Ticker posts

9/recent/ticker-posts

గ్రంథులు - విధులు



(TS TRT-2017 & AP TRT - 2018 Exams Useful Meteriel)
 

*పిట్యూటరీ గ్రంథి*
» దీన్నే పీయూష గ్రంథి అని కూడా అంటారు.
» ఈ గ్రంథి దాదాపు 10 లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్‌లను స్రవిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు.
» ఇది మెదడు కింది భాగంలో బఠాని గింజ పరిమాణంలో ఉంటుంది.
» పెరుగుదల హార్మోన్, ఇతర హార్మోన్‌లను ఇదే ప్రేరేపిస్తుంది.
» పెరుగుదల హార్మోన్ లోపిస్తే మరుగుజ్జుతనం వస్తుంది.


*పారాథైరాయిడ్*
» ఇది థైరాయిడ్ గ్రంథికి దగ్గరలో ఉంటుంది.
» పారాథార్మోన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
» ఈ గ్రంథి కాల్షియం, ఫాస్పేట్‌ల వ్యాప్తిని క్రమబద్ధం చేస్తుంది.
» ఎముకలు వృద్ధి చెందడానికి ఇది చాలా కీలకం.


*క్లోమ గ్రంథి*
» దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు.
» ఉదర భాగంలో జీర్ణాశయం కింద ఉంటుంది.
» ఇన్సులిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
» ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది.
» శరీరంలో తగినంత ఇన్సులిన్ విడుదల కాకపోతే డయాబెటిస్ (షుగర్) వ్యాధి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి
» దీన్నే అవటు గ్రంథి అని కూడా అంటారు.


*థైరాయిడ్ గ్రంథి*
» ఇది గొంతు దగ్గర వాయు నాళానికి ఆనుకుని ఉంటుంది.
» ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
» మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవుతుంది.
» థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవడం వల్ల 'గాయిటర్' అనే వ్యాధి వస్తుంది.
» ఈ హార్మోన్ యుక్త వయసులో లోపిస్తే 'క్రెటినిజం' అనే వ్యాధి వస్తుంది.
» వయోజన దశలో ఈ హార్మోన్ లోపిస్తే 'మిక్సిడెమ' అనే వ్యాధి వస్తుంది. ఎడ్రినల్ గ్రంథి » దీన్నే అధివృక్క గ్రంథి అని కూడా అంటారు.


*ఎడ్రినల్ గ్రంథి*
» ఇది మూత్రపిండాలపై ఉంటుంది.
» ఎడ్రినలిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
» ఒత్తిడి, కోపం, భయాందోళనలకు గురైనప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది.
» ఎడ్రినలిన్ హృదయ స్పందన రేటును, కండరాలకు రక్త సరఫరా రేటును పెంచుతుంది.


*పురుష బీజకోశాలు*
» వృషణాల్లో ముష్క గోణుల్లో పురుష బీజ కోశాలుంటాయి.
» పురష లైంగిక హార్మోన్లు అయిన టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్‌లను ఇవి ఉత్పత్తి చేస్తాయి.
» వీటి వల్ల గౌణ లైంగిక లక్షణాలు వృద్ధి చెందుతాయి.
» పురష సంయోగ బీజాలైన శుక్రకణాల ఉత్పత్తిలో ఈ హార్మోన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.


*స్త్రీ బీజ కోశాలు*
» ఇవి మూత్రపిండాలకు దిగువన ఉంటాయి.
» స్త్రీ లైంగిక హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లను ఇవి స్రవిస్తాయి.
» ఈ హార్మోన్‌లను స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాల్ని అభివృద్ధి చేస్తాయి.
» ఇవే హార్మోన్‌లు స్త్రీలలో రుతుచక్రాన్ని, ప్రత్యుత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తాయి.

FOLLOW US ON TWITTER

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates