Affirs
పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్‌లో ఉన్న జతియా హౌస్‌ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది భారీ మొత్తం. సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ రెండతస్తుల బంగళా.. బిల్టప్ ఏరియా సుమారు 25వేల చ.అ. ఉంటుంది. 1970లలో వై జతియా దీన్ని ఎంసీ వకీల్ నుంచి కొనుగోలు చేశారు.
గోల్డ్ బాండ్, డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదంగోల్డ్ బాండ్, పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 9, 2015వ తేదీన ఆమోద ముద్ర వేసింది. మెటల్‌గా (ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి, ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు.
డిపాజిట్ స్కీమ్:డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు) డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు.
గోల్డ్ బాండ్:గోల్డ్ బాండ్ పథకం వార్షిక గరిష్ట పరిమితి వ్యక్తికి 500 గ్రాములు. 5 నుంచి 7 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్ల జారీ జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారం, పసిడిని ఫిజికల్‌గా కాకుండా, భారత పౌరులు గోల్డ్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. 5, 10.50, 100 గ్రాముల చొప్పున ఈ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. వాటి కాలవ్యవధి 5 నుంచి 7 ఏళ్లు వుంటుంది. భారత పౌరులు, సంస్థలకు మాత్రమే ఈ బాండ్లను ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ కంటే ముందస్తుగా వీటిని అమ్మేందుకు వీలుగా ఎక్స్ఛేంజీలపై ఈ బాండ్లు ట్రేడవుతాయి.

ఆంధ్రాబ్యాంక్ ముద్రా కార్డు
Current Affirs చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారవేత్తల కోసం ఆంధ్రాబ్యాంకు ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్‌కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్‌లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షల లోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి.

పీఎంఎంవై రుణ లక్ష్యం 1.22 లక్షల కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద బ్యాంకులు రూ.1.22 లక్షల కోట్లను చిన్న వ్యాపార యూనిట్లకు రుణాలుగా అందించనున్నాయి. ముద్రా రుణాల కోసం బ్యాంకింగ్ రంగానికి రూ.1.22 లక్షల కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

జన్‌ధన్ యోజన్ ద్వారా రూ.22,000 కోట్లుకేంద్ర ప్రతిష్టాత్మక పథకం జన్‌ధన్ యోజన కింద 17.5 కోట్ల బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.22,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌలభ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా 2014, ఆగస్టు 28న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates