అంతర్జాతీయంఇరాన్‌పై ఆంక్షలు తొలగించిన అమెరికా, ఈయూఇరాన్‌పై విధించిన చమురు, ఆర్థిక ఆంక్షలను అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు ఎత్తేశాయి. దీంతో పాటు స్తంభింపచేసిన పదివేల కోట్ల డాలర్ల ఆస్తులను కూడా విడుదల చేశాయి. ఇరాన్, అమెరికాలు పరస్పరం బందీలను (ఖైదీలు) విడుదల చేశాయి. ఐక్యరాజ్యసమితి తనిఖీ బృందం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అణు కార్యక్రమ నియంత్రణకు సంబంధించి 2015 జూలైలో అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలతో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం అణు నియంత్రణ చర్యలు చేపట్టింది.
జకార్తాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడిఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు దాడులు జరిపారు. అధ్యక్షుని భవనానికి సమీపంలో, అమెరికా, ఫ్రాన్స్, ఐరాసా కార్యాలయాల పరిసరాల్లో జనవరి 14న కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి.
తైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సాయ్ ఇంగ్ వెన్ విజయంతైవాన్ పార్లమెంట్ ఎన్నికల్లో సాయ్ ఇంగ్ వెన్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) విజయం సాధించింది. డీపీపీ గెలుపుతో సాయ్ ఇంగ్ వెన్ తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. జనవరి 16న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఇంగ్ వెన్ పార్టీ 60 శాతానికి పైగా ఓట్లు సాధించింది. అధికార పార్టీ కేఎంటీకి 30 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతోప్రస్తుత అధ్యక్షుడు మా ఇంగ్ జౌ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశారు.
సిరియాలో 300 మంది ఊచకోతసిరియాలోని దేర్ ఎజార్ నగరంపై ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడి చేసి 300 మందిని ఊచకోత కోసిందని.. మరో 400 మందికి పైగా జనాన్ని బందీలుగా పట్టుకుందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సానా జనవరి 17న తెలిపింది. ఐసిస్ దాడుల్లో చనిపోయిన వారిలో 50 మంది ప్రభుత్వ సైనికులు కాగా.. మిగతా వారు పౌరులని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
భారత్‌లో ధనికుల సంఖ్య 2.36 లక్షలు
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపన్నుల పరంగా.. 2.36 లక్షల మందితో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఇక 12.60 లక్షల మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (6.54 లక్షల మంది), ఆస్ట్రేలియా (2.90 లక్షల మంది) కొనసాగుతున్నాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్-2016’ వెల్త్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులను కలిగిన వ్యక్తులను సంపన్నులుగా పరిగణించి అధ్యయనం చేశారు. టాప్ 10లో సింగపూర్ (2.24 లక్షల మంది, ఐదవ స్థానం), హాంకాంగ్ (2.15 లక్షల మంది, ఆరవ స్థానం), దక్షిణ కొరియా (1.25 లక్షల మంది, 7వ స్థానం), తైవాన్ (98,200 మంది, 8వ స్థానం), న్యూజిలాండ్ (89,000 మంది, 9వ స్థానం), ఇండోనేసియా (48,500, 10వ స్థానం) ఉన్నాయి.
పాక్ యూనివర్సిటీలో ఉగ్రదాడిపాకిస్తాన్‌లోని చార్‌సద్దాలో ఉన్న బాచాఖాన్ యూనివర్సిటీలోకి జనవరి 20న నలుగురు తాలిబన్ ఉగ్రవాదులు చొరబడి 20 మందిని హతమార్చారు. విద్యార్థులు, అధ్యాపకులు లక్ష్యంగా జరిగిన దాడిలో 20 మంది విగతజీవులవ్వగా.. 50 మంది వరకు గాయపడ్డారు. దాడి సమయంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న కెమిస్ట్రీ ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. టైస్టులను తన వద్దనున్న పిస్టల్‌తో కాసేపు నిలువరించి విద్యార్థులు తప్పించుకునేలా అవకాశం కల్పించారు. తాను మాత్రం ఉగ్రవాదుల కాల్పుల్లో నేలకొరిగాడు. అనంతరం యూనివర్సిటీని చుట్టుముట్టిన పాక్ సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాడికి తమదే బాధ్యతని ‘తెహరీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్’ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
జాతీయంగ్యాంగ్‌టక్‌లో రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సురాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు జనవరి 18న సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో జరిగింది.‘ సమ్మిళిత వ్యవసాయం, రైతుల సంక్షేమం’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సిక్కింను దేశంలోని తొలి సంపూర్ణ సేంద్రీయ రాష్ర్టంగా ప్రకటించి, సిక్కిం ముఖ్యమంత్రి చామ్లింగోకు ఆర్గానిక్ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొన్నారు.
స్టార్టప్‌లకు రాయితీలు ప్రకటించిన ప్రధాన మంత్రిప్రధాన మంత్రి నరేంద్రమోదీ జనవరి 16న న్యూఢి ల్లీలో ఆరంభ కంపెనీల (స్టార్టప్)కు పలు రాయితీలు ప్రకటించారు. స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా 19 అంశాల కార్యాచరణను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఇందులో భాగంగా స్టార్టప్‌లకు మూడేళ్లపాటు ట్యాక్స్‌హాలిడే, లాభాలపై చెల్లించే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు, రూ.10,000 కోట్లతో మూలధన నిధి ఏర్పాటు వంటి అంశాలున్నాయి. వీటితో పాటు తొమ్మిది రకాల కార్మిక, పర్యావరణ చట్టాలకు సంబంధించి స్టార్టప్ ఔత్సాహికులకు స్వీయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. తొలి మూడేళ్ల పాటు తనిఖీలు లేకపోవటం, సులభమైన పేటెంట్ విధానం, పేటెంట్ ఫీజులో 80 శాతం తగ్గింపు వంటి పోత్సాహకాలను స్టార్టప్ ఇండియా పోగ్రామ్ ద్వారా ప్రకటించారు.
ఎల్‌డీసీ, యూడీసీల స్థానంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లులోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ), అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)ల స్థానంలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 13న నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు సాంకేతిక నైపుణ్యం కలిగి బహుళ పనులను నిర్వహించే వారుగా ఉంటారు. కేంద్ర సచివాలయ సర్వీసు (సీఎస్‌ఎస్), కేంద్ర సచివాలయ స్టెనోగ్రాఫర్ సర్వీసు (సీఎస్‌ఎస్‌ఎస్)లలో ఇకపై నియామకాలు ఉండవు. అయితే ఈ సర్వీసులు కొంత కాలం కొనసాగనున్నాయి. రానున్న 20-25 ఏళ్లలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఆరో వేతన సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ విద్యలో ఏడాది డిప్లొమా కోర్సు చేసుండాలి.
తమిళనాడులో ‘అమ్మ కాల్‌సెంటర్’
ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వం ‘అమ్మ కాల్‌సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత జనవరి 19న 1100 టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కాల్‌సెంటర్ 24 గంటలు, 365 రోజులూ పనిచేస్తుంది. ప్రజా ఫిర్యాదుల కోసం ఇప్పటికే సీఎం స్పెషల్ సెల్ ఉన్నప్పటికీ, ఫిర్యాదులు సత్వర పరిష్కారం కోసం ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇప్పటికే అమ్మ పేరుతో అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఫార్మసీ, అమ్మ సిమెంట్ పేరిట పలు పథకాలు ఉన్నాయి.
రాష్ట్రీయంతెలంగాణకు కరువు సాయం రూ.791 కోట్లుతెలంగాణకు కరువు సాయంగా రూ.791 కోట్లు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ జనవరి 14న నిర్ణయించింది. రాష్ర్ట ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్ర బృందం కరువు ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలన అనంతరం అత్యున్నత కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రూ.2,500 కోట్ల మేర కరువు సాయం అందించాలని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ఏపీ కొత్త సీఎస్ ఎస్.పి. టక్కర్
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1981వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి సత్యప్రకాశ్ టక్కర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐ.వై.ఆర్.కృష్ణారావు జనవరి నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ప్రస్తుతం ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న టక్కర్‌ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆయన 2016 ఆగస్టు నెలాఖరు వరకు పదవిలో కొనసాగుతారు. మరోవైపు ప్రస్తుతం గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న 1982 బ్యాచ్‌కు చెందిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించనున్నారు.
ఆర్థికంరిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.1 శాతంగా నమోదువినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015, డిసెంబర్‌లో 5.61 శాతంగా నమోదైంది. ఇది గత నవంబర్‌లో 5.41 శాతంగా ఉంది. 2014, డిసెంబర్‌లో 4.28 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిలో ఒక శాతంపైన పెరిగింది. కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు పెరగటం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని కేంద్ర గణాంకాల శాఖ జనవరి 12న తెలిపింది. ఆహారం, పానియాల విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతంగా ఉంది.
ఫ్రాన్స్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితిఫ్రాన్స్‌లో జనవరి 18న ఆర్థిక అత్యవసర పరిస్థితిని (ఆ దేశంలో) ప్రకటించింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్య తీవ్రమవటంతో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చింది. దేశీయ వ్యాపార నమూనాను పునర్నిర్మించాల్సిన సమయం వచ్చిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 2.2 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రకటించారు.
క్షీణించిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం దేశంలో తటోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబర్‌లో -0.73గా నమోదైంది. ఇది గత పద్నాలుగు నెలల కాలం నుంచి మైనస్‌ల్లో కొనసాగుతుంది. దీంతో 2014, డిసెంబర్‌తో పోల్చినప్పుడు గత డిసెంబర్‌లో టోకు బాస్కెట్ రేటు క్షీణించింది. గత నవంబర్‌లో ఈ రేటు -1.99గా నమోదైంది. పండ్లు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల రేట్లు పెరగటంతో డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణంలో కొద్ధిగా పెరుగుదల కన్పించింది. ఈ గణాంకాలను కేంద్రం జనవరి 14న విడుదల చేసింది.
ఆధార్‌తో ఏటా 6,700 కోట్లు ఆదా: ప్రపంచ బ్యాంకుఆధార్ వల్ల భారత ప్రభుత్వానికి ఏటా వంద కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు) ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2016: డిజిటల్ డివిడెండ్స్’ పేరుతో ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ ఆధార్ డిజిటల్ గుర్తింపు కార్డ్ వల్ల అవినీతి తొలగిపోయి భారీ మొత్తంలో నిధులు ఆదా అవుతాయని ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు చెప్పారు.
భారత్ వృద్ధి రేటు 7.5 శాతం: ఐక్యరాజ్యసమితిభారత్ 2016 ఆర్థికాభివృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి తగ్గించింది. ఇదివరకు అంచనా 8.2 శాతం కాగా సంస్కరణల అమల్లో జాప్యం కారణంగా దీనిని 7.5 శాతానికి తగ్గించింది. యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) రూపొందించి నివేదిక ప్రకారం భూ సేకరణ, కార్మిక చట్టాలు, వస్తు, సేవల పన్ను వంటి అంశాల సంస్కరణల్లో ముందడుగు పడితే దేశం వృద్ధి బాట పడుతుందని తెలిపింది.
స్టార్టప్‌ల కోసం ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్ బ్రాంచ్
స్టార్టప్‌ల కోసమే ప్రత్యేక బ్రాంచీని ‘ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్’ (SBI InCube) పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంగళూరులో జనవరి 14న ప్రారంభించింది. దీంతో పాటు ఎక్స్‌క్లూజిఫ్(Exclusif) పేరుతో వెల్త్‌మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్‌లకు సలహాపూర్వక సేవలను ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్ సమకూరుస్తుంది. ప్రారంభంలో ఎస్‌బీఐ ఇన్‌క్యూబ్ ఎలాంటి రుణాలివ్వకుండా స్టార్టప్‌లకు ఆర్థిక నిర్వహణ సేవలందించనుంది.
వ్యాపారానికి భారత్ అనుకూలం: పీడబ్ల్యూసీ నివేదికవ్యాపారానికి అత్యంత అనుకూలమైన తొలి ఐదు దేశాల్లో భారత్‌కు చోటుదక్కింది. దేశ, విదేశీ కంపెనీలకు అత్యుత్తమ అవకాశాలు భారత్‌లో లభిస్తున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ప్రైజ్ వాటర్‌హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) నిర్వహించిన గ్లోబల్ సీఈఓ సర్వేలో వెల్లడైంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో జనవరి 20న ఈ నివేదిక విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లోని 1,409 మంది సీఈఓలను ప్రశ్నించి, వారిచ్చిన సమాధానాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. అభివృద్ధికి పుష్కల అవకాశాలున్న టాప్ 5 దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, యునెటైడ్ కింగ్‌డమ్, భారత్ చోటు సాధించాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీతొలి సేంద్రీయ రాష్ట్రంగా సిక్కిం75 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని సేంద్రీయ, సుస్థిర సాగు కిందకు తీసుకురావడం ద్వారా దేశంలోనే తొలి ఆర్గానిక్ స్టేట్‌గా సిక్కిం అవతరించింది. ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ మార్గదర్శకాలకు అనుగుణంగా 75 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని క్రమంగా సేంద్రీయ సాగు పద్ధతిలోకి మార్చారు. 2003లో పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ పద్ధతిలోనే భూమిని సాగు చేయాలని తీర్మానించడంతో క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల అమ్మకాన్ని నిషేధించి రైతులు సేంద్రీయ సాగును అనుసరించాల్సిన తప్పని పరిస్థితిని కల్పించారు.
పీఎస్‌ఎల్వీ-సీ31 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... జనవరి 20న పీఎస్‌ఎల్వీ-సీ31 రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ద్వారా జీపీఎస్ తరహాలో దేశీయంగా సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ మరింత బలోపేతం కానుంది. ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో మొత్తంగా 51వ విజయాన్ని, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 32వ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత ఉపఖండంలో క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ (రీజనల్ నావిగేషన్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)ను రూ.3,425 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ, 1బీ, 1సీ, 1డీలతో తాజాగా ‘1ఈ’ ఉపగ్రహంతో కలిపి ఐదింటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 2016 మార్చి 10, 28 తేదీల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్’ వ్యవస్థ భారతదేశం మొత్తంతో పాటు చుట్టూ మరో 1,500 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే జీపీఎస్ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్డు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నెలాఖరుకు స్వదేశీ నావిగేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ఇస్రో అధికారులు ప్రకటించారు.
వార్తల్లో వ్యక్తులుసిక్కిం మాజీ గవర్నర్ రామారావు మృతిభారతీయ జనతా పార్టీ నాయకుడు, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు అనారోగ్యంతో జనవరి 17న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 1966, 72, 78, 84లలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 2002-2005 మధ్య సిక్కిం గవర్నర్‌గా పనిచేశారు.
టాటా మోటార్స్ సీఈవోగా బషెక్
టాటా మోటార్స్ కొత్త సీఈవో, ఎండీగా ఎయిర్‌బస్ మాజీ సీవోవో అయిన గ్యుంటర్ బషెక్ (55) నియమితులయ్యారు. ఫిబ్రవరి 15 నుంచి బాధ్యతలు చేపట్టనున్న బషెక్ భారత్, దక్షిణ కొరియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారని టాటా మోటార్స్ తెలిపింది. 2014 జనవరి 26న కార్ల్ స్లిమ్ మరణం తర్వాత టాటా మోటార్స్ ఎండీ స్థానం ఖాళీగానే ఉంది.
ప్రపంచ కురువృద్ధుడి మృతిజపాన్‌కు చెందిన ప్రపంచ కురువృద్ధుడు యసుటారో కొయిడే(112) జనవరి 19న మరణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడిగా గిన్నిస్ రికార్డ్స్‌లో గతేడాది చోటు దక్కించుకున్న కొయిడే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొయిడే 1903 మార్చిలో జన్మించారు. ఇంతకు ముందు సకారి మొమొయ్(112) పేరిట ఈ రికార్డు ఉండగా, ఆయన 2015 ఆగస్టులో మృతి చెందడంతో కొయిడేను అతిపెద్ద వయస్కుడిగా అధికారులు గుర్తించారు.
అవార్డులుసాహస బాల రుచితకు గీతా చోప్రా అవార్డు
తెలంగాణలోని శివ్వంపేట్‌కు చెందిన రుచితకు ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డు దక్కింది. 8 ఏళ్ల ఈ చిన్నారి తెలంగాణలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు చిన్నారుల ఊపిరి నిలబెట్టడంలో ప్రదర్శించిన సాహసానికి ఈ అవార్డును దక్కించుకుంది. తెలంగాణకు చెందిన మరో చిన్నారి సాయికృష్ణ అఖిల్ కిలాంబికి కూడా జాతీయ సాహస బాలల పురస్కారం దక్కింది. మొత్తం 25 మందిలో ఇద్దరికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. తన నలుగురు మిత్రులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన గౌరవ్ సహస్రబుద్దెకు ప్రతిష్టాత్మక సాహస భారత్ అవార్డు దక్కింది. జనవరి 18న 25 మంది చిన్నారులకు (22 మంది బాలురు, ముగ్గురు బాలికలు) కేంద్రం జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించింది. పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 24న అందజేస్తారు.
క్రీడలుసిడ్నీ ఓపెన్ టైటిల్ విజేతలుగా సానియా-హింగిస్ జోడి
సానియా-హింగిస్ జోడీ సిడ్నీ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకొంది. ఈ జోడీ జనవరి 15న జరిగిన ఫైనల్లో కరోలిన్ గార్సియా- క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్)లను ఓడించింది. దీంతో పాటు జనవరి 14న జరిగిన సిడ్నీ ఓపెన్ సెమీ ఫైనల్స్ విజయంతో వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి సానియా-హింగిస్‌ల జోడి రికార్డు సృష్టించింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో మహిళల డబుల్స్‌లో 1994 తర్వాత అత్యధిక మ్యాచులు నెగ్గిన జోడీగా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 1994లో గిగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికన్)-నటషా జ్వెరెవా (బెలారస్) జోడీ పేరిట వరుసగా 28 మ్యాచ్‌లు నెగ్గిన రికార్డు ఉంది.
ఢిల్లీ ఏసర్స్‌కు పీబీఎల్ టైటిల్ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టైటిల్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు గెలుచుకొంది. న్యూఢిల్లీలో జనవరి 17న జరిగిన ఫైనల్లో ముంబై రాకెట్స్ జట్టును ఢిల్లీ ఏసర్స్ ఓడించింది.
భారత మహిళా క్రికెట్ జట్టు మేనేజర్‌గా విజయలక్ష్మిజనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లే భారత మహిళా క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన మహిళ ఎంపికయ్యారు. విజయనగరంలోని మహారాజా ఉమెన్స్ కళాశాలలో ఫిజికల్ డెరైక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ పి.విజయలక్ష్మిని మహిళా క్రికెట్ జట్టు మేనేజర్‌గా నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జనవరి 16న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విజయలక్ష్మి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమెన్ వింగ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
చండీలాపై జీవిత కాల నిషేధంఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆఫ్ స్పిన్నర్ అజిత్ చండీలాపై జీవిత కాల నిషేధం విధించారు. జనవరి 18న శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే సహచర ఆటగాడిని ఫిక్సింగ్ కోసం సంప్రదించినందుకు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికేన్ షాపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2013లో జరిగిన ఐపీఎల్ ఆరో సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చండీలా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వకంగా పేలవ ప్రదర్శన కనబరచడం, మరో ఆటగాడితో ఫిక్సింగ్ చేయించాలని ప్రయత్నించిన ఆరోపణల్లో దోషిగా తేలడంతో బోర్డు ఈ చర్య తీసుకుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత యూపీదేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలుచుకుంది. జనవరి 20న ముంబైలో జరిగిన ఫైనల్లో యూపీ 38 పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది. ఈ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలవడం ఇదే మొదటి సారి. రంజీ ట్రోఫీకి ఆడే టీంలే ఈ టి20 ట్రోఫీలో పాల్గొంటాయి. ఈ ట్రోఫీని తొలిసారి 2009-10 సీజన్‌లో నిర్వహించారు. సయ్యద్ ముస్తాక్ అలీ తొలి ట్రోఫీని ముంబై గెలుచుకుంది. బరోడా, గుజరాత్ చెరో రెండు సార్లు కైవసం చేసుకున్నాయి.

0 Comments